Health Tips in HindiHealth Tips

శీతాకాలంలో కళ్ళను సంరక్షించుకోటానికి చిట్కాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Dec 12, 2014

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

అందమైన ప్రపంచాన్ని చూడటానికి మరియు అందాన్ని ఆస్వాదించటానికి కళ్ళు తప్పని సరి. కానీ, రోజు మొత్తం కళ్ళు పని చేయటం వలన ఒత్తిడికి గురవుతాయి, అంతేకాకుండా, కంటి వ్యాధులకు కూడా గురయ్యే అవకాశం ఉంది, కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని సూచనలు తెలుపబడ్డాయి.
  • 1

    కళ్ళను జాగ్రత్తగా చూసుకోండి

    చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడటానికి ఉపయోగపడేవి కళ్ళు. కంటి వ్యాధులు మరియు ఇతర కారణాల వలన కంటి చూపు పోవటానికి అవకాశం ఉంది. కళ్ళు లేని జీవితాన్ని ఉహించుకోలేము. శీతాకాలంలో కళ్ళ ఆరోగ్యాన్ని మరియు కంటి చూపును సంరక్షించుకోనుటకు కొన్ని సూచనలు ఇక్కడ తెలుపబడ్డాయి.Image Courtesy: Getty

  • 2

    కంటికి విశ్రాంతి

    మీరు విద్యార్థి, ఉద్యోగస్తులు లేదా ఇంట్లోనే పని చేసే వారైన, రోజు మొత్తం మీ కళ్ళు పని చేసి ఒత్తిడికి గురవుతాయి. కంప్యూటర్ ముందు ఎక్కువ సమయం పని చేయటం వలన కళ్ళు చాలా శ్రమకు గురవుతాయి. మీ కళ్ళకు ప్రమాదం జరగక ముందే తగిన చర్యలను తీసుకోండి. కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి తగిన సమయం పాటూ విశ్రాంతి చేకూర్చండి. మీ కళ్ళు నిరంతరాయంగా ఒత్తిడికి గురవుతాయి కావున చిన్న చిన్న విరామాలను ఇవ్వండి. కళ్ళు ఆరోగ్యంగా ఉండటానికి ఉన్న మంచి దారి రోజు తగిన సమయం పాటూ విశ్రాంతి చేకూర్చటం.Image Courtesy: Getty

  • 3

    క్రమంగా చెక్ చేపించుకోవటం

    మీ కళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవాలి, కానీ మీ కళ్ళు ఎంత వరకు ఆరోగ్యంగా ఉన్నాయో లేదో ఎలా తెలుస్తుంది? కళ్ళు మరియు కంటి చూపు ఆరోగ్యంగా ఉండటానికి క్రమంగా చెక్ చేపించుకోవటం వలన ఏ రకమైన జాగ్రత్తలు పాటించాలో మరియు ఎంత వరకు పాటించాలో తెలుస్తుంది. సంవత్సరానికి ఒకసారి లేదా కనీసం రెండు సంవత్సరాలకు ఒకసారైన కళ్ళ కోసం వైద్యుడిని సంప్రదించండి. కంటి పరీక్ష వలన కళ్ళ ఆరోగ్యం మరియు ఎవైన వ్యాధులకు గురయ్యాయా? లేదా డయాబెటిక్ రేటినోపతీకి గురయ్యాయా? వంటి విషయాలను తెలుసుకోవచ్చు.Image Courtesy: Getty

  • 4

    తరచుగా వ్యాయామాలు

    వాకింగ్, స్విమ్మింగ్ వంటివి శరీరాన్ని ఫిట్'గా ఉంచటం మాత్రమే కాకుండా, కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని పరిశోధనలలో నిరూపించబడింది. రోజు వ్యాయామాలను అనుసరించటం వలన వయసు సంబంధిత ఉదాహరణకు- 'మస్కులార్ డిజనరేషణ్' వంటివి కలిగే అవకాశం 70 శాతం వరకు తగ్గుతాయని పరిశోధనలలో తెలుపబడింది. కావున రోజు వ్యాయామాలను అనుసరించటం మాత్రం మరవకండి.Image Courtesy: Getty

  • 5

    UV & పొగత్రాగటానికి దూరంగా ఉండండి

    వేసవికాలంతో పోల్చుకుంటే, శీతాకాలంలో సూర్య కిరణాలు, సూర్యకాంతి తక్కువగా ఉంటుంది, అంతేకాకుండా, UV కిరణాల తీవ్రత కూడా తక్కువగా ఉంటుంది. శీతాకాలంలో కూడా సూర్యుడి నుండి వచ్చే UV కిరణాల నుండి కళ్ళను కాపాడుకోండి. సూర్యుడి నుండి వచ్చే అతినీలలోహిత కిరణాల వలన కళ్ళు ప్రమాదానికి లోనయ్యి, కంటి శుక్లాలకు గురయ్యే అవకాశం ఉంది కావున సన్-గ్లాస్'లను ధరించండి. కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే సిగరెట్ మరియు పొగాకు వంటి వాటికి దూరంగా ఉండండి. పొగ మరియు సిగరెట్'లను తాగే వారు వయసు సంబంధిత 'మస్కులార్ డిజనరేషణ్' వంటి వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది.Image Courtesy: Getty

  • 6

    ఆరోగ్యకరమైనవి తినండి

    కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే, పోషకాలు మరియు ఆరోగ్యకర ఆహార స్వీకరణను గావించటం మంచిది. యాంటీ ఆక్సిడెంట్'లను అధికంగా తీసుకోవటం వలన కంటిశుక్లాలకు గురయ్యే అవకాశం తక్కువ అని కొన్ని పరిశోధనలలో వెల్లడి అయింది. ఈ యాంటీ ఆక్సిడెంట్'లు కూడా ఆరోగ్యకర ఆహార పదార్థాల నుండి ముఖ్యంగా తాజా పండ్లు, కూరగాయల, పచ్చి ఆకుకూరల నుండి పొందవచ్చు. అనారోగ్యకర ఆహార పదార్థాలకు బదులుగా, ముఖ్యంగా పచ్చి ఆకుకురాలను తీసుకోండి.Image Courtesy: Getty

  • 7

    అలర్ట్'గా ఉండండి

    మీ కంటి చూపులో ఎవైన మార్పులు గమనించిన, వెంటనే కంటి వైద్య నిపుణులను గమనించండి. కంటి చూపు సమస్యలలో రెండుగా కనపడటం, మబ్బుగా కనిపించటం లేదా తక్కువ కాంతిలో దృష్టి లోపాల వంటి వాటి వలన కంటి సమస్యలు అధికం అవుతాయి. తరచుగా కళ్ళు కాంతికి బహిర్గతం అవటం, కంటి నొప్పి, వాపులు కూడా ఇతర కంటి సమస్యలుగా చెప్పవచ్చు. ఇలాంటి సమస్యలను విస్మరించకుండా, అలర్ట్'గా ఉండండి.Image Courtesy: Getty

  • 8

    ప్రమాదం గురించి తెలుసుకోండి

    మీ కళ్ళ ఆరోగ్యం మరియు ప్రమాదాల గురించి తప్పక తెలుసుకోండి, ఒకవేళ మీ వయసు 60 సంవత్సరాలు ఉన్నట్లయితే, కంటి చూపు సమస్యలు అధికంగా వచ్చే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. మధుమేహం మరియు అధిక రక్త పీడనం వంటి వాటి వలన కంటి సమస్యలు అధికం అయ్యే అవకాశం ఉంది. కావున తరచుగా వైద్యుడిని కలుస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోండి.Image Courtesy: Getty

    Tags:
  • కంటి ఆరోగ్యం
  • కంటి చూపు
  • కంటి చూపును మెరుగుపరిచే చిట్కాలు
  • Ways to Protecyt Your Eyes in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • శీతాకాలంలో తినకూడని ఆహార పదార్థాలు

    శీతాకాలం వాతావరణం చాలా దిగులుగా మరియు ఆహరం తీసుకోటానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. శీతాకాలంలో తినకూడని ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • శీతాకాలంలో తినకూడని ఆహార పదార్థాలు

    శీతాకాలం వాతావరణం చాలా దిగులుగా మరియు ఆహరం తీసుకోటానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. శీతాకాలంలో తినకూడని ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుపబడింది.