Health Tips in HindiHealth Tips

హైబిస్కస్ టీ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Dec 10, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

మందార లేదా హైబిస్కస్ టీ ఎపుడైనా తాగారా? అయితే దీని వలన కలిగే ప్రయోజనాల గురించి తెలిస్తే రోజు హబిస్కస్ టీని తప్పక తాగుతారు.
  • 1

    కొవ్వు పదార్థాలను తగ్గిస్తుంది

    యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉండే హబిస్కస్ టీ శరీరంలో కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గిస్తుంది. ఫలితంగా, రక్తనాళాలను మరియు గుండె సంబంధిత భాగాలు ప్రమాదానికి గురవకుండా ఉంటాయి. నూతన పరిశోధనల ప్రకారం, రోజు హైబిస్కస్ టీ తాగటం వలన శరీర రక్తంలో చక్కెర స్థాయిలు ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించబడతాయి.

  • 2

    కాలేయ సంరక్షణ

    యాంటీ ఆక్సిడెంట్ లను కలిగి ఉండే హైబిస్కస్ టీ, ఫ్రీ రాడికల్ లను తటస్థీకరించి కాలేయం ప్రమదానికి గురవకుండా చేసి, దాని పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని ఇటీవల అధ్యయనాలలో తెలుపబడింది.

  • 3

    క్యాన్సర్ నివారణ

    అదేవిధంగా హైబిస్కస్ టీ క్యాన్సర్ వ్యాధిని కూడా తగ్గిస్తుంది. అధ్యయనాల ప్రకారం, రోజు హైబిస్కస్ టీ తాగటం వలన క్యాన్సర్ కణాల అభివృద్ధి నెమ్మదిపరచబడి, మెరుగైన చికిత్స మరియు కణాల ఆరోగ్యం తిరిగి పొందటానికి సహాయపడుతుంది.

  • 4

    రక్తపోటు నిర్వహణ

    హైబిస్కస్ టీ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉన్నందున రక్తపోటును తగ్గించుటలో సహాయపడుతుంది. హైపర్ టెన్షన్ కలిగి ఉన్న వారు హైబిస్కస్ టీ తాగటం ద్వారా గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండవచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు.

  • 5

    యాంటీ- డిప్రసెంట్ గుణాలు

    హైబిస్కస్ టీ విటమిన్ మరియు మినరల్ లతో నిండి ఉండి, వృక్ష ఆధారిత ఫ్లావనాయిడ్ లను, సమ్మేళనాలను కలిగి ఉన్నందు వలన యాంటీ- డిప్రసెంట్ గుణాలను కలిగి ఉంటుంది. రోజు హైబిస్కస్ టీ తాగటం వలన నాడీ వ్యవస్థ, నరాలను శాంతపరచటమే కాకుండా, ఉద్రేకత మరియు డిప్రెషన్ వంటి వాటి నుండి కూడా ఉపశమనం కలిగిస్తుంది. Image Source : Getty Images

    Tags:
  • మందార టీ వలన కలిగే ప్రయోజనాలు
  • హబిస్కస్ టీ వలన కలిగే ప్రయోజనాలు
  • ఊబకాయాన్ని తగ్గించే హబిస్కస్ టీ
  • hibiscus tea prayojanalu
  • benefits of hibiscus tea in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు