Health Tips in HindiHealth Tips

ఆముదం వాడకం వలన కలిగే ఉహించని దుష్ప్రభావాలు

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:May 02, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

క్యాస్టర్ ఆయిల్, వాడుక భాషలో ఆముదంగా పేర్కొనే దీన్ని చాలా సంవత్సరాల నుండి వైద్యశాస్త్రంలో వాడుతున్నారు. అయినప్పటికీ వీటి వలన కలిగే దుష్ప్రభావవాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    వికారంగా అనిపించటం

    ఆముదం జీర్ణాశయ సమస్యలను అన్నిటిని తగ్గిస్తుందని మీకు తెలుసా? కానీ, కొంత మందిలో ఆముదం తాగటం వలన వికారంగా కూడా అనిపించవచ్చు. వివిధ రకాల రుగ్మతలను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉండే ఆముదం ఇలాంటి దుష్ప్రభావాలను కూడా కలుగ చేస్తుందా? అని మీరు ఆశ్చర్యానికి గురవవచ్చు. దీనికి కారణం ఆముదంలో 'రిసినోయిక్ ఆసిడ్' అని చెప్పవచ్చు. ఈ ఆసిడ్ నయం చేసే గుణాలతో పాటుగా, చికాకులను కలిగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. జీర్ణాశయంలో దుష్ప్రభావలను కలుగచేసి, వికారాన్ని కలిగిస్తుంది.

  • 2

    విరేచనాలు

    ఆముదం వలన కలిగే మరొక దుష్ప్రభావం- విరేచనాలు. ఆముదాన్ని మలబద్దకం తగ్గించే లాక్సైటీవ్ లా పరిగనిస్తారు. కానీ, కొంతమందిలో ఇది వ్యతిరేఖంగా పనిచేసి, విరేచనాలకు కారణమవుతుంది.

  • 3

    చర్మంపై దద్దుర్లు

    ఆముదం వాడకం వలన జీర్ణశయాంతరాలలో ఒత్తిడి మాత్రమేకాకుండా, చర్మంపై ప్రతికూల చర్యలను కలిగిస్తాయి. చర్మంపై ఆముదంను అప్లై చేయటం వలన కొంతమందిలో అలర్జీ చర్యలు కలగవచ్చు. కావున, ఆముదం వలన మీ చర్మానికి అలర్జీ కలుగుతుందో లేదో తెలుసుకోండి. ఒక చుక్క ఆముదం నూనెను చర్మంపై వేసి, ఎవైన అలర్జీలు చర్యలు జరిగాయా లేదా అని చుడండి. ఒకవేళ మీ చర్మంపై దద్దుర్లు లేదా ఎవైన అసామాన్య మార్పులు కనపడితే ఆముదం పట్ల మీరు అలర్జీ కలిగి ఉన్నారని అర్థం.

  • 4

    కండరాల తిమ్మిరులు

    ఆముదం వాడకం వలన కండరాలలో తిమ్మిరులుగా అనిపించటం సాధారణ దుష్ప్రభావం. ఈ నూనె సహాయంతో మసాజ్ చేయటం వలన కూడా కండరాలు తిమ్మిరులకు గురైనట్లు అనిపిస్తుంది. అంతేకాకుండా, కొంతమందిలో ఉదరభాగంలో నొప్పి/ తిమ్మిరుల వంటి వాటికి గురవుతుంటారు. 

  • 5

    తల తిరుగుతున్నట్లు అనిపించటం

    అధికంగా ఆముదం నూనె తీసుకోవటం వలన కొంత మందిలో తల తిరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇలాంటి భావనకు గురైన వారు వెంటనే క్యాస్టర్ ఆయిల్ ను అధికంగా కాకుండా, తగిన మోతాదులో మాత్రమే తీసుకోండి. Image Source: Getty

    Tags:
  • క్యాస్టర్ ఆయిల్ వలన కలిగే దుష్ప్రభావాలు
  • ఆముదం వలన కలిగే దుష్ప్రభావాలు
  • క్యాస్టర్ ఆయిల్ ప్రయోజనాలు
  • Amudham valana kalige dushprabhavalu
  • Side effects of castor oil in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • టూత్ పేస్ట్ వలన కలిగే అనారోగ్యాలు

    మీకిష్టమైన టూత్ పేస్ట్ వాడకం వలన దంతాలు మెరుస్తున్నయా? అయితే మంచిదే కానీ, టూత్ పేస్ట్ వాడకం వలన కలిగే అనారోగ్యాల గురించి కూడా తెలుసుకోండి.
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • నిమ్మరస వాడకం వలన కలిగే ప్రయోజనాలు

    పురాతన కాలం నుండి నిమ్మరసం వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి మనందరికీ తెలిసిందే. విటమిన్ 'C' సిట్రిక్ ఆసిడ్, కాల్షియం, మెగ్నీషియం, పెక్టిన్ వంటి
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • నిమ్మరస వాడకం వలన కలిగే ప్రయోజనాలు

    పురాతన కాలం నుండి నిమ్మరసం వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి మనందరికీ తెలిసిందే. విటమిన్ 'C' సిట్రిక్ ఆసిడ్, కాల్షియం, మెగ్నీషియం, పెక్టిన్ వంటి
  • టూత్ పేస్ట్ వలన కలిగే అనారోగ్యాలు

    మీకిష్టమైన టూత్ పేస్ట్ వాడకం వలన దంతాలు మెరుస్తున్నయా? అయితే మంచిదే కానీ, టూత్ పేస్ట్ వాడకం వలన కలిగే అనారోగ్యాల గురించి కూడా తెలుసుకోండి.