Health Tips in HindiHealth Tips

వత్తైన జుట్టు కోసం తీసుకోవలసిన ఆహారాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Mar 19, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

వత్తైన, పొడవైన జుట్టు ఉండాలని ప్రతి ఒక్కరు పేర్కొంటారు అవునా! జుట్టు కోసం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. వత్తైన జుట్టు కోసం జాగ్రత్తలు మాత్రమే కాకుండా, పోషకాలతో కూడిన ఆహారాలు కూడా అవసరమే. వత్తైన జుట్టును ప్రోత్సహించే ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    జుట్టు కోసం ఆహరం

    మీ జుట్టు ఆరోగ్యంగా, అందంగా ఉండాలి అనుకుంటున్నారా!, అందమైన జుట్టును పొందటం సులభం కాదనే చెప్పాలి. జుట్టు అందంగా ఉండాలంటే, శరీరానికి భయట మరియు అంతర్గతంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మీరు తినే భోజనంలో, జుట్టు కావలసిన పోషకాలన్నీ ఉండేలా జాగ్రత్త పడాలి. జుట్టును వత్తుగా చేసే ఆహార పట్టికల గురించి కింద తెలుపబడింది.Image Courtesy : Getty Images

  • 2

    హోల్ గ్రైన్స్

    హోల్ గ్రైన్స్ లో జింక్, సంక్లిష్ట 'B' విటమిన్ లు మరియు ఐరన్ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జుట్టు ఆరోగ్యానికి ఈ పోషకాలు అవసరం. జింక్, జుట్టు పెరుగుదలను మరియు ఆరోగ్యాన్ని ప్రభావితపరిచే హార్మోన్ ల స్థాయిలను పెంచుటలో దోహదపడుతుంది. ఈ పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినటం వలన బలమైన మరియు పొడవైన జుట్టును పొందుతారు.Image Courtesy : Getty Images

  • 3

    గుడ్లు

    జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే, మీ ఆహార ప్రణాళికలో గుడ్లు తప్పని సరి అని చెప్పవచ్చు. గుడ్లు శరీరానికి అవసరమయ్యే, ప్రోటీన్ లను మాత్రమే కాకుండా, జింక్, సెలీనియం, సల్ఫర్, ఐరన్ వంటి పోషకాలను కలిగి ఉంటాయి. జుట్టు రాలకుండా ఉండటానికి మరియు జుట్టు మొదళ్ళకు ఆక్సిజన్ అందించటానికి ఐరన్ అవసరం. వైద్యపరంగా ఐరన్ లోపం వలన కలిగే లోపాన్ని 'అనీమియా' అంటారు. ముఖ్యంగా, ఐరన్ లోపం వలన స్త్రీలలో జుట్టు రాలిపోతుంది.Image Courtesy : Getty Images

  • 4

    బ్లూబెర్రీలు

    ఫ్ర్రీ రాడికల్ లు, శరీరంలో ఒత్తిడి హార్మన్ ల స్థాయిలను పెంచి మరియు ఇన్ఫ్లమేషన్ లను కలుగచేసి, వెంట్రుకల కణాలను కూడా ప్రమాదానికి గురి చేస్తాయి. బ్లూబెర్రీలు పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్ లను కలిగి ఉండి, ఫ్రీ రాడికల్ ల నుండి శరీర కణాలను రక్షిస్తాయి. Image Courtesy : Getty Images

  • 5

    క్యారెట్

    విటమిన్ 'A' ను పుష్కలంగా కలిగి ఉండే క్యారెట్, కళ్ళ ఆరోగ్యానికి మాత్రమె కాకుండా, జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. క్యారెట్ లు వెంట్రుకలకు కావలసిన సహజ నూనెలను అందించటమే కాకుండా, వాటి స్థాయిలను సమతుల్య స్థాయిలో నిర్వహిస్తాయి. ఫలితంగా, తలపై చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. Image Courtesy : Getty Images

  • 6

    పౌల్ట్రీ

    ప్రోటీన్ లోపం వలన జుట్టు పలుచగా మారటం, కొన్ని సార్లు వెంట్రుకలు కూడా రాలే అవకాశం ఉంది. టర్కీ మరియు చికెన్ లలో, జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందించే ప్రోటీన్ లు పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా, హెయిర్ ఫాలికిల్ ను రక్షించే ఐరన్ మూలకాన్ని కూడా పుష్కలంగా కలిగి ఉంటాయి.Image Courtesy : Getty Images

  • 7

    అరటిపండు

    అరటిపండులో ఉండే విటమిన్ 'B6', తీసుకునే ఆహరం నుండి పోషకాలను గ్రహించేలా చేస్తుంది. రక్తంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని ప్రభావిత పరచటమే కాకుండా, జుట్టు రాలే ప్రక్రియను కూడా ఆలస్యం చేస్తుంది. వీటి సేకరణ వలన జుట్టు కాంతివంతంగా మరియు పెరుగుదల కూడా మెరుగుపడుతుంది. 'B' విటమిన్ లోపం వలన వెంట్రుకలు పలుచగా మారి, తెగిపోతాయి. ఈ విటమిన్ అరటిపండులో అధికంగా ఉంటుంది కావున మీరు తినే ఆహారంలో దీనిని తప్పక కలుపుకోండి.Image Courtesy : Getty Images

  • 8

    చేప

    సాల్మన్, మాకేరల్ వంటి  చేపలు ఒమేగా-3 ఫాటీ ఆసిడ్ లను కలిగి ఉంటాయి. ఈ ఫాటీ ఆసిడ్ లు జుట్టురాలే ప్రక్రియను ఆలస్యం చేస్తాయి. చేపలు, ఐరన్ లతో పాటూ, విటమిన్ 'B12'లను కలిగి ఉండి, చర్మ మరియు వెంట్రుకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.Image Courtesy : Getty Images

    Tags:
  • వత్తైన జుట్టు
  • జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే ఆహారాలు
  • Ventruakla Arogyaniki Aharalu
  • Foods for Thicker Hair in Telugu in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • మృదువైన చర్మం కోసం ఆహర ప్రణాలికలు

    కొంత మంది అబ్బాయిలు, ముఖ్యంగా అమ్మాయిలు మృదువైన మరియు సున్నితమైన చర్మం కోసం వివిధ రకాల రసాయనిక ఉత్పత్తులను, క్రీమ్’లను వాడుతుంటారు. వీటి కన్నా ఇక్కడ ప
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • మృదువైన చర్మం కోసం ఆహర ప్రణాలికలు

    కొంత మంది అబ్బాయిలు, ముఖ్యంగా అమ్మాయిలు మృదువైన మరియు సున్నితమైన చర్మం కోసం వివిధ రకాల రసాయనిక ఉత్పత్తులను, క్రీమ్’లను వాడుతుంటారు. వీటి కన్నా ఇక్కడ ప