Health Tips in HindiHealth Tips

నెలలో పెళ్ళా? శరీరాకృతిని మంచి షేప్ లో మార్చే చిట్కాలు మీ కోసమే...

By:P Raj Kumar, Onlymyhealth Editorial Team,Date:Nov 11, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

కొన్ని వారాలలో మీ వివాహ మహోత్సవం ఉందా? మీ శరీర ఆకృతి పట్ల చింతిస్తున్నారా? మరేం పర్లేదు ఇక్కడ తెలిపిన చిట్కాల ద్వారా శరీర బరువు తగ్గించుకొని, మంచి శరీరాకృతిని పొందవచ్చు.
  • 1

    ముందుగా శరీర భాగాన్ని ఎంచుకోండి

    ఉదరభాగం, తొడలు లేదా పిరుదులు ఏ భాగం యొక్క ఆకృతి మార్చుకోవాలి అనుకుంటున్నారు? ఏ శరీర భాగాన్ని మంచి ఆకృతికి మార్చుకోవాలి అనుకుంటున్నారో ముందు ఎంచుకోండి. ఆ ప్రాంతాలు లేదా ప్రాంతానికి తగిన వ్యాయామాలు మరియు ఆహార ప్రణాలికలను పాటించండి. మీరు ఎంచుకునే ప్రణాళికలు ఆరోగ్యకరమైనవిగా ఉండాలి. ఖచ్చితమైన నియమాలను ఏర్పరచుకొని, వాటిని అనుసరించి, వివాహంలో మంచి ఆకృతిని కనబరిచేలా చూసుకోండి.

  • 2

    ఆహార సేకరణకు ప్రణాళిక

    మంచి ఆకృతి పొందుటకు, ఆరోగ్యకరమైన ఆహారం ఎలా వండాలో మరియు ఎలా తీసుకోవాలో తెలిసి ఉండాలి. మీ పోషకాహార నిపుణుడితో మాట్లాడి, పోషకాలను అధికంగా గల ఆహార ప్రణాళికను సిద్దం చేపించుకోండి. మీకు ఇష్టమైన ఆహారాలతోనే ప్రణాళికను సిద్దం చేసుకొని, పాటించండి.

  • 3

    ఏరోబిక్ కార్యాలు

    ఏరోబిక్ కార్యాలు మంచి వినోదంతో పాటూ, కేలోరీలను తగ్గించి శరీరాకృతిని ఆకర్షణీయంగా మారుస్తాయి. రన్నింగ్, జంప్, రోప్, జాగింగ్, సైక్లింగ్ లేదా స్విమ్మింగ్ వంటి కార్యాలు మంచి ఫలితాలను చేకూరుస్తాయి. కావున వివాహానికి నెల ముందు నుండి ఏరోబిక్ చేయటం అలవాటు చేసుకోండి.

  • 4

    స్వతహాగా ప్రేరేపించుకోండి

    వివాహంలో మంచి ఆకృతి కనపడాలి అనుకుంటున్నారా? మీ దగ్గర ఎంత సమయం ఉందో దాని గురించి ఆలోచించకండి. మంచి ప్రణాళిక తయారు చేసుకొని, దానిని అనుసరించటంపై మీ దృష్టిని కేంద్రీకరించండి. మీరు ప్రేరేపితంగా ఉండటానికి మీ బరువు మరియు ఆకారాన్ని తరచుగా కొలుచుకుంటూ ఉండండి. త్వరగా ఫలితాలను పొందలేము కావున నిరాశకు గురి కాకుండా, మీ ప్రయత్నాన్ని కొనసాగించండి. సమయానికి అనుగుణంగా ఫలితాలు వాటంతట అవే వస్తుంటాయి.

  • 5

    ఎపుడైనా ఆరోగ్యకర జీవనశైలిని అనుసరించండి

    మీరు పాటించే జీవనశైలి ఆధారంగానే మీ ఆరోగ్యం, శరీర ఆకృతి ఉంటుంది. కావున ఎల్లపుడు ఆరోగ్యకర జీవనశైలిని అనుసరించండి; మంచి ఆహార ప్రణాళిక, వ్యాయామాలు, సరైన సమయం పాటూ నిద్ర వంటివి మిమ్మల్ని అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంచుతాయి. Image source: Getty Images

    Tags:
  • బరువు తగ్గించే చిట్కాలు
  • తక్కువ సమయంలో శరీరాకృతిని మార్చే చిట్కాలు
  • బరువు తగ్గించే వ్యాయామాలు
  • వివాహంలో మిమ్మల్ని సన్నగా కనపడేలా చేసే చిట్కాలు
  • Vivahamlo manchi shareraakrutini kanapadela chese chitkalu
  • Weight loss diet plan in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • పెదాలను మృదువుగా మార్చే గ్లిసరిన్

    అందమైన పెదాలు మీ నవ్వుకు మాత్రమే కాదు ముఖ సౌందర్యాన్ని పెంచుతాయి. పెదాలకు కాస్మెటిక్ లను వాడటం ఇష్టం లేదా? అయితే గ్లిసరిన్ మీకు తప్పక సహాయపడుతుంది. గ్
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • పెదాలను మృదువుగా మార్చే గ్లిసరిన్

    అందమైన పెదాలు మీ నవ్వుకు మాత్రమే కాదు ముఖ సౌందర్యాన్ని పెంచుతాయి. పెదాలకు కాస్మెటిక్ లను వాడటం ఇష్టం లేదా? అయితే గ్లిసరిన్ మీకు తప్పక సహాయపడుతుంది. గ్