Health Tips in HindiHealth Tips

మహిళలలో రొమ్ము కేన్సర్ కు గురి చేసే కారణాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Aug 24, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

శరీరంలో కేన్సర్ కణాలు రెట్టింపు అయ్యే ప్రక్రియ చాలా కారణాలపై ఆధారపడి ఉంటుంది. కానీ, స్త్రీలలో రొమ్ము కేన్సర్ అధికమయ్యే కారకాల గురించి తప్పక తెలిసి ఉండాలి. వాటి గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    గణాంకాలు ఏమ్ చెప్తున్నాయి?

    ప్రస్తుత కాలంలో ప్రతి 8 మందిలో ఒకరు రొమ్ము కేన్సర్ కు గురవుతున్నారని గణాంకాల చెప్తున్నాయి. మనలో చాలా మందికి వీటి గురించి అవగాహన ఉంది కానీ, ఒక అమ్మాయిలో రొమ్ము కేన్సర్ కలగటానికి గల కారణాలు మరియు మరొక అమ్మాయి కేన్సర్ కు గురవటానికి గల కారణాలు వేరు వేరుగా ఉండటం గమనార్హం. కావున రొమ్ము కేన్సర్ ను కలుగచేసే కారణాల గురించి మీకు ముందే తెలిసి ఉండటం మంచిది.

  • 2

    బరువు

    ఒక మహిళ అధిక బరువు లేదా ఊబకాయం కలిగి ఉంటే, రొమ్ము కేన్సర్ కు గురయ్యే అవకాశం 30 నుండి 60 శాతం ఎక్కువ అవుతుంది. ఎందుకంటే, కొవ్వు కణాలు ఈస్ట్రోజెన్ ను ఉత్పత్తి చేస్తాయి. శరీరంలో కొవ్వు అధికంగా ఉన్నందు వలన ఈస్ట్రోజెన్ అధికంగా ఉత్పత్తి చెందబడి, ట్యూమర్ లేదా కేన్సర్ గడ్డ పెరుగవచ్చు.

  • 3

    ఆల్కహాల్ తాగే అలవాటు

    ఆల్కహాల్ సేకరణ వలన రొమ్ము కేన్సర్ కలిగే అవకాశాలు అధికంగా ఉన్నాయని అనేక అధ్యయనాలలో వెల్లడించబడింది. మహిళలలో మొదటి ఋతుక్రమం మరియు మొదటి గర్భధారణ సమయంలో ఆల్కహాల్ తాగటం వలన రొమ్ము కేన్సర్ కలిగే అవకాశాలు అధికమని ఒక పరిశోధనలలో కనుగొనబడింది.

  • 4

    ఆహార ప్రణాళిక

    రెడ్ మీట్ తినటాన్ని తగ్గించి, పచ్చని ఆకుకురలు మరియు కూరగాయలు తినటం వలన స్త్రీలలో రొమ్ము కేన్సర్ గురవటాన్ని చాలా వరకు తగ్గిస్తుందని పరిశోధనలలో వెల్లడించబడింది.

  • 5

    జన్యుపరమైన అంశాలు

    BRCA1 లేదా BRCA2 జన్యువులు ఉత్పరివర్తనం చెందిన స్త్రీలలో రొమ్ము కేన్సర్ కు గురయ్యే అవకాశం అధికంగా ఉంటుంది. ఈ జన్యువులు ఉత్పరివర్తనం చెందని స్త్రీలలో కేన్సర్ కలిగే అవకాశాలు తక్కువే.

  • 6

    వాతావరణ విషపదార్థాలు

    ఎండోక్రైన్ డిస్రప్టర్ల వంటి ప్రత్యేక విష పదార్థాలకు బహిర్గతం అవటం వలన రొమ్ము కేన్సర్ కలిగే అవకాశం ఉంది. ఈ సేంద్రీయ రసాయనాలు కొవ్వు కణాలలో పేరుకుపోయి ఈస్ట్రోజెన్ వలే నటించి కేన్సర్ ట్యూమర్ అభివృద్ధికి సహాయపడతాయి. Image source:Gettyimages.in

    Tags:
  • రొమ్ము కేన్సర్ కలగటానికి గల కారణాలు
  • బ్రెస్ట్ కేన్సర్ కు గల కారణాలు
  • కేన్సర్ కలగటానికి గల కారణాలు
  • Rommu cancer kalagataniki gala karanalu
  • Factors that cause breast cancer in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • రొమ్ము క్యాన్సర్ పట్ల ఉన్న అపోహలు

    క్యాన్సర్ రకాలలో, ఆడవారిలో ఎక్కువగా కలిగే రకం రొమ్ము క్యాన్సర్. ఈ రకం క్యాన్సర్ పైన ప్రజలలో చాలా రకాల అపోహలు ఉన్నాయి, ఈ రకమైన క్యాన్సర్ పైన ఉన్న అపోహల
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • రొమ్ము క్యాన్సర్ పట్ల ఉన్న అపోహలు

    క్యాన్సర్ రకాలలో, ఆడవారిలో ఎక్కువగా కలిగే రకం రొమ్ము క్యాన్సర్. ఈ రకం క్యాన్సర్ పైన ప్రజలలో చాలా రకాల అపోహలు ఉన్నాయి, ఈ రకమైన క్యాన్సర్ పైన ఉన్న అపోహల