Health Tips in HindiHealth Tips

వీటిని తింటే నెలసరి అనుకున్న దాని కంటే ముందే వస్తుంది...

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:Jan 04, 2017

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

నెలసరి ఆలస్యంగా వస్తుందని బాధపడుతున్నారా? అనుకున్న సమయం కంటే ముందే నెలసరి వచ్చేలా చేయవచ్చు. అదేలాగంటారా? ఇది చదవండి.
  • 1

    ముందుగా నెలసరి

    క్రమరహిత నెలసరి అనేది చాలా స్త్రీలను సతమతం చేసే సమస్య. క్రమరహిత రుతుక్రమానికి ఒత్తిడి, మందుల వాడకం, ప్రయాణాలు లేదా ఇతర జీవనశైలి విధానాలు కారణంగా చెప్పవచ్చు. స్త్రీలలో కలిగే నెలసరి వారి సంతానోత్పత్తిని నేరుగా ప్రభావితపరుస్తుంది. నెలసరి సరైన సమయానికి లేదా అనుకున్న సమయానికి వచ్చేలా చేసుకోవటం తెలివైన ఆలోచనగానే చెప్పవచ్చు. మరి దీని కోసం వాడాల్సిన ఔషదాలు మరియు తినాల్సిన ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుపబడింది.  Image source: Getty Images

  • 2

    నువ్వులు

    అసలు సమయం కన్నా ముందుగా నెలసరి రావాలంటే నువ్వులను తేనెలో కలుపుకొని తీసుకోవాలి. ఒక చెంచా తేనెలో ఒక చెంచా నువ్వులను కలిపి తీసుకోవాలి, ఇలా రోజు కనీసం 3 సార్లైనా చేయాలి. నెలసరి వచ్చే వారం ముందు నుండి ఈ పద్దతిని అనుసరించటం చాలా మంచిది.  Image source: Getty Images

  • 3

    బొప్పాయి పండు

    అనుకున్న సమయం కంటే ముందుగానే నెలసరి కావాలనుకునే వారికి అద్భుతమైన ఫలంగా దీనిని పేర్కొనవచ్చు. ఈ పండులో కెరోటిన్ అనే సమ్మేళనం ఈస్ట్రోజెన్ హార్మోన్ ను ఉద్దీపనలకు గురి చేయటం వలన నెలసరి అనుకున్న సమయం కంటే ముందే వస్తుంది. దీనితో పాటుగా, ఈ పండు తినటం వలన శరీరంలో ఉష్ణోగ్రతలు పెరిగి, నెలసరి ముందుగా రావటానికి సహాయపడుతుంది. Image source: Getty Images

  • 4

    పసుపు

    మీకు తెలుసా పసుపు కూడా అనుకున్న సమయం కంటే ముందుగానే నెలసరి రావటానికి సహాయపడుతుందని? అవును నిజమే. నెలసరి త్వరగా రావాలి అనుకునే వారు అసలు సమయానికి 12 - 15 రోజుల ముందు నుండి చిటికెడు పసుపు కలిపిన నీటిని తాగాలి. ఇలా చేయటం వలన మీరు అనుకున్నది సాధ్యం అవుతుంది. Image source: Getty Images

  • 5

    గుమ్మడి విత్తనాలు

    నెలసరి వచ్చే సమయంలో పిడికెడు గుమ్మడి విత్తనాలను తినటం వలన అనుకున్న సమయం కంటే ముందుగానే రుతుక్రమం వస్తుంది. ఈ ఔషదాలు నెలసరి సమయంలో తగిన సహాయాన్ని అందిస్తున్నాయి. కానీ, ఇలాంటి వాటిని అనుసరించే ముందు మీ వైద్యుడిని కలవటం తప్పని సరి ఎందుకంటే  ఇవి శరీరంలోని హార్మోన్ల స్థాయిలను మారుస్తాయి. Image source: Getty Images

    Tags:
  • నెలసరి త్వరగా వచ్చేలా చేసే ఆహారాలు
  • రుతుక్రమం త్వరగా వచ్చేలా చేసే చిట్కాలు
  • అనుకున్న దాని కన్నా త్వరగా పీరియడ్ వచ్చేలా చేసే ఆహారాలు
  • Nelasari tvaraga vachhela chese chitkalau
  • Foods to prepone periods in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ