Health Tips in HindiHealth Tips

నిమ్మరస వాడకం వలన కలిగే ప్రయోజనాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Nov 07, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

పురాతన కాలం నుండి నిమ్మరసం వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి మనందరికీ తెలిసిందే. విటమిన్ 'C' సిట్రిక్ ఆసిడ్, కాల్షియం, మెగ్నీషియం, పెక్టిన్ వంటి ముఖ్య పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
  • 1

    జీర్ణక్రియ ప్రక్రియలో సహాయం

    నిమ్మరసం శరీరంలో ఉండే అవాంఛిత విష పదార్థాలను భయటకు పంపుతుంది మరియు లాలాజలం, హైడ్రోక్లోరిక్ ఆసిడ్ వలే అణువుల కూర్పును కలిగి ఉండి, ఆహార జీర్ణం అవటానికి సహాయపడతాయి. అధిక మొత్తంలో విటమిన్, మినరల్ లను కలిగి ఉండి, అజీర్ణం వంటి సమస్యలను తగ్గించటమే కాకుండా, జీర్ణాశయ వ్యవస్థలో ఉండే విష పదార్థాలను భయటకు పంపుతుంది.

  • 2

    డైయూరేటిక్ వలే పని చేసి, వ్యవస్థలను శుభ్రపరుస్తుంది

    నిమ్మరసాన్ని తాగటం వలన మూత్ర విసర్జన అధికం అవుతుంది, ఫలితంగా శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలు వేగంగా భయటకు పంపబడతాయి. నిమ్మలో ఉండే సిట్రిక్ ఆసిడ్ ఎంజైమ్ ల విధిని మెరుగుపరచటమే కాకుండా, కాలేయం మరియు శరీరాన్ని డిటాక్సిఫై చర్యకు గురి చేస్తుంది.

  • 3

    రోగ నిరోధక శక్తి పెరుగుదల

    నిమ్మ విటమిన్ 'C' పుష్కలంగా కలిగి ఉండటం వలన జలుబును తగ్గిస్తుంది మరియు దీనిలో ఉండే పొటాషియం నాడీ విధులను ఉద్దీపణలకు గురి చేస్తుంది. నిమ్మలో ఉండే ఆస్కార్బిక్ ఆసిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ గా పని చేసి, ఆస్తమా లేదా శ్వాస సంబంధిత సమస్యలను తగ్గించి వేస్తుంది.

  • 4

    శోషరస వ్యవస్థను హైడ్రేట్ కు గురి చేస్తుంది

    నిమ్మరసం రోగ నిరోధక వ్యవస్థకు మద్దతుగా నిలవటమే కాకుండా, శరీరం కోల్పోయిన (హైడ్రేట్) ద్రావణాలను బదిలీ చేస్తుంది. శరీరానికి అధిక మొత్తంలో నీరు అవసరమైనపుడు, అలసటగా అనిపించినపుడు, శక్తి విడుదల లోపాలు, ఒత్తిడికి గురైనపుడు మరియు మానసిక స్పష్టత లేని సమయం వంటి వివిధ రకాల సమస్యలకు గురైనపుడు నిమ్మరసం వీటి నుండి ఉపశమనం కలిగిస్తుంది. కావున, నిమ్మరస సేకరణ వలన శరీరం రిఫ్రెష్ కు గురవుతుంది.

  • 5

    బరువు తగ్గుటలో సహాయం

    మీ శరీర బరువు తగ్గించుకోవాలనుకుంటున్నారా! అయితే రోజు ఉదయాన గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం మరియు తేనె కలిపి తాగండి. నిమ్మలో ఉండే పెక్టిన్ ఫైబర్ లు, పొట్ట నిండినట్టుగా అనిపించేలా చేసి, ఆకలిని నివారించి, అధిక ఆహార సేకరణకు దూరంగా ఉంచుతాయి. Image Source : Getty Images

    Tags:
  • నిమ్మరసం ప్రయోజనాలు
  • నిమ్మరసం ప్రాముఖ్యత
  • నిమ్మరసం వలన ఆరోగ్యానికి కలిగే ఉపయోగాలు
  • Nimmarasam Prayojanalu
  • lemon water benifits in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు