Health Tips in HindiHealth Tips

గర్భవతిగా ఉన్నపుడు దూరంగా ఉండవలసిన ఆహారాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Feb 03, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

స్త్రీ జీవితంలో గర్భదశ అనేది ఒక ముఖ్య దశగా చెప్పవచ్చు, కొంత మంది గర్భదశలో ఎలాంటి ఆహరం తీసుకోవాలో తేలిక చాలా ఇబ్బందులకు గురవుతుంటారు. నిజానికి కొన్ని రకాల ఆహార పదార్థాలు శరీరానికి హాని కలిగిస్తాయి ఇక్కడ తెలిపిన ఆహారాలు గర్భతులకు హానికరం అని చెప్పవచ్చు.
  • 1

    ఆల్కహాల్

    గర్భవతిగా ఉన్నపుడు, ఆల్కహాల్ తాగటం వలన, ఇది నేరుగా ప్లాసేంటా ద్వారా శిశువుకు అందించబడుతుంది. ఒకవేళ గర్భవతిగా ఉన్నపుడు, ఆల్కహాల్ తీసుకుంటే, ''ఫీటల్ ఆల్కహాల్ స్పెక్ట్రం డిసార్డర్" (FASD) వ్యాధికి గురవ్వాల్సి వస్తుంది. ఎంత పరిమాణంలో తీసుకున్నను ఆరోగ్యానికి హానికరమనే చెప్పవచ్చు. కావున గర్భ సమయంలో ఆల్కహాల్'కు దూరంగా ఉండండి.Image Courtesy : Getty Images

  • 2

    పచ్చి గుడ్లు

    పచ్చి గుడ్లలో హనికర కారకాలను కలిగి ఉంటాయి, ఉదాహరణకు- ఈ.కోలై మరియు సాల్మొనెల్లా. ఈ రకమైన కారకాలు గర్భవతిలో చేరి పేగులను ఇన్ఫెక్షన్'లకు గురి చేస్తాయి. కావున గర్భవతులు పచ్చి గుడ్లకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది.Image Courtesy : Getty Images

  • 3

    మెర్క్యురి అధికంగా ఉన్న చేపలు

    అధిక మొత్తంలో మెర్క్యురి కలిగి ఉన్న చేపలు ఉదహరణకు- షార్క్, స్వార్డ్ ఫిష్, కింగ్ మాకేరాల్ మరియు టేల్ ఫిష్ వంటి వాటిని గర్భ సమయంలో తినకూడదు. గర్భదశలో వారంలో కేవలం 12 ఔన్ల చేపలను తినాలి. ఎంత తక్కువ పరిమాణంలో తింటే అంత మంచిది.Image Courtesy : Getty Images

  • 4

    సాఫ్ట్ చీస్

    ఫెట, బ్రీ మరియు కామేమ్బెర్ట్ జున్ను, బ్లూ- వేయిండ్ జున్ను, క్వెసో బ్లాంకో, క్వెసో ఫ్రెస్కో మరియు పానెల వంటి సాఫ్ట్ చీస్'లను గర్భవతులు వీలైనంత దూరంగా ఉండాలి. కానీ, శుభ్రపరచిన (సూక్ష్మక్రిమిరహిత) చీస్'లను వీలైనంత తక్కువగా తినవచ్చు.Image Courtesy : Getty Images

  • 5

    పచ్చి కూరగాయల మొలకలు

    గర్భ సమయంలో, పచ్చి కూరగాయల మొలకలు తినకూడదు, కారణం- వీటి మొలకలలో బ్యాక్టీరియా ఉంటుంది. కావున మొలకలు ఉన్న ఆకుకూరలు లేదా కూరగాయలను అల్ఫాల్ఫా, క్లోవర్, ముల్లంగి మరియు పెసర గింజలు వంటి వాటికి దూరంగా ఉండండి.Image Courtesy : Getty Images

  • 6

    కెఫిన్

    కెఫిన్, ఉద్దీపన మరియు మూత్రవిసర్జన ప్రేరకంగా పని చేస్తుంది. అంతేకాకుండా, దీని తీసుకోవటం వలన గర్భవతులలో రక్త పీడనం మరియు హృదయ స్పందన రేటు కూడా పెంచుతుంది. వీటితో పాటుగా, శరీరాన్ని డీ హైడ్రేషన్'కు గురి చేసి, తరచుగా మూత్ర విసర్జనకు గురయ్యేలా చేస్తుంది. పరిశోధనల ప్రకారం, 200 మిల్లిగ్రాముల కెఫిన్'ను తీసుకోవటం వలన గర్భవతులలో స్రావాలు అధికం అవుతాయి. కావున గర్భవతులు కెఫిన్ సంబంధిత ద్రావణాలకు దూరంగా ఉండండి.Image Courtesy : Getty Images

  • 7

    కాలేయం

    కాలేయంలో అధికంగా విటమిన్ 'A' ఉండటం వలన గర్భ సమయంలో దీని తినటం ఆరోగ్యకరం కాదు. అధిక మొత్తంలో విటమిన్ 'A'ను తీసుకోవటం వలన త్వరగా ప్రసవం జరగటం వంటి శిశు జనన సమస్యలు కలుగుతాయని కొన్ని ప్రత్యేక పరిశోధనలలో తెలుపబడింది. కావున గర్భ సమయంలో వీటికి దూరంగా ఉండండి.Image Courtesy : Getty Images

  • 8

    హెర్బల్ ఉపభాగాలు

    ఇతర మందుల వాలే కాకుండా, హెర్బల్ ఉపభాగాలు కఠినమైన రుచిని కలిగి ఉంటాయి, అంతేకాకుండా, గర్భ సమయంలో ఇది మంచిది కాదనే చెప్పవచ్చు. హెర్బల్ సంబంధిత టీ లను కానీ, ఇతర ద్రవణాలను వాడటానికి ముందు మీ ఆరోగ్య నిపుణుల సలహా తీసుకోండి.Image Courtesy : Getty Images

    Tags:
  • గర్భవతులు దూరంగా ఉండాల్సిన ఆహారాలు
  • గర్భవతులకు హాని కలిగించే ఆహారాలు
  • Foods to Avoid During Pregnancy in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ