Health Tips in HindiHealth Tips

దంతాల ఆరోగ్యంగా ఉండటానికి తీసుకోవలసిన జాగ్రత్తలు

By:P Raj Kumar, Onlymyhealth Editorial Team,Date:Sep 27, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

దంతాల పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం. ఆరోగ్యకర దంతాల వలన మన చిరునవ్వు అందంగా కనపడటమే కాకుండా, నోటి సమస్యలకు దూరంగా మరియు మనలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. దంతాల కోసం తీసుకోవసిన జాగ్రత్తల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    దంతాలను కాపాడుకోండి

    దంతాలు ఆరోగ్యంగా ఉంటే  మీరు కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఆరోగ్యరంగా ఉండే దంతాల వలన నవ్వుతో పాటూ ఇతరులతో కూడా బాగా మాట్లాడగలరు. మన శరీరంలో అన్ని భాగాల గురించి ఎలా జాగ్రత్త తీసుకుంటారో అలానే వీటి గురించి కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేకాకుండా, ఇలా దంతాల పట్ల జాగ్రత్త వహించటం వలన దంతాలు ఊడిపోవటం, చిగుళ్ళులో నిప్పి మరియు ఇతర సమస్యలకు దూరంగా ఉంటారు. Image source:Gettyimages.in

  • 2

    నోటి సంరక్షణ ఉత్పత్తులు ఎంపిక

    మీరు ఎంచుకునే నోటి సంరక్షణ ఉత్పత్తులు కూడా పంటి ఆరోగ్యాన్ని ప్రభావిత పరుస్తాయి. కావిటీ (దంత క్షయం) సమస్యలతో భాదపడే వారు వాడే నోటి సంరక్షణ ఉత్పత్తులతో పోలిస్తే, సున్నితమైన దంతాలు కలిగి ఉండే వారు లేదా చిగుళ్ళ సమస్యలు కలిగి ఉన్న వారు వేరే నోటి సంరక్షణ ఉత్పత్తులను వాడాలి. ఏ రకమైన నోటి సంరక్షణ ఉత్పత్తి మీకు సరిపోతుందా అనేది వైద్యుడిని కలిసి ఎంచుకోండి. Image source:Gettyimages.in

  • 3

    కావిటీలను దూరంగా ఉంచే వాటి గురించి తెలుసుకోండి

    తక్కువ కొవ్వు గల పాలు, పెరుగు లేదా చీస్ వంటి కాల్షియం అధికంగా ఉండే ఆహారాలు కావిటీ (దంతక్షయం) నుండి కలగకుండా కాపాడతాయి. చక్కెర లేని చూయింగ్ గమ్ నమలటం వలన లాలాజల ప్రవాహం పెరిగి, దంతాలలో చిక్కుకున్న ఆహర పదార్థాలు తొలగించబడి మరియు ఆసిడ్ కూడా తగ్గుతుంది. తాజా పండ్లు మరియు కూరగాయలు మరియుటీ వంటివి చిగుళ్ళ ఆరోగ్యాన్ని పెంచుతాయి. Image source:Gettyimages.in

  • 4

    చక్కెర ఆహారాలు తిన్న తరువాత పుకిలించి ఉంచండి

    చక్కెర పదార్థాలు ఎక్కువ సమయం దంతాలపై పెరుగుకు పోవటం చాలా ప్రమాదకరం మరియు పంటి పై పొర అయినట్టి ఎనామిల్ కూడా ప్రమాదానికి గురి అవుతుంది. చక్కెర పదార్థాలు తిన్నపుడు, చక్కెర అణువులు వెంటనే తొలగిపోవటానికి వెంటనే నీటితో పుకిలించి ఉంచండి. దీని ఒక అలవాటుగా మార్చుకోవటం వలన నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. Image source:Gettyimages.in

  • 5

    నాలుకను శుభ్రంగా ఉంచుకోండి

    నోటిలో నాలుక చాలా ముఖ్యమైనది మరియు నోటి ఆరోగ్యంగా ఉండటంలో ఇది ముఖ్యపాత్ర పోషిస్తుంది. నాలుక రుచి మరియు శ్వాసకు సహాయపడటమేకాకుండా, దంతాలపై మచ్చలు, పొలుసులు ఏర్పడకుండా చూస్తుంది కావున నాలుకను కూడా శుభ్రంగా ఉంచుకోండి. Image source:Gettyimages.in

    Tags:
  • దంత సంరక్షణ చిట్కాలు
  • నోటి సంరక్షణ చిట్కాలు
  • దంతాల ఆరోగ్యాన్ని మెరుగుపరిచే చిట్కాలు
  • దంతాలు ఆరోగ్యంగా ఉండటానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు
  • Danta samakshana chitkalu
  • Things to Take Care of your Teeth in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు