Health Tips in HindiHealth Tips

గర్భధారణకు ముందు స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలు

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:Aug 01, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

గర్భవతి అవటం స్త్రీ జీవితానికి మరొక జన్మలాంటిది. మీరు త్వరగా గర్భవతి అవాలి అనుకుంటున్నారా? అయితే ఈ సూచనలు పాటించండి.
  • 1

    మందులను చెక్ చేస్తూ ఉండండి

    పిండం అభివృద్ధిని సంరక్షించే మందులు మార్కెట్లో చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి. కానీ, కొన్ని మందులు దీనికి వ్యతిరేఖం. మీరు గర్భవతి అవాలి అనుకుంటున్నారా? అయితే మీరు తీసుకునే మందులను మొదటగా వైద్యుడికి చూపించాలి. ఇలా చేయటం వలన మీరు గర్భవతి అవకుండా చేసే మందులకు దూరంగా ఉంటారు. ఫలితంగా గర్భాన్ని పొందే అవకాశాలు రెట్టింపు అవుతాయి.

  • 2

    ఒత్తిడిని అధిగమించండి

    అధిక స్థాయిలో ఒత్తిడి గర్భం పొందటాన్ని ప్రభావిత పరుస్తుంది. మీరు గర్భాన్ని పొందాలని ప్రణాళిక లేదా గర్భవతి అవాలి అనుకుంటే, ఒత్తిడిని తగ్గించుకొని, ప్రశాంతంగా ఉండాలి. మీ జీవితంలో ఒత్తిడికి గల కారణాలను తెలుసుకొని, వాటిని తగ్గించుకోటానికి ప్రయత్నించాలి. అంతేకాకుండా ఒత్తిడి తగ్గించే యోగ, ధ్యానం వంటి పద్దతులను అనుసరించండి.

  • 3

    వ్యాయామాలు

    వ్యాయామాలు ఒత్తిడిని తగ్గించటమే కాదు, ఇతర ప్రయోజనాలును కూడా చేకూరుస్తాయి. మంచి వ్యాయామాలు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఆరోగ్యంగా ఉండే మహిళ త్వరగా గర్భాన్ని పొందుతుంది. ఇవి శక్తిని అందించటమే కాకుండా, రాత్రి సమయంలో ప్రశాంతమైన నిద్రను మన సొంతం చేస్తాయి.

  • 4

    అనారోగ్యర అలవాట్లకు దూరం

    గర్భం పొందలకునే వారు ఎలా ఉండాలో మీకు ఇది వరకే తెలిసి ఉంటుంది అవునా! ముఖ్యంగా డ్రగ్స్, ఆల్కహాల్ మరియు పొగాకు వంటి వాటికి దూరంగా ఉండాలి. గర్భానికి అనువుగా మీ శరీరం మారాలి కావున అనారోగ్యకర అలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రకం అలవాట్లు మొదటి వారంలో పిండం అభివృద్ధికి చాలా సమస్యలకు గురి చేస్తాయని తెలుసుకోండి. కావున, ఇలాంటి అలవాట్లకు తప్పక దూరంగా ఉండండి.

  • 5

    పోషకాలు

    గర్భ సమయంలో, మీ గర్భాశయంలో పెరిగే శిశువు అన్ని రకాల పోషకాల కోసం మీపై ఆధారపడుతుంది. గర్భం ధరించటానికి ముందే బరువులో సమస్యల గురించి తెలుసుకోండి. అధిక బరువు లేదా బరువు తక్కువగా ఉండటం వంటి వాటి వలన గర్భధారణ, గుండెపై భారం పెరగటం లేదా మేఎ శిశువుకు పోషకాలు అందటంపై లోపాల వంటి సమస్యలు కలగవచ్చు.

    Tags:
  • త్వరగా గర్భాన్ని పొందే మార్గాలు
  • సులభంగా గర్భవతిని చేసే మార్గాలు
  • Tvaraga garbhanni ponde margalu
  • Tips to Get Pregnant Fast in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ