Health Tips in HindiHealth Tips

మెదడు వయసును రుజువు చేసే చిట్కాలు

By:P Raj Kumar, Onlymyhealth Editorial Team,Date:Nov 29, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవడం వలన అది దైనందిన కార్యకలాపాలకు మాత్రమే సహాయం అందించడం కాకుండా, అల్జీమర్స్ వ్యాధి మరియు ఇతర జ్ఞాపకశక్తి సమస్యల ప్రమాదాలను తగ్గిస్తుంది. మెదడు వయస్సు పెరుగుదలతో పోరాడటానికి గల కొన్ని సులభమైన మార్గాలు ఇక్కడ తెలియ చేయడం జరిగింది.
 • 1

  మీ మెదడు యొక్క వయస్సు పై బడుతుందా?

  మీ కారు యొక్క తాళంచెవిలు ఎక్కడ పెట్టారో మర్చిపోతున్నారా? మీ కిరాణాసరుకుల జాబితాలో ఏమి ఉన్నాయో మర్చిపోయారా? వ్యాయామశాలలో మీకు ఇష్టమైన వ్యక్తిగత శిక్షకుడి పేరును మరచిపోయారా? ఈ సమస్యతో బాధపడుతున్నవారు మీరు ఒక్కరు కాదు. ప్రతి ఒక్కరూ అప్పుడప్పుడు కొన్ని విషయాలను మర్చిపోతుంటారు. ఇప్పటికీ, జ్ఞాపకశక్తి కొరవడుతున్న విషయం గురించి తేలికగా తీసుకోకూడదు. జ్ఞాపకశక్తిని కోల్పోవడం లేదా చిత్తవైకల్యం వంటి సమస్యలు నివారించే విషయాలను గురించి ఎటువంటి హామీలను ఇవ్వలేకపోయినప్పటికీ, కొన్ని జ్ఞాపకశక్తి చిట్కాలు తప్పక సహాయపడుతాయి. మీ మెదడు బాగా, వేగంగా, మరియు చురుకుగా ఉండటానికి ఒక ఏడు సాధారణ మార్గాలను పరిగణనలోకి తీసుకోవచ్చు - మరియు జ్ఞాపకశక్తి నష్టానికి ఏ సమయంలో సహాయం అందించాలో తెలుసుకోవాలి.

 • 2

  వ్యాయామం

  మెదడు ఆరోగ్యంగా మరియు యవ్వనంగా ఉంచుటకు నిపుణులు అందించే ఉత్తమ సలహా ఏరోబిక్ వ్యాయామం. ఏరోబిక్స్ మరియు బరువు శిక్షణ మిశ్రిత నియమావళి ఉత్తమమైనది. ఈ రెండు రకాల వ్యాయామాలు చేయడంలో నిమగ్నమైన వారు ఉత్తమ ఫలితాలు పొందవచ్చని అధ్యయనాలలో  నిరూపించడం జరిగింది. మహత్తర మస్తిష్క పరిశోధనలలో ఈ రోజుకు మనం వ్యాయామం చేయడం వలన కొన్ని రకాల మానసిక క్షీణతలను దుస్సాధ్యం చేయవచ్చనే బలమైన నిదర్శనాలను నిరూపించడం జరిగింది. ఇది జ్ఞాపకశక్తిని తిరిగి పునరుద్ధరించగలదు.

 • 3

  తినడం

  మెరుగైన మెదడు పొందుటకు గల మరో మార్గం కడుపు. యాంటీఆక్సిడెంట్స్ క్యాన్సర్ యోధులుగా పని చేస్తాయనే విషయం గురించి మనమందరం వినే ఉంటాం. హానికర ఫ్రీ రాడికల్స్ ను తటస్థీకరించే వివిధ అణువుల మిళితమైన ఆహారాలు తినడం ద్వారా, ప్రత్యేకించి మెదడుకు చాలా సరైనది. ఫ్రీ రాడికల్స్ మెదడులోని న్యూరాన్లను చేధించడం ద్వారా ఏదైనా చేయగలవు. అనేక రంగురంగుల పండ్లలో మరియు కూరగాయలలోనే కాకుండా బీన్స్, తృణధాన్యాలు, గింజలు మరియు మసాలా దినుసులలో కూడా  పుష్కలమైన యాంటీఆక్సిడెంట్స్ నిండి ఉంటాయి. అయితే, పూర్తి పోషణభరిత ఆహారం తీసుకోవడం మరింత ముఖ్యం. మీరు ఆహారం అధికంగా తీసుకుంటే, అప్పుడు బహుశా మీరు కూడా భారీగానే ఉంటారు. అదే బరువు మీ కాళ్ళ పై భారమై అది మీరు చమత్కారమైన ప్రత్యుత్తరం లేదా శీఘ్ర సమస్య పరిష్కారం అందించకుండా మీ మెదడుకు భారంగా ఏర్పడవచ్చు.

 • 4

  వేగం పెంచండి

  సహజంగా మెదడు మందగమనం 30 సంవత్సరాల వయస్సులోనే ప్రారంభవుతుంది. ఇది ఉపయోగానికి సహాయ సాధ్యంకాదని భావించవచ్చు, కానీ ఆధునిక అధ్యయనాలు ఏ వయసు ప్రజల వారైనా వారి మెదడులను వేగంగా, ప్రభావవంతంగా మరియు యువ్వనంగా పనిచేసేలా శిక్షణ అందించవచ్చని నిరూపిస్తున్నాయి. కానీ, సరైన ఉపకరణాలు అందించడం ద్వారా, యువ్వనంలో ఉన్నప్పుడు మన మెదడు ఏ తరహా పని చేసిందో అలా ఉండుటకు కావాల్సిన శిక్షణను మనం మెదడుకు అందించగలం. దీనికోసం అవసరమయిందల్లా అంకితభావమైన అనుసరణ: మనస్సు కోసం గల వ్యాయామాలు.

 • 5

  ప్రశాంతంగా ఉండండి

  ఆగండి! ఊపిరి తీసుకోండి. కాస్త సేద తీరండి. మెదడును సవాలు చేయడమనేది ఎంత ముఖ్యమైన అంశమో, ప్రశాంతత కూడా అంతే ముఖ్యం. బాధాకరమైన ఒత్తిడి మెదడు కణాలకు హానినందించవచ్చు. ఒత్తిడి అభ్యాసన మరియు స్మృతి వంటి అభిజ్ఞాత్మక విధానంకు భంగం కలిగించవచ్చు, మరియు పర్యవసానంగా మానవ జీవన నాణ్యతను పరిమితం చేయవచ్చని, జెంసోక్ కిమ్ ఆఫ్ ది యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ చెపుతుంది. ఉదాహరణకు జ్ఞాపకశక్తి నిర్మాణంలో ప్రధానమైన కేంద్ర బిందువుగా ఉండే హిప్పోకాంపస్ అని పిలువబడే మెదడు యొక్క ఒక భాగం, దీర్ఘకాలిక ఒత్తిడి వంటి కారణాల వలన తీవ్రంగా నిస్త్రాణం చెందవచ్చు. వాస్తవానికి, భౌతిక వ్యాయామాలు యోగ మరియు ధ్యానం వంటి ప్రశాంత కార్యకలాపాలు ఎల్లప్పుడూ ఒక గొప్ప విశ్రాంత ప్రక్రియలుగా పని చేస్తాయి.

 • 6

  విశ్రాంతినివ్వండి

  కలనగణిత సమస్యను రుజువు చేస్తున్నపుడు లేదా మీ కుటుంబం కోసం సరైన కారును ఎంచుకోవలసి వచ్చినపుడు వంటి సంక్లిష్టమైన సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో వాస్తవంగానే "నిద్రించాలన్పిస్తుంది." హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు అనుకూలమైన పరిస్థితులలో ఎంతమంది ప్రజలు సృజనాత్మక పరిష్కారాలను ఆలోచించగలరో పరిశీలించారు. గణిత సమస్యల పరిష్కరణలో పాల్గొనే ఒక అధ్యయనంలో, సమస్యలకు ఒక సృజనాత్మక పరిష్కారం కనుగొనడంలో పాల్గొనే వ్యక్తుల అవకాశాలు ఒక రాత్రి మంచిగా విశ్రాంతి పొందిన మరుసటి రోజు రెట్టింపవుతాయని కనుగొన్నారు. మెదడు నిద్రిస్తున్నపుడు, సిద్దాంతాలను సూత్రీకరించడంలో, క్లిష్టమైన సమాచార సంశ్లేషణలో మిక్కిలి అధిక సామర్ధ్యంను కలిగి ఉంటుంది.

 • 7

  ఆనందాన్ని అందించండి

  హాస్యం మెదడు భాగాలను ఉత్తేజితం చెందించుటకు "మంచి అనుభూతి" అనే రసాయన సమాచార నాడీ సంబంధిత రవాణా ఉపయోగపడుతుంది. చాకొలేట్ తినడం లేదా సెక్స్ ను అనుభవించడం వంటి ఆహ్లాదకర వర్గానికి చెందిన కార్యకలాపాలు మీరు మళ్ళీ మళ్ళీ చేయాలనుకుంటారు. నవ్వులు మెదడుకు ఆహ్లాదంగానే కాకుండా "వ్యసనంగా" కూడా ఉంటుంది. కానీ హాస్యం మనల్ని తెలివిపరులుగా కూడా చేయవచ్చా? జ్యూరీ పరిశోధనలు ఇప్పటికే పూర్తయ్యాయి మరియు మరిన్ని అధ్యయనాలు అవసరమున్నాయి, కానీ ప్రారంభ ఫలితాలు ప్రోత్సాహకరంగానే వున్నాయి.

 • 8

  వయసుతో పాటు తెలివిని పొందండి

  శాస్త్రవేత్తలు జ్ఞానం నాడులకు సమానంగా ఏవిధంగా పనిచేస్తుందో అర్థం చేసుకోవడం ప్రారంభించారు. వృద్ధులు, సమస్యలను చాలా బాగా పరిష్కరించగలరు ఎందుకంటే వారు యువత కంటే ఎక్కువ మానసిక సమాచారాన్నికలిగి ఉంటారు. అందుకే వారు 50 మరియు 60 లలో మహర్షులుగా మారుతారు. మనం ఎల్లపుడూ మన సంస్థ మరియు దేశ ప్రయోజనాల కోసం పరిగెడుతూనే ఉండాలనేది, వారు మనకు అందించే అత్యుత్తమ సలహా.Image source: Getty Images

  Tags:
 • మెదడు పనితీరును పెంచే చిట్కాలు
 • ఆరోగ్యకరమైన మెదడు
 • ఎల్లపుడు యవ్వంగా ఉండే మెదడు
 • Medhadu paniteerunu penche suchanalu
 • Healthy brain in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

 • అన్ని

 • వ్యాసం

 • స్లైడ్ షో

 • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

  వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
 • మెదడు వయసును రుజువు చేసే చిట్కాలు

  మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవడం వలన అది దైనందిన కార్యకలాపాలకు మాత్రమే సహాయం అందించడం కాకుండా, అల్జీమర్స్ వ్యాధి మరియు ఇతర జ్ఞాపకశక్తి సమస్యల ప్రమాదాలను త
 • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

  చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
 • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

  వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
 • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

  చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
 • మెదడు వయసును రుజువు చేసే చిట్కాలు

  మెదడును ఆరోగ్యంగా ఉంచుకోవడం వలన అది దైనందిన కార్యకలాపాలకు మాత్రమే సహాయం అందించడం కాకుండా, అల్జీమర్స్ వ్యాధి మరియు ఇతర జ్ఞాపకశక్తి సమస్యల ప్రమాదాలను త