ఏ మాత్రం ప్రమాదకరం కాని రీతిలో ఉండే ఒక జీవసంబందమైన అంశాన్ని తీసుకొని టీకాను తయరుచేస్తారు. ఒక రోగకారక సుక్ష్మ జీవిని పూర్తిగా బలహీనంగా చేసిగానీ, లేదా హనిచేయని మృత సూక్ష్మజీవినిగానీ, లేదా సుక్ష్మజీవిలోని జన్యుపరమైన అంశాలను ప్రమదరహితంగా మార్చి గానీ, శరీరంలోకి పంపిగానీ, టీకా రూపంలో ఇస్తారు. దీని వలన మన శరీరంలోని రోగ నిరోధక శక్తి వాటితో పోరాడటం ప్రారంభించే క్రమంలో కొన్ని యాంటీబాడీస్ ను తయారు చేసుకుంటుంది. ఎప్పుడైనా ప్రమాదవశాత్తు మళ్ళీ ఆ రోగ కారక సూక్ష్మజీవి శరీరంలోకి ప్రవేశిస్తే దాన్నిశరీరం (ఇమ్యూనలాజికల్ మెమరీ) గుర్తించి, దాంతో పోరాడి, దాని కారణంగా వచే జబ్బును నివారిస్తుంది. ఇలా టీకా మనకు రక్షణ కలిగిస్తుంది.
పుట్టిన నాటి నుండి ఏయె వేళలలో ఇవ్వాల్సిన టీకాలు ఆయా వేళలు ఇప్పించటం ద్వారా పోలియో, డిప్తీరియా, మంప్స్, ధనుర్వాతం (టెటానస్), పొంగు వంటి అనేక జబ్బులను రాకుండా నివారించుకోవచ్చు. మన దేశంలో సైంటిఫిక్ కమిటీల సిఫార్సుల మేరకు "నేషనల్ ఇమ్యూనైజేషన్" ప్రోగ్రామ్ తో పాటు, "ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్", ఏయె సమయాల్లో వేయాలో సిఫార్సు చేసారు.
వ్యాధితో పోలిస్తే, వాక్సిన్ వల్ల వచ్చే దుష్ప్రభావాలు చాలా అరుదు లేదా తక్కువ. అయితే అరుదుగా వ్యాక్సిన్ ఇచ్చాకా కొన్ని సార్లు కొన్ని దుష్ప్రభావాలు కనిపించవచ్చు. దానికి అనేక కారణాలుంటాయి. అనేక వాక్సిన్ కలిపి ఇచ్చే కలయికలో ఏది ఎంత మోతాదులో కలవారిలో అది జరగకపోవడం; వ్యాక్సిన్ తయారీ సమయంలోనే తప్పు దొర్లడం; వ్యాక్సిన్ ఇంజెక్షన్ ఇవ్వాల్సిన ప్రదేశాల్లో ఇవ్వడం; స్టెరిలైజెషన్ పద్దతులను అనుసరించకపోవడం; వ్యాక్సిన్ సరిగా నిల్వ చేయకపోవడం వంటి సందార్బాల్లో వాక్సిన్ విఫలం కావచ్చు. వాక్సిన్ ఇచ్చే సమయంలో తప్పులు దొర్లకుండా ఉండాలంటే, పైన పెర్కొన్న అంశాలను దృష్టిలో పెట్టుకుని వాటన్నిటిని నిరోధించాలి. అంతేకాని ఏవైనా పొరపాట్ల వల్ల జరిగిన పరిణామాలని వ్యాక్సిన్ కు ఆపాదించకూడదు. వ్యాక్సిన్ల పట్ల ప్రజలలో నమ్మకం తొలగించే ఎలాంటి చర్యలకు పాల్పడకూడదు.
వ్యాక్సిన్లలో అనేక రకాల కాంబినేషన్స్ ఉన్నాయి. ఇందులో ఫలానావి మంచివనీ, ఫలానావి కావని కొందరు అంటుంటారు. దాంతో ఏవి మంచివి, ఏవి కావనే విషయంలో సాదారణ ప్రజల్లో అనేక సందేహాలు, అపోహలు ఉంటాయి. అయితే గుర్తుపెట్టుకోవలసిన అంశం ఏమిటంటే- "ప్రపంచ ఆరోగ్య సంస్థ" (డబ్ల్యూహెచ్ ఓ) ఆమోదం ఉన్న ఏ వాక్సిన్ ను అయినా నిరభ్యంతరంగా వాడవచ్చు.
ఇక కొందరికి ప్రభుత్వ ఆసుపత్రులలో ఇచే కొన్ని వాక్సిన్లపై సందేహం ఉంటుంది. నిజానికి ప్రభుత్వ ఆసుపత్రులలో ఇచ్చే వాక్సిన్లు కూడా చాలా నాణ్యమైనవే.
Image source:Gettyimages.in