Health Tips in HindiHealth Tips

మధుమేహ వ్యాధిని తగ్గించే మార్గాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Jul 17, 2014

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

అన్ని దేశాల ప్రజలు ఇబ్బందిపడే వ్యాధి మధుమేహం, ఇక్కడ తెలిపిన సూచనల ద్వారా మధుమేహ వ్యాధికి దూరంగా ఉండవచ్చు మరియు మధుమేహ స్థాయిలను తారా స్థాయికి చేరకుండా ఆపవచ్చు.
  • 1

    ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఆహరం

    మధుమేహ వ్యాధితో భాదపడే వారు ఫైబర్ ఎక్కువ ఉన్నఆహారాలు తీసుకోమని మరియు తీసుకునే ఆహరంలో తక్కువ కార్బోహైడ్రేట్'లు, కొవ్వు పదార్థాలు ఉండేలా చూసుకోమని నిపుణులు మరియు వైద్యులు సలహా ఇస్తున్నారు. తీసుకునే ఆహరంలో ప్రోటీన్ స్థాయిలు అధికంగా ఉండటం వలన శక్తి స్థాయిలు నిర్వహణ, శరీరంలో జరిగే జీవక్రియ రేటు కుడా సాధారణ స్థాయిలో ఉండేలా చేస్తాయి. Image Courtesy@www.gettyimages.in  

  • 2

    పోగత్రాగటానికి దూరంగా ఉండండి

    పొగత్రాగటం వలన గుండె సంబంధిత వ్యాధులు మాత్రమె కాకుండా మధుమేహ వ్యాధిని ప్రభావిత పరిచే హార్మోన్'ల విడుదలలో మార్పులను కలుగచేస్తుంది. పొగత్రాగటం వలన మీ మధుమేహ వ్యాధి తీవ్రస్థాయిలకు చేరటమే కాకుండా పూర్తి ఆరోగ్యాన్ని ప్రమాదానికి గురి చేస్తుంది. Image Courtesy@www.gettyimages.in  

  • 3

    ఎక్కువ నీరు త్రాగటం వలన

    నీరు అనేది శరీరానికి అవసరమైన వాటిలో ముఖ్యమైంది మాత్రమే కాకుండా, శరీర రక్తంలోని చక్కెరలను మరియు కొవ్వు పదార్థాల స్థాయిలను పెరగకుండా సహాయపడుతుంది. రోజు నీటిని ఎక్కువగా త్రాగటం వలన రోజులో జరిపే కార్యకలపాలను ఉత్తేజంగా నిర్వహించటమే కాకుండా గుండె సంబందిత వ్యాధులు మరియు మధుమేహ వ్యాధి వలన కలిగే సంక్లిష్ట సమస్యలను తగ్గిస్తుంది. Image Courtesy@www.gettyimages.in  

  • 4

    హాయిగా పడుకోండి

    యుక్త వసయులో ఉన్న వారు రోజులో 7 నుండి 8 గంటలు పడుకునే వారితో పోలిస్తే, పడుకొని వారు ఎక్కువగా మధుమేహ వ్యాధికి గురవుతున్నారు అని వివిధ రకాల పరిశోధనలలో వెల్లడించబడింది. అవసరమైనంత మేరలో పడుకోకపోవటం వలన శరీరంలో హార్మోన్'ల విడుదలలో అసమతుల్యతలు మరియు మధుమేహవ్యాధి విషమ పరిస్థితికి చేరుకునే అవకాశం ఉంది. Image Courtesy@www.gettyimages.in  

  • 5

    వ్యాయమాలు

    ఆరోగ్యవంతమైన జీవన శైలి, వివిధ రకాల భౌతిక కార్యకలపాలను చేయటం వలన మధుమేహ వ్యాధిని నివారించవచ్చు లేదా మధుమేహ వ్యాధి కలుగటాన్ని ఆలస్యం చేయవచ్చు. మధుమేహ వ్యాధిని మాత్రమె కాకుండా ఇతరేతర చాలా రకాల వ్యాధులను శక్తి వంతంగా, సులువుగా తగ్గిస్తుంది అంబి చెప్పవచ్చు. సైక్లింగ్ లేదా జాగింగ్ వంటి సులువైన వాటిని అనుసరించవచ్చు. Image Courtesy@www.gettyimages.in  

  • 6

    ఫైబర్

    ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తీసుకోవటం వలన మధుమేహ వ్యాధి గ్రస్తులలో రక్తంలోని చక్కెర స్థాయిలు మరియు ఇన్సులిన్ విడుదలను సాధారణ స్థాయిలో ఉండేలా చూస్తాయి. హోట్ మల్ వీల్టీ గ్రైన్స్, మరియు ఫైబర్'లు అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవటం వలన మధుమేహ వ్యాధిని సులభంగా నిర్వహించవచ్చు. Image Courtesy@www.gettyimages.in  

  • 7

    మధ్యపానం

    ఆల్కహాల్'ను తాగటం వలన శరీర రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి, మరియు ఆల్కహాల్ ఎక్కువ క్యాలోరీలను కలిగి ఉంటాయి. మీరు మధుమేహ వ్యాధి కలిగి ఉండి, ఆహర నియమాలను పాటిస్తున్నట్లయితే మరియు మీ శరీరంలో చక్కెర స్థాయిలు ఆరోగ్యకరమైన స్థాయిలో నిర్వహించబడినట్లయితే అపుడపుడు మాత్రమె ఆల్కహాల్'లను కొద్ది మొత్తంలో తీసుకోవచ్చు. Image Courtesy@www.gettyimages.in  

  • 8

    స్థాయిల తనికీ

    మధుమేహ వ్యాధిని తగ్గించటానికి ఉన్న మంచి మార్గం రోజు రక్తంలోని చక్కర స్థాయిలను చెక్ చేపించుకోవటం. 45 సంవత్సరాల వయసు గల వారు మరియు అంతకన్నా తక్కువ వయసు గల వారు ప్రతి మూడు సంవత్సరాలకి ఒక సారి చెక్ చేపించుకోవటం చాలా మంచిది. అంతేకాకుండా, అధిక రక్త పీడనం లేదా స్థూలకాయత్వం గల వారు తరచుగా చక్కర స్థాయిలను చెక్ చేపించుకుంటూ, వైద్యుడిని సంప్రదించటం చాలా మంచిది. Image Courtesy@www.gettyimages.in

    Tags:
  • మధుమేహ వ్యాధి నివారణలు
  • మధుమేహ వ్యాధిని తగ్గించటానికి మార్గాలు
  • మధుమేహ వ్యాధి త్రాకుండా ఉండుటకు సూచనలు
  • Preventions of Diabetes condition in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

Comments

  • gbm29 Jun 2015
    Very use ful
  • gbm29 Jun 2015
    Very use full
  • koneti siva17 Feb 2015
    Vere good Information

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • మధుమేహ వ్యాధిని తగ్గించే సహజ థెరపీలు

    చాలా సంవత్సరాల నుండి, మధుమేహ వ్యాధిని తగ్గించే చికిత్సలు గణనీయంగా పెరిగాయి. కానీ, సహజంగా మధుమేహ వ్యాధిని తగ్గించే పద్దతుల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • మధుమేహ వ్యాధిని తగ్గించే మార్గాలు

    అన్ని దేశాల ప్రజలు ఇబ్బందిపడే వ్యాధి మధుమేహం, ఇక్కడ తెలిపిన సూచనల ద్వారా మధుమేహ వ్యాధికి దూరంగా ఉండవచ్చు మరియు మధుమేహ స్థాయిలను తారా స్థాయికి చేరకుండా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • మధుమేహ వ్యాధిని తగ్గించే మార్గాలు

    అన్ని దేశాల ప్రజలు ఇబ్బందిపడే వ్యాధి మధుమేహం, ఇక్కడ తెలిపిన సూచనల ద్వారా మధుమేహ వ్యాధికి దూరంగా ఉండవచ్చు మరియు మధుమేహ స్థాయిలను తారా స్థాయికి చేరకుండా
  • మధుమేహ వ్యాధిని తగ్గించే సహజ థెరపీలు

    చాలా సంవత్సరాల నుండి, మధుమేహ వ్యాధిని తగ్గించే చికిత్సలు గణనీయంగా పెరిగాయి. కానీ, సహజంగా మధుమేహ వ్యాధిని తగ్గించే పద్దతుల గురించి ఇక్కడ తెలుపబడింది.