Health Tips in HindiHealth Tips

వర్షాకాలంలో పొట్టలో కలిగే ఇన్ఫెక్షన్ లకు దూరంగా ఉంచే చిట్కాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Jul 01, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

వేసవి వేడి నుండి ప్రశాంతతను వర్షాకాలం చేకూరుస్తుంది. కానీ, ఈ కాలంలో కలిగే ఇన్ఫెక్షన్ లు లేదా అంటువ్యాధుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వీటి నుండి ఉపశమనం కలిగించే చిట్కాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    వర్షాకాలంలో అంటువ్యాధులు

    పొట్టలో ఇన్ఫెక్షన్ లు కలగటం అనేది తినే ఆహారం లేదా నీటి వలన కలుగుతాయి. ముఖ్యంగా ఈ.కోలై, సాల్మొనెల్లా, షిల్లాంగ్ మరియు H. పైలోరి వంటి వ్యాధికారకాల వలన అనారోగ్యానికి గురి అవ్వవలసి వస్తుంది. విరేచనాలు, అసాధారణ తిమ్మిరులు, పొట్ట నొప్పి మరియు వంతుల వంటి పొట్ట సంబంధిత సమస్యలు వర్షాకాలంలో కలుగుతాయి. ఇలా కలిగే పొట్ట సంబంధిత ఇబ్బందులకు దూరంగా ఉంచే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డాయి.

  • 2

    పూర్తిగా ఉడికిన ఆహారాన్ని తినండి

    సరిగా ఉడకని ఆహార పదార్థాలు సాల్మొనెల్లా మరియు ఈ.కోలై వంటి ప్రామాదకర బాక్టీరియాలు ఉండి, ఆహారాన్ని విషపూరితంగా మారుస్తాయి. గుడ్డు లేదా మాంసం తినే ముందు అవి సరిగా ఉడికాయో లేదో ఒకటికి రెండు సార్లు చూసుకోవటం మంచిది. ఆకుకూరలు మరియు కూరగాయలు కూడా వండటానికి ముందు శుభ్రంగా కడగాలి. కావున తినే ఆహార పదార్థాలను సరిగా వండిన తరువాతే తినటం ఆరోగ్యానికి మంచిది.

  • 3

    నీటిని వేడి చేసుకొని తాగండి

    బాటిల్ లలో ఉండే నీరు మనం రోజు తాగలేము ఎందుకంటే ఇవి చాలా ఖరీదైనవి మరియు బాటిల్ లలో లభించే నీరు పూర్తిగా శుభ్రపరచబడి ఉండదు కావున క్రిములను కలిగి ఉంటాయి. శుద్దమైన నీరు తాగటానికి అందుబాటులో ఉన్న మంచి మార్గం- వాటిని వేడి చేయటం. మీరు తాగే నీటిని వేడి చేసి, చల్లార్చి తాగండి. దీని ఫలితంగా నీటిలో ఉండే క్రిములు తొలగించబడతాయి.

  • 4

    అపరిశుభ్ర ఆహారాన్ని తినకండి

    రోడ్డు పక్కన ఉండే ఆహార పదార్థాలు రుచిగా ఉంటాయని అనుకుంటూ ఉంటాము. కానీ, రోడ్డు పక్కన ఉండే ఆహార పదార్థాలను వడ్డించే వారి చేతులు శుభ్రంగా ఉండవు. అపరిశుభ్ర ఆహరం వలన తప్పక అనారోగ్యానికి గురవుతారు. రోడ్డు పక్కన తయారు చేసే ఆహర పదార్థాలను శుభ్రంగా తయారు చేయరు మరియు కాలుష్యానికి గురై ఉంటాయి కావున వీటికి వీలైనంత దూరంగా ఉండటం మీకే మంచిది.

  • 5

    మంచి ఆహారాన్ని తీసుకోండి

    పొట్టలో కలిగే ఇలాంటి ఇన్ఫెక్షన్ లను తొలగించుకోటానికి అందుబాటులో ఉన్న మార్గం- ఆరోగ్యకరమైన ఆహారం తినటం. సరైన ఆహరం తీసుకొని ఎడల మీరు తప్పక అనారోగ్యాలకు గురవుతుంటారు. తినే ఆహారాన్ని తెలివిగా ఎంచుకుంటూ, వేడిగా ఉండే ఆహారాన్ని తింటూ, తాజాగా వండిన ఆహారాన్ని మాత్రమే తీసుకోండి.

  • 6

    చేతులను శుభ్రంగా కడుక్కోండి

    కడగని చేతులకు చాలా క్రిములు ఉంటాయి కావున తినటానికి ముందు చేతులను తప్పక కడుక్కోండి. ముఖ్యంగా స్కూల్, కాలేజీకి వెళ్ళే పిల్లలకు మరియు పనికి వెళ్ళే పెద్దలకు చాలా అవరం.  పొట్టలో ఇన్ఫెక్షన్ లు కలగటానికి చాలా వరకు కారణం ఏమిటంటే- తినే ముందు చేతులను కడుక్కొకపోవటం. కావున చేతులను యాంటీ బాక్టీరియల్ సబ్బు కడగటం వలన చేతులపై ఉండే బాక్టీరియాలు తొలగిపోతాయి.

  • 7

    వేయించిన ఆహారాలకు దూరంగా ఉండండి

    ఈ సూచన కేవలం వర్షాకాలంలో మాత్రమే కాకుండా, అన్ని కాలలో వర్తిస్తుంది. నూనెలో ఆధారిత ఆహారాలు, నూనెలో వేయించిన ఆహార పదర్థాలకు వీలైనంత దూరం ఉండాలి. ఇలాంటి ఆహారాలు మన జీర్ణాశయంలో సమస్యలను కలిగిస్తాయి, వీటి వలన పొట్టలో ఇన్ఫెక్షన్ లు కలిగే అవకాశం అధికమే.  Image Source: gettyimages.in

    Tags:
  • వర్షాకాలపు ఆరోగ్య చిట్కాలు
  • వర్షాకాలపు సంరక్షణ చిట్కాలు
  • వర్షాకాలపు అంటువ్యాధుల నివారణ చిట్కాలు
  • పొట్టలో కలిగే ఇన్ఫెక్షన్ లకు నివారణ చిట్కాలు
  • Varshakalapu samrakshana chitkalu
  • Understanding Stomach Infection in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ