Health Tips in HindiHealth Tips

మీ హృదయం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ సూచనలు పాటించాల్సిందే...

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:Dec 01, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

మనం పాటించే జీవనశైలిపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అవునా! మన శరీరంలో ముఖ్య భాగంగా చెప్పుకునే హృదయం ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి అలవాట్లు పాటించాలో ఇక్కడ తెలుపబడింది.
 • 1

  వ్యాయామాలు

  హృదయం కావాలనుకుంటే, ఆరోగ్యంగా ఉండాలంటే, సరైన స్థాయిలో వ్యాయామాలను చేస్తూ, రోజులో 500 నుండి 950 కేలోరీలను కరిగించాలి. హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే కార్డియో వ్యాయామాలు చేయాలి, వీటిలో శరీరం కదలటం వలన ఉచ్వాస, నిచ్వాసాలు వేగవంతం అవుతాయి. అంతేకాకుండా, ఈ కార్డియో వ్యాయామాలు రక్తపోటును కూడా తగ్గిస్తాయి.

 • 2

  ఆరోగ్యకర ఆహార ప్రణాళిక

  కొవ్వు పదార్థాలు తక్కువ గల ఆహార పదార్థాలు మన హృదయానికి మంచి స్నేహితులు. ఈ ఆహారంలో రిఫైన్డ్ చక్కెరలు మరియు ట్రాన్స్ ఫ్యాట్ లు మోతాదులో ఉంటాయి మరియు ఫైబర్, ఒమేగా-౩ ఫాటీ ఆసిడ్ లు అధికంగా ఉండి, హృదయం యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఒమేగా-౩ ఫాటీ ఆసిడ్ లు అధికంగా గల ఆహార పదార్థాలను తినటం వలన హృదయ సంబంధిత వ్యాధులకు గురయ్యే అవకాశాలు చాలా మట్టుకు తగ్గుతాయి. వివిధ రకాల పండ్లు, కూరగాయలు బరువును నియంత్రణలో ఉంచటంతో పాటూ, రక్తపోటును తగ్గిస్తాయి.

 • 3

  నిద్ర

  ఒక గంట పాటూ ఎక్కువ సమయం విశ్రాంతి తీసుకునే వారి గుండెపోటుకు కారణమయ్యే ఆర్టేరీ క్లాగింగ్ (ధమనులలో అడ్డంకుల)కు గురయ్యే అవకాశాలు తగ్గుతాయని U.S న్యూస్ & వరల్డ్ రిపోర్ట్ వారు తెలిపారు. హృదయం ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర తప్పని సరి. ప్రతి రోజు ఎలాంటి ఆటంకాలు లేని నిద్రపోవటానికి ప్రయత్నించండి.

 • 4

  ధూమపానానికి దూరం

  సిగరెట్ లేదా ధూమపానం అనేది హృదయ సంబంధిత వ్యాధులతో పాటూ, ఇతర అనేక రకాల వ్యాధులకు కారణమని చెప్పవచ్చు. మీరు తాగే సిగరెట్ సంఖ్యకు అనుగుణంగానే హృదయ సంబంధిత వ్యాధులు కలిగే అవకాశం కూడా గణనీయంగా పెరుగుతుంది. కావున ఈ అలవాటుకు దూరంగా ఉండటం మంచిది.

 • 5

  ఆల్కహాల్ కు కూడా దూరం

  మితిమీరిన మోతాదులో ఆల్కహాల్ తాగటం వలన అధిక రక్తపోటు మరియు హృదయ సంబంధిత వ్యాధులు క;ఉగుతాయని "అమెరికన్ హార్ట్ అసోసియేషన్" వారు తెలిపారు. అంతేకాకుండా, తగు మోతాదులో ఆల్కహాల్ తాగటం వలన శరీరంలో మంచి కొవ్వు పదార్థాల స్థాయిలు పెరుగుతాయని, ఫలితంగా హృదయ ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు.

 • 6

  ఒత్తిడికి దూరం

  డిప్రెషన్ లని వారితో పోలిస్తే , డిప్రెషన్ కు కు గురయ్యే వారు నాలుగో వంతు గుండెపోటుకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని వారు తెలిపారు. ఒత్తిడికి గురయినపుడు వ్యాయామాలు చేయకుండా, అధికంగా తింటూ, ఎక్కువగా సిగరెట్ తాగుతుంటారు. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వారు తెలిపిన దాని ప్రకారం, ఇలా ఒత్తిడి, డిప్రెషన్ కు గురయ్యే వారిలో రక్తపోటు రెట్టింపు అవుతుంది. ఇలాంటి సమయంలో ఒత్తిడిని తగ్గించి, ప్రశాంతతను చేకూర్చే వాటిని అనుసరించటం మంచిది. Image source: Getty Images  

  Tags:
 • గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అలవాట్లు
 • హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచే ఆహారపు అలవాట్లు
 • గుండె ఆరోగ్యంగా ఉండటానికి పాటించాల్సిన సూచనలు
 • Gunde aarogymga undataniki patinchaalsina suchanalu
 • Ways to Keep Your Heart Healthy in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

 • అన్ని

 • వ్యాసం

 • స్లైడ్ షో

 • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

  చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
 • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

  వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
 • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

  వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
 • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

  చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ