Health Tips in HindiHealth Tips

రక్తంలో చక్కెర స్థాయిలను శక్తివంతంగా నియంత్రించే మార్గాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Feb 05, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

మధుమేహ వ్యాధి గ్రస్తులు వారి రక్తంలోని చక్కెర స్థాయిలను ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించటం చాలా కష్టమైన పనిగా చెప్పవచ్చు. ఎలాంటి ఆహరం తీసుకున్నను రక్తంలోని చక్కెర స్థాయిలు అధికవటమే కాకుండా, ఇతర ఆరోగ్య సమస్యలకు గురి చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలను ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించే మార్గాల గురించి కింద తెలుపబడింది.
  • 1

    భౌతిక కార్యకలపాలు

    వ్యాయామాలు చేయటం వలన శరీర రక్తంలోని చక్కెర స్థాయిలు శక్తివంతంగా ఆరోగ్య స్థితిలో ఉంచబడతాయి. వ్యాయామాలు చేసే సమయంలో శక్తి కోసం మీ కండరాలు గ్లూకోస్'ను వాడుకొంటాయి. రోజు భౌతిక కార్యకలపాల వలన ఇన్సులిన్ స్థాయిలను కూడా ప్రభావిత చెందబడతాయి. దీని వలన శరీర రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గుతాయి. సాధారణంగా ఇంట్లో చేసే పనులు, గార్డెనింగ్ లేదా ఇతరేతర పనుల వలన కూడా రక్తంలోని చక్కర స్థాయిలు తగ్గించబడతాయి.

  • 2

    అధిక ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని తినండి

    మధుమేహ వ్యాధితో భాదపడే వారు అధిక కొవ్వు ఉన్న పదార్థాలు మరియు సంక్లిష్ట కార్బోహైడ్రేట్స్'లను తక్కువగా తీసుకోవాలి. వీటికి బదులుగా ప్రోటీన్ ఎక్కువగా ఉన్న ఆహర పదార్థాలను తీసుకోవటం వలన శరీరంలో శక్తి స్థాయిలు పెంచబడతాయి. అంతేకాకుండా వీటి వలన శరీరంలో జీవక్రియ రేటు కూడా పెరుగుతుంది.

  • 3

    సరిగా పడుకోండి

    నూతన పరిశోధనల ప్రకారం, యుక్త వయసు గల వారిలో రోజు రాత్రి 7- 8 గంటల పాటు పడుకోవటం వలన వారి శరీర రక్తంలోని చక్కర స్థాయిలు ఆరోగ్యకరమైన స్థాయిలో ఉంచబడతాయని తెలిపారు. పడుకోవటం వలన మెదడు విశ్రాంతి చెంది శరీరంలో ఉండే అన్ని గ్రంధులు సరైన మొత్తంలో హార్మోన్'లను ఉత్పత్తి చేస్తాయి మరియు నిద్ర లేకపోవటం వలన హార్మోన్'ల విడుదలలో అవకతవకలు ఏర్పడతాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.

  • 4

    నీటిని ఎక్కువ త్రాగండి

    శరీర రక్తంలోని చక్కెర స్థాయిలను నిర్వహించటంలో నీరు ముఖ్యపాత్రని పోషిస్తాయి. అధిక రక్త చక్కర స్థాయిలను ఉత్తేజపరచి చివరకు మామూలు స్థాయికి తీసుకువస్తాయి. రోజు 2 నుండి 2.5 లీటర్ల నీటిని త్రాగటం వలన రక్తంలో చక్కెర స్థాయిలు మాత్రమే కాకుండా, భౌతికి కార్యకలాపాల నిర్వహణకు, గుండె సంబంధిత వ్యాధులు తక్కువగా వచ్చే అవకాశం మరియు మధుమేహ వ్యాధి కూడా నియంత్రణలో ఉంటుంది.

  • 5

    ఫైబర్

    అధిక ఫైబర్ ఉన్న ఆహార పదార్థాలను తీసుకోవటం వలన శరీర రక్తంలోని చక్కర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. రక్తంలోని చక్కెరలను గ్రహించే శక్తి మరియు ఇన్సులిన్ స్థాయిలు సరైన మొత్తంలో విడుదల చేయటానికి గల సామార్థ్యాన్ని ఫైబర్'లు కలిగి ఉంటాయి. ఆహరంలో ఫైబర్ స్థాయిలు పెరగాలి అనుకుంటే మీ ఆహర ప్రణాళికలో వీట్ మరియు హోల్ గ్రైన్స్'ను కలుపుకోండి.

  • 6

    పొగ త్రాగటానికి దూరంగా ఉండండి

    శరీరంలో రక్తంలో కార్బన్ స్థాయిలు పెరిగినట్లయితే ఫలితంగా పోషకాల గ్రహించే స్థాయిలు తగ్గిపోతాయి. సిగరెట్ మానేయటం వలన మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది మరియు మధుమేహ వ్యాధి నుండి దూరంగా ఉంటారు.

  • 7

    కృత్రిమ తీపి పదార్థాలను వాడండి

    కృత్రిమ తీపి పదార్థాలను ఎక్కువగా వాడటం వలన రక్తంలోని చక్కెర స్థాయిలు సాధారణ స్థితిలో ఉంచబడతాయి. మరియు వీటి వలన రక్తంలోని చక్కెర స్థాయిలు ప్రభావితం అవవు.

  • 8

    మద్యపానానికి దూరంగా ఉండండి

    ఆల్కహాల్'ను మితిమీరిన మోతాదులో తీసుకోవటం వలన శరీర రక్తంలోని చక్కర స్థాయిలలో మార్పులు జరుతాయి మరియు అధిక మద్యపానం వలన చాలా రకాల వ్యాధులకు, శరీరంలోని వివిధ భాగాలు ప్రమాదానికి గురవుతాయి. కావున ఆల్కహాల్'కు వీలైనంత దూరంగా ఉండండి.

    Tags:
  • మధుమేహం
  • రక్తంలోని చక్కెర స్థాయిలు
  • చక్కెర స్థాయిల నిర్వహణ
  • Ways to Control Blood Sugar in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ