Health Tips in HindiHealth Tips

యవ్వనంగా కనపడేలా చేసే ఆహార పదార్థాలు

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:Mar 23, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

వృద్ధాప్య ప్రక్రియ అనేది ప్రతి వ్యక్తిలో భిన్నంగా ఉంటుంది. కానీ, కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వలన చర్మం యొక్క యవ్వనాన్ని కాపాడుకోవచ్చు. ఎక్కువగా సేంద్రీయ ఆహారాలను తీసుకోవడం వలన చర్మం యవ్వనంగా ఉంటుంది. ఆ ఆహారాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    అవకాడో

    అవకాడోలో, 'మోనోఅన్సాచురేటెడ్' కొవ్వు ఉంటుంది. ఈ కొవ్వు ధమనులలో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్ ని తగ్గిస్తుంది. అవకాడోలో విటమిన్ 'E' ఉంటుంది మరియు ఇది ఒక 'ప్రతిక్ష'కారినిగా కూడా పని చేస్తుంది. అందువలన చర్మం మృదువుగా మారి, చర్మంలో తేమని పెంచుతుంది. ఈ పండుని ముక్కలుగా చేసి సలాడ్ లో వేసుకొని తింటే రుచిగా ఉంటుంది.Image Courtesy : Getty Images

  • 2

    క్యారెట్లు

    క్యారెట్లలో చాలా వరకు  బీటాకెరోటిన్ ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని పెంచుతుంది మరియు శరీర నిర్విషీకరణకు తోడ్పడుతుంది. స్టాప్ ఏజింగ్ నౌ (stop aging now) అనే పుస్తకంలో ఉన్న ఒక పరిశోధన ద్వారా తేలిన విషయం ఏమిటంటే, క్యారేట్లలో ఉండే బీటా కెరోటిన్ అనే పదార్ధం, ప్రతిక్షకారినిగా పని చేయడం వలన చర్మం యొక్క వయసుతో పాటు చర్మ వ్యాధుల నుండి కూడా కాపాడుతుంది. నారింజ వర్ణ ద్రవ్యం ఉండడం వలన వ్యక్తి యొక్క రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.Image Courtesy : Getty Images

  • 3

    దోసకాయ

    దోసకాయ కణ పునరుత్పత్తికి చాలా దోహదపడుతుంది. దోసకాయతో నేరుగా ముఖం కూడా కడగవచ్చు. దోసకాయ ముక్కలతో కంటి కింద ఏర్పడిన నల్లటి వలయాలని నిర్మూలించవచ్చు. దోసకాయలో ఉండే ఖనిజ సిలికా మూలకం శరీర కండరాలు, మృదులాస్థి మరియు ఎముకల వృద్దికి తోడ్పడుతుంది. అంతేకాకుండా, చర్మం యొక్క నిగారింపుకి సహాయపడుతుంది. దోసకాయలలో పొటాషియం అయాన్, విటమిన్ 'C' మరియు మెగ్నీషియం ఉండడం వలన శరీరంపై క్షారీయ ప్రభావం చూపించి ఆరోగ్యవంతంగా మార్చుతుంది.Image Courtesy : Getty Images

  • 4

    బెర్రీలు

    బ్లాక్ బెర్రీలు మరియు బ్లూ బెర్రీలు ఫ్లావనాయిడ్ లని కలిగి ఉంటాయి. ఇది శక్తివంతమైన ప్రతిక్షకారిని. బెర్రీలు తినడం ద్వారా రోగనిరోధకశక్తి కూడా పెరుగుతుంది. ''కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో'' చేసిన పరిశోధనలో, బ్లాక్ బెర్రీ మరియు బ్లూ బెర్రీలు శక్తివంతమైన ప్రతిక్షకారిని అని తేలింది.Image Courtesy : Getty Images

  • 5

    కూరగాయలు

    కాలిఫ్లవర్, గ్రీన్ కాలిఫ్లవర్ మరియు క్యాబేజీ వంటి కూరగాయలు చర్మ రక్షణకి తోడ్పడుతాయి. ఇవి చర్మ క్యాన్సర్ నుంచి కాపాడి చర్మం యొక్క ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఈ కూరగాయలు వివిధ హార్మోన్ల స్థాయిలను సమానంగా నిర్వహించడం గమనించారు.Image Courtesy : Getty Images

  • 6

    ఆపిల్

    నిరంతరం దొరికే అతి ముఖ్యమైన పండ్లలో ఆపిల్ కూడా ఒకటి. ఆపిల్ లో 'పెక్టిన్' అనే పోషక పదార్ధం ఉండే, శరీరంలో ఉండే విషపదార్థాలు భయటకు పంపివేస్తుంది . శరీరంలో ఎలాంటి విష పదార్థాలు లేని సమయంలో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. 'డేవిడ్ వోల్ఫే' అనే పోషక నిపుణుడు ప్రకారం, విటమిన్ 'C' వలన చర్మ కణాలు పెరిగి, చర్మం కాంతివంతంగా మారుతుంది మరియు వెంట్రుకలు, గోర్లు బలపడతాయి. ఆపిల్ లో ఉండే విటమిన్ 'B' (ముఖ్యంగా B9 మరియు B5) చర్మ సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుందని తెలిపారు.Image Courtesy : Getty Images

  • 7

    కొబ్బరి నూనె

    కొబ్బరి నూనెలో ఉండే వివిధ పోషక పదార్థాలు కణ నిర్మాణానికి ఉపయోగపడతాయి. దీని వలన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. కొబ్బరి నూనెను నేరుగా చర్మం పైన వాడినట్లయితే, చర్మంపై పగుళ్ళు రాకుండా సహాయపడుతుంది మరియు చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా ఉంటుంది.Image Courtesy : Getty Images

  • 8

    నట్స్

    వీటిలో చాలా రకాల విటమిన్లు, ఖనిజాలు మరియు అనామ్లజనకాలు ఉంటాయి. ఇవి జీర్ణశక్తిని పెంపొందించి, పరోక్షంగా చర్మఆరోగ్యానికి దోహదపడతాయి. శాస్త్రవేత్తల వివిధ పరిశోధనల ప్రకారం, నట్స్ లలో చాలా పోషక విలువలు మరియు విటమిన్లు, ఖనిజాలను కలిగి ఉంటాయి. ఇవి చర్మ సౌందర్యానికి దోహదపడతాయని తెలిపారు.Image Courtesy : Getty Images

  • 9

    స్ట్రాబెర్రీ

    స్ట్రాబెర్రీలో ఎక్కువ శాతం విటమిన్ 'C' ఉండడం వలన త్వరగా వృద్ధాప్యం రాకుండా కాపాడుతుంది. శరీరంలో ఉన్న విష పదార్థాల్ని కూడా నిర్మూలిస్తుంది. స్ట్రాబెర్రీలో విటమిన్ 'C' తో పాటు విటమిన్ 'A' మరియు 'E' కూడా ఉంటాయి. ఇది ప్రతిక్షకారినిగా పని చేస్తుంది. అందువలన చర్మం ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంటుంది.Image Courtesy : Getty Images

  • 10

    జామకాయ

    జామకాయలు ఐరన్ ను ఎక్కువగా కలిగి ఉండి, జీర్ణ శక్తిని పెంచుతుంది. ఇవి శరీరంలోని విషపదార్థాలు తొలగించడం వలన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. "జిస్ట్" అనే శాస్త్రవేత్త ప్రతిపాదనల ప్రకారం, జామకాయల్లో విటమిన్ 'C' ఉండడం వలన శరీరానికి ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే వివిధ వ్యాధులతో, వైరస్ మరియు బాక్టీరియాలతో పోరాడుతుంది. జామకాయలు తినడం వలన గాయాలు త్వరగా నయమవుతాయి.Image Courtesy : Getty Images

    Tags:
  • యవ్వనంగా ఉంచే ఆహారాలు
  • వృద్ధ్యాప్యాన్ని నివారించే ఆహారాలు
  • యాంటీ ఏజింగ్ ఆహారాలు
  • Anti-ageing Foods for Skin in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • యవ్వనంగా కనపడేలా చేసే ఆహార పదార్థాలు

    వృద్ధాప్య ప్రక్రియ అనేది ప్రతి వ్యక్తిలో భిన్నంగా ఉంటుంది. కానీ, కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వలన చర్మం యొక్క యవ్వనాన్ని కాపాడుకోవచ్చు. ఎక్కువగా సే
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • మిమ్మల్ని లావుగా చేసే ఆహర పదార్థాలు

    లావుగా అవటానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారా! ఏన్ని రకాలుగా ప్రయత్నించిన సరైన ఫలితాలను పొందటం లేదా! అయితే ఇక్కడ తెలిపిన పదార్థాల సేకరణ వలన తప్పక మ
  • జుట్టు నెరవకుండా చేసే ఆహార పదార్థాలు

    వృద్దాప్యం చేరువవుతున్న కొలది వెంట్రుకలు తెల్లబడటం ప్రారంభమవుతుంది. కానీ ప్రస్తుతకాలంలో, చిన్న వయసులోనే జుట్టు రంగు మారటం వలన చాలా మంది రంగు వేయటం ప్ర
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • శీతాకాలంలో తినకూడని ఆహార పదార్థాలు

    శీతాకాలం వాతావరణం చాలా దిగులుగా మరియు ఆహరం తీసుకోటానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. శీతాకాలంలో తినకూడని ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • యవ్వనంగా కనపడేలా చేసే ఆహార పదార్థాలు

    వృద్ధాప్య ప్రక్రియ అనేది ప్రతి వ్యక్తిలో భిన్నంగా ఉంటుంది. కానీ, కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం వలన చర్మం యొక్క యవ్వనాన్ని కాపాడుకోవచ్చు. ఎక్కువగా సే
  • మిమ్మల్ని లావుగా చేసే ఆహర పదార్థాలు

    లావుగా అవటానికి అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నారా! ఏన్ని రకాలుగా ప్రయత్నించిన సరైన ఫలితాలను పొందటం లేదా! అయితే ఇక్కడ తెలిపిన పదార్థాల సేకరణ వలన తప్పక మ
  • శీతాకాలంలో తినకూడని ఆహార పదార్థాలు

    శీతాకాలం వాతావరణం చాలా దిగులుగా మరియు ఆహరం తీసుకోటానికి కూడా ఇబ్బందిగా అనిపిస్తుంది. శీతాకాలంలో తినకూడని ఆహార పదార్థాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • జుట్టు నెరవకుండా చేసే ఆహార పదార్థాలు

    వృద్దాప్యం చేరువవుతున్న కొలది వెంట్రుకలు తెల్లబడటం ప్రారంభమవుతుంది. కానీ ప్రస్తుతకాలంలో, చిన్న వయసులోనే జుట్టు రంగు మారటం వలన చాలా మంది రంగు వేయటం ప్ర