Health Tips in HindiHealth Tips

రక్తంలోని గ్లూకోస్ స్థాయిలను చెక్ చేసే పరీక్షలో కలిగే నొప్పిని తగ్గించే చిట్కాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Apr 15, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

రక్తంలోని గ్లూకోస్ స్థాయిలను నిర్వహించే పరీక్షలో, ముఖ్యంగా, మధుమేహ వ్యాధి గ్రస్తులు రోజు గాయాలు గురయ్యి నొప్పిని అనుభవిస్తూనే ఉన్నారు. ఇక్కడ తెలిపిన చిట్కాల ద్వారా నొప్పి నుండి విముక్తి పొందవచ్చు.
  • 1

    నొప్పి

    రక్తంలోని గ్లూకోస్ స్థాయిలను చెక్ చేయటానికి, రక్తం సేకరించుటకు, వేలు చివర భాగంలో గాయపరుస్తాము. రక్త నమూనాను సేకరించుటకు గానూ, చిన్న సూదితో గాయపరచి రక్త పరీక్ష నిర్వహిస్తాము. ఈ పరీక్ష ద్వారా చాలా మంది, ముఖ్యంగా మధుమేహ వ్యాధి గ్రస్తులు రోజు గాయాలకు గురవుతూనే ఉన్నారు. ఇలాంటి నొప్పి నుండి విముక్తి పొందుటకు కొన్ని సూచనలు ఇక్కడ తెలుపబడ్డాయి.Image Courtesy : Getty Images

  • 2

    ఉత్తమమైనది ఎంచుకోండి

    చాలా మంది ప్రజలు, రక్తంలోని గ్లూకోస్ స్థాయిలను తెలుసుకోటానికి నిర్వహించే పరీక్షలో కలిగే నొప్పిని భరించలేకపోతున్నారు. ఇలాంటి వారి కోసం మేమిచ్చే సూచన- పరీక్ష ఎంచుకునే వేలును  లేదా సరైన ప్రాంతాన్ని ఎంచుకోండి. చాలా మంది వేలు యొక్క గోరు దగ్గర ప్రాంతాన్ని ఎంచుకుంటారు, మీరు కూడా నొప్పి కలగని ప్రాంతాన్ని ఎంచుకొని పరీక్ష నిర్వహించండి.Image Courtesy : Getty Images

  • 3

    వేలు మొనను ఎంచుకోకండి

    వేలు మొనలు చాలా సున్నితంగా ఉంటాయి మరియు ఈ ప్రాంతంలో సూదితో గాయపచటం వలన నొప్పి ఎక్కువగా ఉంటుంది. రక్త పరీక్ష నిర్వహించబోయే ప్రాంతాన్ని ఎంచుకున్న తరువాత, కొద్ది పీడనంతో ఆ ప్రాంతాన్ని నొక్కి పట్టి పరీక్ష నిర్వహించటం వలన నొప్పి తక్కువగా ఉంటుంది. Image Courtesy : Getty Images

  • 4

    శుభ్రపరచుటకు ఆల్కహాల్'ను వాడకండి

    పరీక్ష నిర్వహించుటకు ఎంచుకున్న వేలును ఆల్కహాల్'తో శుభ్రపరచటం వలన చర్మం ఎండిపోయి, పగుళ్ళు ఏర్పడి, మరింత నొప్పిని కలిగించే అవకాశం ఉంది. కావున, ఆల్కహాల్'ను వాడటానికి బదులుగా, వేడి నీటితో కడగటం వలన నొప్పి తగ్గుతుంది.Image Courtesy : Getty Images

  • 5

    వెళ్ళను ప్రత్యమ్నాయంగా ఎంచుకోండి

    రక్తంలోని గ్లూకోస్ స్థాయిలను నిర్వహించుటకు రోజు వేరు వేరు వెళ్ళను ఎంచుకోండి. ఒక పద్దతి ప్రకారం, రోజుకు ఒక వేలును ఎంచుకోవటం వలన రెండు సార్లు ఒకే వేలును గాయపరిచే అవకాశం ఉండదు. గాయపరచిన వేలు, తిరిగి గాయం తగ్గే వరకు ఆ వేలును పరీక్షకు ఉపయోగించకండి.Image Courtesy : Getty Images

  • 6

    పరికరాలను తిరిగి వాడకండి

    రక్తంలోని గ్లూకోస్ స్థాయిలను నిర్వహించుటకు, ఇంట్లో నిర్వహించే పరికరాలను ఒకే సారి వాడండి. ఒకసారి వాడగానే వాటిని భయట పడేయండి. ఒకసారి వాడిన పరికరాలను, తిరిగి వాడటం వలన నొప్పి ఎక్కువ కలగటమే కాకుండా, ఇన్ఫెక్షన్'లకు కూడా దారి తీయవచ్చు.  Image Courtesy : Getty Images

  • 7

    వెళ్ళ నుండి రక్తాన్ని పిండకండి

    పరీక్ష జరపటానికి సరిపోయేంత రక్తం పొందని ఎడల, వేలును పిండటం లేదా నలపటం సాధారణమే. ఇలా చేయటానికి బదులుగా, నడుము కింద వరకు మీ తలను వేలాడ దీయండి. లేదా వేలు యొక్క చివర పిండుతూ, పై వరకు కొనసాగించటం వలన రక్తం ఎక్కువగా వస్తుంది మరియు నొప్పి కూడా తక్కువగా ఉంటుంది.Image Courtesy : Getty Images

  • 8

    సరైన పరికరాన్ని ఎంచుకోండి

    రక్తంలోని గ్లూకోస్ స్థాయిలను తెలిపే పరికరాలలో, తక్కువ రక్తం ద్వారా సరైన ఫలితాలను తెలిపే పరికరాలు అందుబాటులో ఉన్నాయి. ఈ పరికరాలను వాడండి. అంతేకాకుండా, వేలు మొనల ద్వారా కాకుండా, భుజాలు లేదా ఇతర శరీర భాగాల ద్వారా రక్తాన్ని సేకరించి, పరీక్ష నిర్వహించే పరికరాలు కూడా అందుబాటులో ఉన్నాయి.Image Courtesy : Getty Images

    Tags:
  • గ్లూకోస్ పరీక్ష నిర్వహణ
  • నొప్పి తగ్గించే రక్త పరీక్ష
  • నొప్పిని తగ్గించే గ్లూకోస్ పరీక్ష
  • Blood Glucose Tests Less Painful in Telugu.
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ