Health Tips in HindiHealth Tips

మీ చర్మాన్ని జిడ్డుగా మార్చే 7 రకాల అలవాట్లు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:May 30, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

చిటికి మాటికి మీ చర్మంపై నూనెలు ఎక్కువగా ఉత్పత్తి చెంది, జిడ్డుగా కనపడుతుందా! కొన్ని రకాల చెడు అలవాట్ల వలన ఇలా కలగవచ్చు, చర్మం జిడ్డుగా మారటానికి గల అలవాట్ల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    జిడ్డు చర్మం

    జిడ్డుగా ఉండే చర్మం అత్యంత భయంకరమైన రకం మరియు దీని వలన కలిగే సమస్యలు సాధారణంగా ఉండవు. పొగతాగటం లేదా ఆల్కహాల్ సేకరణ వంటి చెడు అలవాట్ల వలన చర్మం జిడ్డుగా మారుతుంది. ఈ అలవాట్లకు దూరంగా ఉండటం వలన మంచి ఫలితాలను పొందవచ్చు. మీ చర్మం జిడ్డుగా మారటానికి గల అలవాట్లు మరియు కారణాల గురించి ఇక్కడ తెలుపబడింది. Image Source : Getty Images

  • 2

    తప్పుడు చర్మ రక్షణ ఉపకరణాల వాడకం

    అవును, మీరు వాడే చర్మ ఉత్పత్తులు మరియు వేసుకున్న మేకప్ లను తొలగించటానికి వాడే వాటిపై ప్రత్యేక జాగ్రత్త తప్పని సరి. వేసిన మేకప్ లేదా ముఖం కడుకున్న తరువాత తుడవటానికి మనం పొడి టవల్ ను వాడతాము. వీటి వలన చర్మ కణాలపై ఒత్తిడి ఏర్పడి మరియు వాడే ఉత్పత్తులు సీబం కణాలపై ఒత్తిడి ఏర్పరచి, అధిక మొత్తంలో నూనెలు విడుదల అవటానికి కారణం అవుతాయి.   Image Source : Getty Images

  • 3

    అధిక మొత్తంలో చర్మ సంరక్షణ ఉత్పత్తుల వాడకం

    కొంత మంది యవ్వనంగా, మెరుగైన చర్మాన్ని పొందుటకు, అధికంగా చర్మ ఉత్పత్తులను వాడి, ముఖంపై గట్టిగా రాయటం లేదా ఒత్తిడితో అప్లై చేయటం వలన ప్రతికూల ప్రభావాలకు లోనవుతాయి. కావున చర్మానికి వాడే ఉత్పత్తుల లేబుల్ లపై ఉండే సూచనల ద్వారా వాటిని అనుసరించండి. Image Source : Getty Images

  • 4

    కాస్మెటిక్ ఉత్పత్తులతో పడుకోవటం

    నూనె అధికంగా ఉత్పత్తి, మచ్చలను మరియు మొటిమలను దాచటంలో మేకప్ లు చాలా ఉపయోగపడతాయి. కానీ, ముఖానికి వాడే ప్రతి ఉత్పత్తిని అవసరమైన సమయం పాటూ మాత్రమే ఉంచి తరువాత తొలగించటం చాలా ముఖ్యం. ఇలా మేకప్ లు ఎక్కువ సమయం చర్మంపై ఉండటం వలన, చర్మ రంధ్రాలలో చేరి అధికంగా నూనెలను ఉత్పత్తి చేస్తాయి. కావున మీరు చర్మానికి వాడే ఉత్పత్తులను కొనే సమయంలో నూనెలు లేని మరియు కామిడోజేనిక్ రహిత ఉత్పత్తులను ఖరీదు చేయండి. మేకప్ లను వాడిన తరువాత పడుకునే ముందు మీ చర్మాన్ని శుభ్రంగా కడిగిన తరువాత పడుకోండి.  Image Source : Getty Images

  • 5

    మితిమీరిన ఒత్తిడి

    ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య ఇదే. దీని వల్లనే అధిక మొత్తంలో నూనెలు ఉత్పత్తు అవుతున్నాయి. మితిమీరిన స్థాయిలో ఒత్తిడికి గురవటం వలన చర్మం నుండి అధిక మొత్తంలో నూనెలు ఉత్పత్తి చెందుతున్నాయి. కావున అనవసర విషయాల గురించి లేదా చిన్న చిన్న విషయాలకు భయపడి ఒత్తిడిని ఎక్కువ చేసుకోకండి. ఇది ఆరోగ్యానికి మరియు చర్మానికి కూడా మంచిది కాదనే చెప్పాలి.    Image Source : Getty Images

  • 6

    అనారోగ్యకర ఆహారపు అలవాట్లు

    అనారోగ్యకర ఆహారాల గురించి తెలిసినా, చాలా మంది వాటిని తినకుండా ఉండలేరు. కొంతమందిలో హైగ్లైసిమిక్ ఆహారాలను ఎక్కువగా తీసుకోవటం వలన సీబం అధికంగా చైతన్యానికి గురై, అధిక మొత్తంలో నూనెలను ఉత్పత్తి చేస్తుంది. కావున, చర్మానికి హాని కలిగించే ఈ రకమైన ఆహారాలకు దూరంగా ఉండండి ముఖ్యంగా జంక్ ఫుడ్ కు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. Image Source : Getty Images

  • 7

    సూర్యకాంతి నుండి సంరక్షణ

    తగిన రక్షణలు లేకుండా వేసవిలో భయటకి వెళ్ళకండి. సూర్యకాంతి వలన చర్మ కణాలు చాలా ప్రమాదానికి గురవుతాయి. ముఖ్యంగా తాత్కలికంగా పొడిగా మారిపోతాయి. దీని వలన చర్మం ప్రమాదానికి గురవటమే కాకుండా, చర్మ రక్షణ కోసం గానూ సీబం నుండి అధిక మొత్తంలో నూనెలు ఉత్పత్తి చెందించబడతాయి.Image Source : Getty Images

  • 8

    సరికాని చర్మ సంరక్షణ ఉత్పత్తుల వాడకం

    చాలా మంది వారికి తెలియకుండానే తప్పుడు చర్మ సంరక్షణ ఉత్పత్తులను వాడతారు. నిజానికి, వారి చర్మం ఏ రకానికి చెందినదో కూడా ఆలోచించరు. ఫలితంగా చర్మం చాలా రకాలుగా ప్రమాదానికి గురివుతుంది. ఒకవేళ మీ చర్మం నుండి ఎక్కువగా నూనెలు ఉత్పత్తి అవుతున్నపుడు, మీరు నూనె ఆధారిత చర్మ సంరక్షణ ఉత్పత్తులను వాడటం వలన మరింత అధిక స్థాయిలో నూనెలు ఉత్పత్తి చెంది చర్మం మరింత జిడ్డుగా మారే అవకాశం ఉంది. కావున మీ చర్మ రకానికి అనుగుణంగా మాత్రమే ఉత్పత్తులను వాడండి.Image Source : Getty Images

    Tags:
  • జిడ్డు చర్మానికి గల కారణాలు
  • చర్మం నుండి నూనెలను ఉత్పత్తి చేసే కారణాలు
  • charmam jidduga maratanaiki karanalu
  • causes of oily skin in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

Comments

  • PRABHAKAR11 Jun 2015
    Suggest me hair loss control tips

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ముఖ ఛాయను మెరుగుపరిచే మూలికలు

    ప్రతి ఒక్కరు అందంగా కనపడటాని, వీలైనంతగా ప్రయత్నిస్తుంటారు. అంతేకాకుండా, ముఖ ఛాయను మెరుగుపరచుకోటానికి మార్కెట్ వచ్చే అన్ని రకాల నూతన క్రీములను వాడుతుంట
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • ముఖ ఛాయను మెరుగుపరిచే మూలికలు

    ప్రతి ఒక్కరు అందంగా కనపడటాని, వీలైనంతగా ప్రయత్నిస్తుంటారు. అంతేకాకుండా, ముఖ ఛాయను మెరుగుపరచుకోటానికి మార్కెట్ వచ్చే అన్ని రకాల నూతన క్రీములను వాడుతుంట