Health Tips in HindiHealth Tips

జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందించే ఆహారాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Feb 04, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

అందంగా కనపడుటలో కళ్ళు, పెదాలు, ముక్కు, చర్మం మాత్రమె కాకుండా జుట్టు కూడా ఒక ముఖ్య భాగమే. జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి మనం చాలా రకాల క్రీమ్'లను, షాంపూ'లను వాడుతుంటాము. ఇవి మాత్రమె కాకుండా, తీసుకునే ఆహరం కూడా జుట్టు ఆరోగ్యాన్ని ప్రభావిత పరుస్తుంది, జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరిచే ఆహారాల పట్టిక ఇక్కడ తెలుపబడింది.
  • 1

    హోల్ గ్రైన్స్

    జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి కావాల్సిన జింక్, ఐరన్, విటమిన్ 'B' వంటి ముఖ్యమైన పోషకాలన్నిటిని హోల్ గ్రైన్స్ నుండి పొందవచ్చు. వెంట్రుకల పెరుగుదలను మరియు వత్తైన జుట్టుకు కావాల్సిన నూనెల ఉత్పత్తిని, జింక్ మూలకం రెండింతలు చేస్తుంది.Image Courtesy : Getty Images

  • 2

    క్యారెట్

    పుష్కలంగా విటమిన్ 'A'ను కలిగి ఉండే క్యారెట్'లు కళ్ళకు మాత్రమె కాకుండా, జుట్టు ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. జుట్టు కావలసిన అన్ని రకాల నూనెలను క్యారెట్'ల నుండి పొందవచ్చు. జుట్టు రాలకుండా, వత్తైన మరియు ప్రకాశవంతమైన జుట్టు కోసం రోజు క్యారెట్'లను తినమని నిపుణులు సలహా ఇస్తున్నారు.Image Courtesy : Getty Images

  • 3

    పచ్చని ఆకుకూరలు

    బ్రోకలీ, పాలకూర వంటి పచ్చని ఆకుకూరలు జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి కావలసిన ఐరన్ మరియు కాల్షియం వంటి పోషకాలను పుష్కలంగా కలిగి ఉంటాయి. అంతేకాకుండా, ఇవి 'సీబం', నునెల ఉత్పత్తికి కావల్సిన విటమిన్ 'A', విటమిన్ 'C'లను కలిగి ఉంటాయి.Image Courtesy : Getty Images

  • 4

    పౌల్ట్రీ

    ప్రోటీన్ లోపం వలన జుట్టు పొలుసులుగా మారి, జుట్టు రాలటం ఎక్కువ అవుతుంది. చికెన్ మరియు టర్కీ, అధిక మొత్తంలో ప్రోటీన్'లను కలిగి ఉండి, జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి కావాల్సిన ప్రోటీన్'లను అందిస్తాయి. అంతేకాకుండా, వీటిలో వెంట్రుకల ఫాలికల్'లకు కావాల్సిన ఐరన్ మూలకాన్ని కూడా కలిగి ఉంటాయి. Image Courtesy : Getty Images

  • 5

    అరటి పండ్లు

    మనం తినే ఆహరం నుండి శరీరానికి కావాల్సిన పోషకాలను గ్రహించే ప్రక్రియను విటమిన్ 'B6' ప్రేరేపిస్తుంది. అంతేకాకుండా, ఈ విటమిన్ ఎర్ర రక్త కాణాల ఉత్పత్తిని కూడా పెంచటమే కాకుండా, జుట్టును ప్రకాశవంతంగా మరియు వాటి పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. సంక్లిష్ట విటమిన్ 'B' లోపం వలన జుట్టు ప్రమాదానికి గురై, వెంట్రుకలు రాలిపోతాయి. కానీ, అరటి పండు నుండి మన శరీరానికి కావలసిన విటమిన్ 'B6' అందించబడుతుంది. కావున రోజు వీటిని తినండి. Image Courtesy : Getty Images

  • 6

    పాల ఉత్పత్తులు

    పాల ఉత్పత్తులు అయినట్టి కాటేజ్ చీస్ మరియు యోగ్ హార్ట్ వంటివి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. వీటిలో ఉండే ''కెసిన్'' మరియు వే ప్రోటీన్'లు జుట్టుకు బలాన్ని చేకూరుస్తాయి. తక్కువ స్థాయిలో కొవ్వు పదార్థాలు గల పాల ఉత్పత్తులు వెంట్రుకలకు మంచివి అని చెప్పవచ్చు.Image Courtesy : Getty Images

  • 7

    చేపలు

    సాల్మన్, మాకేరాల్ వంటి నూనెలు అధికంగా ఉన్న చేపలు, ఒమేగా-3 ఫాటీ ఆసిడ్'లను కలిగి ఉండి, జుట్టు రాలే ప్రక్రియను తగ్గిస్తాయి. చేపలు కూడా ఐరన్, విటమిన్ 'B12' వంటి వాటిని కలిగి ఉంటాయి. ఈ పోషకాలు చర్మ మరియు జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. Image Courtesy : Getty Images

  • 8

    చిలకడ దుంప

    విటమిన్ 'A' స్థాయిలు తక్కువగా ఉన్న వారిలో చుండ్రు ఎక్కువగా ఏర్పడుతుంది. చిలకడ దుంపలో, విటమిన్ 'A' మారే ''బీటా-కెరోటీన్'' అనే యాంటీ ఆక్సిడెంట్'లు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ 'A'లు కూడా తలపై చర్మానికి కావలసిన నూనెలను ఉత్పత్తి చెందించటమే కాకుండా వెంట్రుకలకు రక్షణ కల్పిస్తాయి. Image Courtesy : Getty Images

    Tags:
  • జుట్టు ఆరోగ్యం
  • జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే ఆహారాలు
  • ఆరోగ్యకర ఆహారాలు
  • Foods for Healthy Hair in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ