Health Tips in HindiHealth Tips

భారతీయులకు మధుమేహ సంబంధిత ఆహార సూచనలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:May 16, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

మధుమేహ వ్యాధిని ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించాలంటే ఆహారాలలో మార్పులు తప్పని సరి. ముఖ్యంగా, రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచే ఆహారాల గురించి మరియు గాయపరిచే ఆహారాల గురించి తెలిసి ఉండాలి. మీ కోసం వాటి గురించిన వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి.
  • 1

    ఆహారంతో మధుమేహ నియంత్రణ

    మధుమేహన్ని ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించడానికి ఆరోగ్యకర ఆహారం అవసరం ఉంది. మధుమేహ వ్యాధి గ్రస్తుల శరీర రక్తంలో చక్కెరలను ఆరోగ్యకర స్థాయిలో నిర్వహించటానికి, ఏ రకమైన ఆహారం తీసుకోవాలో, ఏ ఆహారాలకు దూరంగా ఉండాలని వాటి పైన ప్రత్యేక అవగాహన కలిగి ఉండాలి. మధుమేహుల ఆహారంలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు మరియు ప్రోటీన్ల శాతం వరుసగా 60:20:20 నిష్పత్తిలో ఉండాలి. పండ్లు, కూరగాయలు మరియు పాలు కూడా చాలా అవసరం. మధుమేహుల కోసం ఇక్కడ కొన్ని ఆరోగ్య సూచనలు తెలుపబడ్డాయి.  (Image source:Gettyimages)

  • 2

    రోజు పాలు తాగండి

    పాల ఉత్పత్తులు శరీరానికి కావలసిన మరియు ఎముకల ఆరోగ్యాన్ని పెంపొందించే పోషకాలను అందిస్తాయి. కానీ, మధుమేహ వ్యాధి గ్రస్తులు పాలను ఎంత మొత్తంలో తీసుకుంటున్నారు అనేది చాలా ముఖ్యం. మధుమేహం కలిగి ఉన్నవారు రోజు రెండు గ్లాసుల పాలను తాగటం వలన శరీర రక్తంలో చక్కెర స్థాయిలు ఆరోగ్యకరంగా ఉంటాయి.  (Image source:Gettyimages)

  • 3

    ఫైబర్ లు ఎక్కువగా ఉన్న ఆహారాలు

    మధుమేహ వ్యాధి గ్రస్తులకు కావలసిన ఆరోగ్యకర ఆహార ప్రణాళికలలో కూరగాయలు ముఖ్యమని చెప్పవచ్చు. అధికంగా ఫైబర్లు కలిగి ఉండే కూరగాయలు అయినట్టి పీస్, బీన్స్, పాలకూర, బ్రోకలీ మరియు ఇతరేతర పచ్చని ఆకుకూరలను మధుమేహ వ్యాధి గ్రస్తుల ఆహారాలలో ఉండేలా చూడాలి. వీటిలో మొలకెత్తుతున్న విత్తనాలు కూడా చాలా ముఖ్యమని చెప్పవచ్చు. (Image source:Gettyimages)

  • 4

    పండ్లు

    అధిక మొత్తంలో ఫైబర్ లను కలిగి ఉండే బొప్పాయి పండు, ఆపిల్, నారింజ పండు, జామపండు వంటి పండ్లు, మధుమేహ వ్యాధి గ్రస్తుల శరీరంలోని చక్కెరలను ఆరోగ్యకర స్థాయిలో నిర్వహిస్తాయి. అధిక మొత్తంలో చక్కెరలను కలిగి ఉండే పండ్లు (మామిడి పండు, అరటిపండు, ద్రాక్ష పండ్లు), శరీరంలో రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావిత పరుస్తాయి. కావున, వీటికి దూరంగా ఉండాలి. (Image source:Gettyimages)

  • 5

    మంచి కొవ్వు పదార్థాలు

    ఒమేగా-3 ఫాటీ ఆసిడ్ మరియు మోనోసాచురేటేడ్ ఫాట్ లు, రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి. క్యానోలా ఆయిల్, ఫ్లాక్స్ సీడ్స్ ఆయిల్, ఫాటీ ఫిష్ మరియు నట్స్ వంటివి అధిక మొత్తంలో ఆరోగ్యకర కొవ్వు పదార్థాలను కలిగి ఉండి, అనారోగ్యకర కొవ్వు పదార్థాలను మరియు ట్రాన్స్ ఫ్యాట్ లను తక్కువగా కలిగి ఉంటాయి.(Image source:Gettyimages)

  • 6

    తరచుగా చిన్న మొత్తంలో ఆహారాలు

    రోజు మొత్తంలో మధుమేహ వ్యాధి గ్రస్తులు తక్కువ స్థాయిలో, కనీసం 5 సార్లు ఆహారాన్ని తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. ఎందుకంటే, ఒకేసారి ఎక్కువ స్థాయిలో ఆహరం తీసుకోవటం వలన చక్కెర స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి. రోజులో 4 సార్లు తక్కువ మొత్తంలో ఆహారాలను, వాటి మధ్య 2 సార్లు ఆరోగ్యకర స్నాక్స్ తినటం మంచిది.  (Image source:Gettyimages)

  • 7

    పప్పులు అనారోగ్యం కాదు

    కాయధాన్యాలు, కిడ్నీ బీన్స్ మరియు చిక్పీస్ వంటి పప్పులు ఆరోగ్యం కాదనే చెప్పాలి. కానీ, వీటిని రోజు తగిన మొత్తంలో మాత్రమే తినటం వలన రక్తంలోని చక్కెర స్థాయిలు నియంత్రించబడి, కరోనరీ ఆర్టేరి డిసిజేస్ వంటి గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉంచుతాయి. (Image source:Gettyimages)

  • 8

    ఎండు ద్రాక్షలు

    ఎండు ద్రాక్షలను తినటం వలన వాటిలో ఉండే ఫ్రక్టోజ్ లు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి, కావున మధుమేహులు వీటికి దూరంగా ఉండమని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. కావున ఎండిన పండ్ల కన్నా, తాజా పండ్లను స్నాక్స్ గా తినండి. ఒక పిడికెడు గింజలు రోజు స్నాక్స్ గా తీసుకోవటం వలన మీ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. (Image source:Gettyimages)

  • 9

    తినకూడనివి

    కొన్ని రకాల ఆహార పదార్థాలు మధుమేహ గ్రస్తులను గాయపరుస్తాయి. చాక్లెట్లు, బిస్కెట్లు  మరియు కృతిమ చక్కెరలకు దూరంగా ఉండాలి. చిన్న మొత్తంలోనే వీటి సేకరణ వలన మధుమేహ వ్యాధి గ్రస్తులలో చాలా ప్రమాదాలకు గురి చేస్తాయి. దీనికి అనుగుణంగానే, ఆల్కహాల్ సేకరణను కూడా తగ్గించాలి లేదా పూర్తిగా మానేయటం మంచిది.  (Image source:Gettyimages)

  • 10

    ఔషదాలు

    మధుమేహ వ్యాధిని అదుపులో ఉంచటానికి ఆహారాలలో చేసిన మార్పులతో పాటుగా, కొన్ని రకాల ఔషదాలు కూడా చక్కెర స్థాయిలను స్థిమితంగా ఉంచుటలో సహాయపడతాయి. రోజు ఉదయాన ఖాళీ కడుపు లేదా పడిగడుపున, ఒక గ్లాసు టమోటా రసంలో కొద్దిగా ఉప్పు మరియు మిరియాలు కలుపుకొని తాగండి. పూర్తి రాత్రి నానబెట్టిన 3 నుండి 4 బాదం గింజలు మధుమేహాన్ని నియంత్రిస్తాయి. (Image source:Gettyimages)

    Tags:
  • మధుమేహులకు ఆరోగ్యకర ఆహారాలు
  • మధుమేహులు దూరంగా ఉండాల్సిన ఆహారాలు
  • Madhumehulaku Arogya Chitkalau
  • Healthy Tips for Indians Diabetes in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • ఆదర్శ ప్రియుడి యొక్క లక్షణాలు

    మగువలు ప్రియుడి జేబులో ఎక్కువగా డబ్బులు లేదా అతడికి సిక్స్ ప్యాక్ ఉండాలని ఆశపడరు. స్త్రీలు తన ప్రియుడి నుండి ఆశించే గుణాలు మరియు లక్షణాల గురించి ఇక్కడ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • ఆదర్శ ప్రియుడి యొక్క లక్షణాలు

    మగువలు ప్రియుడి జేబులో ఎక్కువగా డబ్బులు లేదా అతడికి సిక్స్ ప్యాక్ ఉండాలని ఆశపడరు. స్త్రీలు తన ప్రియుడి నుండి ఆశించే గుణాలు మరియు లక్షణాల గురించి ఇక్కడ