Health Tips in HindiHealth Tips

గుండె ఆరోగ్యాన్ని గాయపరిచే అలవాట్లు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Jun 25, 2014

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

శరీర భాగాలలో గుండె చాలా సున్నితమైన మరియు ముఖ్యమైన భాగం. గుండె శరీరంలో చాలా రకాల విధులను నిర్వహిస్తుంది. గుండెకు హాని కలిగించే కొన్ని రకాల చెడు అలవాట్లు ఇక్కడ తెలుపబడ్డాయి.
  • 1

    పొగత్రాగటం

    పొగత్రాగటం వలన గుండె సంబంధిత వ్యాధులు మాత్రమే కాకుండా చాలా రకాల ఆరోగ్య సమస్యలు కలుగుతాయి. దీని వలన అమితంగా గుండెపోటు వచ్చే అవకాశం పెరుగుతుంది మరియు గుండెపోటు రాకుండా ఉండాలి అనుకుంటే ముందుగా మనేయాల్సిన అలవాటు ఇదే.

  • 2

    భౌతిక కార్యకలపాలు చేయటం

    గుండె ఆరోగ్యంగా ఉండాలి అనుకున్నపుడు, వ్యాయామాలు ఖచ్చితంగా చేయాలి మరియు రోజులో శరీరం నుండి 500-950 క్యాలోరీలను వినియోగింపబడాలి. తక్కువ వ్యాయామాలు చేయటం వలన గుండె సంబంధిత వ్యాధులు అధికమయ్యే అవకాశం ఉంది.

  • 3

    నిద్ర

    'యూ.ఎస్ న్యూస్ & వరల్డ్ రిపోర్ట్' ప్రకారం, ఎవరైతే రాత్రి సమయం ఎక్కువ విశ్రాంతి తీసుకుంటారో వారిలో గుండెపోటుకు కారణమయ్యే ధమనులలో అడ్డంకులు ఇతరేతర సమస్యలు తక్కువగా కలుగుతాయి. తక్కువ విశ్రాంతి తీసుకునే వారు ఎక్కువగా గుండె సంబంధిత వ్యాధులకు గురవుతారు అని ప్రయోగాత్మకంగా తెలుపబడింది.

  • 4

    ఒత్తిడి

    'అమెరికన్ హార్ట్ అసోసియేషన్' ప్రకారం, ప్రతికూల భావోద్వేగాలు అయినట్టి కోపం, పగ వంటి వాటి వలన రక్త పీడనం అధికం అవుతుంది. ఎవరైతే ఎక్కువ డిప్రెషన్'లకు గురవుతారో వారిలో 4 రెట్లు గుండె సంబంధిత వ్యాధులు అధికం అయ్యే అవకాశం ఉంది.

  • 5

    ఫాస్ట్ ఫుడ్

    తక్కువ కొవ్వు పదార్థాలను తీసుకోవటం వలన మీ గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఎక్కువ చక్కెరలు ఉన్న మరియు ట్రాన్స్ ఫాట్స్ ఉన్న ఆహారాలను తీసుకోవటం వలన గుండె సంబంధిత వ్యాధులు అధికమయ్యే అవకాశం ఉంది. ఒమేగా-3 ఫాటీ ఆసిడ్ ఉన్న ఆహార పదార్థాల వలన గుండెపోటు తక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఫాస్ట్ ఫుడ్ గుండెపోటు అధికం అవటాన్ని రెట్టింపు చేస్తుంది.

  • 6

    స్థూలకాయత్వం

    స్థూలకాయత్వం అనేది అలవాటు కాదు, కానీ చెడు అలవాట్లు, చెడు ఆహర పదార్థాలను తినటం వలన కలుగుతుంది. 'అమెరికన్ హార్ట్ అసోసియేషన్' ప్రకారం, స్థూలకాయత్వం వలన శరీరంలో కొవ్వు పదార్థాల స్థాయిలు, అధిక రక్త పీడనం వంటి గుండె సంబంధిత వ్యాధులు అధికం అయ్యే కారకాలను ఎక్కువ చేస్తుంది.

  • 7

    ఆల్కహాల్

    'అమెరికన్ హార్ట్ అసోసియేషన్' ప్రకారం, మితిమీరిన మోతాదులో ఆల్కహాల్ తీసుకోవటం వలన రక్త పీడనం పెరుగుతుంది మరియు గుండె వైఫల్యానికి గురవుతుంది. మితిమీరిన ఆల్కహాల్ సేకరణ అన్ని విధాల మీ గుండెకు మరియు ఆరోగ్యానికి హానికరం.

  • 8

    గురకలు

    గురకలు అనేవి నిద్రలో ఒక రకమైన వ్యాధిగా చెప్పవచ్చు, నిద్రపొయే సమయంలో గురకలు పెట్టడం వలన అంతరాయాలు కలుగుతాయి మరియు దీని వలన రక్త పీడనం పెరుగుతుంది. అనగా దీని వలన కూడా గుండె సంబంధిత వ్యాధులు కలిగే అవకాశం ఉంది.

  • 9

    మాంసం అధికం తినటం

    రెడ్ మీట్'లో గుండెపోటును అధికం చేసే సాచురేటేడ్ ఫాట్'లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఆరోగ్యకరమైన ఆహర సేకరణ, తక్కువ రెడ్ మీట్ తినటం వలన గుండెపోటు నుండి ఉపశమనం పొందవచ్చు.

  • 10

    మందులను సరిగా వాడకపోవటం వలన

    మందులను వాడకంలో లోపాలు చాల సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. ఒక్కసారి ఆరోగ్యంగా ఉన్నాము అనిపించాక, మందులను వాడటం మానేస్తాము. మీకు అధిక రక్తపోటు ఉన్నపుడు ఆ లక్షణాలు బహిర్గతం అవకున్నను మీ గుండె ప్రమాదంలో ఉన్నట్టే. కావున మందులను వాడకాన్ని విడిచిపెట్టకండి.

    Tags:
  • గుండెకు హాని కలిగించే అలవాట్లు
  • చెడు అలవాట్లు
  • Bad habits for heart health in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • గుండె ఆరోగ్యాన్ని గాయపరిచే అలవాట్లు

    శరీర భాగాలలో గుండె చాలా సున్నితమైన మరియు ముఖ్యమైన భాగం. గుండె శరీరంలో చాలా రకాల విధులను నిర్వహిస్తుంది. గుండెకు హాని కలిగించే కొన్ని రకాల చెడు అలవాట్ల
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • గుండె ఆరోగ్యాన్ని గాయపరిచే అలవాట్లు

    శరీర భాగాలలో గుండె చాలా సున్నితమైన మరియు ముఖ్యమైన భాగం. గుండె శరీరంలో చాలా రకాల విధులను నిర్వహిస్తుంది. గుండెకు హాని కలిగించే కొన్ని రకాల చెడు అలవాట్ల