Health Tips in HindiHealth Tips

పిల్లల ఆలోచన శక్తిని పెంచే సూపర్ డ్రింక్స్

By:P Raj Kumar, Onlymyhealth Editorial Team,Date:Nov 16, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

మీ పిల్లలు చదువులో వెనకబడ్డారా? పిల్లల మేధాశక్తిని పెంచే సులభమైన పద్దతి గురించి చూస్తున్నారా? కొన్ని రకాల జ్యూస్ లు మీ పిల్లల మేధాశక్తిని పెంచటమే కాకుండా, నేర్చుకోవటంలో వారిని మరింత ఆసక్తిని పెంచే జ్యూస్ ల గురించి ఇక్కడ తెలుపబడింది.
 • 1

  దానిమ్మ రసం

  యాంటీ ఆక్సిడెంట్ లను పుష్కలంగా కలిగి ఉండే దానిమ్మ రసం పిల్లల మెదడు పనితీరును మెరుగుపరిచే ఉత్తమ ఆహారంగా చెప్పవచ్చు. మెదడును ప్రమాదానికి గురిచేసే ఫ్రీ రాడికల్ ల నుండి దానిమ్మ రక్షిస్తుందని పరిశోధనలలో తెలుపబడింది. వీటితో పాటుగా, ఈ యాంటీ ఆక్సిడెంట్ మెదడు పనితీరును మెరుగుపరచటమేకాకుండా, ఫ్రీ రాడికల్ ల నుండి గుండెను సంరక్షిస్తుంది. మెదడు పనితీరు మెరుగ్గా ఉండే వారిలో హృదయనాళ వ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుందని పరిశోధనలలో తెలుపబడింది. గ్రీన్ టీ మరయు రెడ్ వైన్ లలో కంటే దానిమ్మలో మెరుగైన యాంటీ ఆక్సిడెంట్ లు ఉంటాయి కావున మీ పిల్లలకు ఈ జ్యూస్ ను తాగించి మంచి ఫలితాలను పొందండి.  

 • 2

  కలబంద రసం

  విటమిన్ 'B6' లను అధికంగా కలిగి ఉండే ఈ రసం జ్ఞాపక శక్తిని మరింత మెరుగుపరుస్తుంది. ఇది రుచికరంగా లేకపోవచ్చు కానీ మీ పిల్లల మెదడు పనితీరును పెంచే బ్రెయిన్ టానిక్ గా పేర్కొనవచ్చు. కేవలం కలబంద రసం కాకుండా, జామపండు, లీచీ వంటి పండ్ల రసాలతో కూడా కలుపుకొని తాగవచ్చు.

 • 3

  కొబ్బరి నీరు

  పిల్లలలో మెదడు పనితీరును మెరుగుపరిచే సూపర్ బ్రెయిన్ ఫుడ్ లలో కొబ్బరి నీరు మరియు దీని వలన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. చాలా  తక్కువ మందికి మరియు అరుదైన నిజం ఏమిటంటే- మన మెదడు పనితీరు కొవ్వు పదార్థాలు కూడా అవసరం. కొబ్బరి నీరు కొవ్వు పదార్థాలను కలిగి ఉంటుంది మరియు ఇవి జ్ఞాపక శక్తి, ఏకాగ్రతను పెంచుతాయి. అంతేకాకుండా,అ మానసిక అలసట, రక్తంలోని చెక్కర స్థాయిలను సమతుల్యపరచటంతో పాటూ ఉద్రేకత మరియు డిప్రెషన్ లను దూరం చేస్తుంది. కొబ్బరి నీటిలో ఉండే కొవ్వు మరియు అమైనోఆసిడ్ లు సెరొటోనిన్ వంటి హార్మోన్ లను స్థిరీకరించి, ఉద్రేకత మరియు డిప్రెషన్ లను దూరం చేసి, ఏకాగ్రత లోపాల నుండి దూరం చేస్తుంది. వారాంతపు సెలవు రోజులలో కొబ్బరి నీటిని పిల్లలకు తాగించి వారి మెదడు పనితీరును మెరుగుపరచండి.

 • 4

  బీట్రూట్ జ్యూస్

  బీట్రూట్ జ్యూస్ పిల్లలలో మెదడుకు రక్తసరఫరాను పెంచుతుందని, మెదడు పనితీరును మెరుగుపరచటమే కాకుండా, మీ పిల్లలు పెరుగుతున్న కొలది డిమేంటియా వ్యాధికి గురవకుండా కాపాడుతుందని శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయి. అధిక మొత్తంలో నైట్రేట్ లను కలిగి ఉండే బీట్రూట్ జ్యూస్ రక్త నాళాలలో అడ్డంకులను తొలగించి మరియు మెదడుకు రక్తప్రసరణను కూడా అధికం చేస్తుంది. ఒకగ్లాసు బీట్రూట్ జ్యూస్ మీ పిల్లల మెదడుకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది.

 • 5

  టమోటా రసం

  టమోటా విటమిన్ 'A', 'D' మరియు 'C' లతో పాటూ, లైకోపీన్ వంటి ముఖ్యమైన రసాయనాలను కలిగి ఉండి, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి. లైకోపీన్ ఆక్సిజన్ కణాలను మరియు వాటి సంబంధిత అన్ని రకాల జాతులను శుభ్రపరుస్తాయి. అంతేకాకుండా, DNA, లిపిడ్ మరియు ప్రోటీన్ లను ప్రమాదానికి గురిచేసే ఆక్సిజన్ పరమాణువులను కూడా శుభ్రపరుస్తుంది. ఆక్సిజన్ జాతులు న్యూరోడీజనరేటివ్ వ్యాధులను కలిగిస్తాయి. లైకోపీన్ లు మీ మెదడును ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించటమే కాకుండా, ప్రమాదాల భారి నుండి కూడా కాపాడుతుంది. ఒక గ్లాసు టమోటా రసం టీనేజ్ లో ఉండే అమ్మాయిల చర్మాన్ని మెరుగుపరచటమే కాకుండా జ్ఞాపక శక్తిని కూడా మెరుగుపరుస్తుంది. టమోటాలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ మరియు లైకోపీన్ లు జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తాయి. Image: Getty

  Tags:
 • పిల్లల ఆలోచన శక్తిని పెంచే జ్యూస్ లు
 • పిల్లలలో మేధాశక్తిని పెంచే జ్యూస్ లు
 • పిల్లలలో జ్ఞాపక శక్తిని పెంచే జ్యూస్ లు
 • Pillalalo gnapaka shaktini penche dravanalu
 • 5 superbrain drinks for your kids in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

 • అన్ని

 • వ్యాసం

 • స్లైడ్ షో

 • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

  చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
 • 2016 లోని టాప్ సూపర్ ఫుడ్స్ ఇవే...

  అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్, పాలీఫినాల్, విటమిన్, మినరల్ లను కలిగి ఉండే వాటిని సూపర్ ఫుడ్స్ గా పేర్కొంటారు. వాటి గుణాలను మరియు కలిగి ఉండే పోషకాలను
 • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

  వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
 • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

  వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
 • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

  చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
 • 2016 లోని టాప్ సూపర్ ఫుడ్స్ ఇవే...

  అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్, పాలీఫినాల్, విటమిన్, మినరల్ లను కలిగి ఉండే వాటిని సూపర్ ఫుడ్స్ గా పేర్కొంటారు. వాటి గుణాలను మరియు కలిగి ఉండే పోషకాలను