Health Tips in HindiHealth Tips

మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఉత్తమమైన గింజలు మరియు విత్తనాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Jul 14, 2014

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

మధుమేహ వ్యాధి గ్రస్తులు వివిధ రకాల ఆహార పదార్థాలను తినటానికి చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు, కానీ ఇక్కడ తెలిపిన గింజలు మరియు విత్తనాలు మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఆరోగ్యాన్ని చేకూర్చటమే కాకుండా, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి.
  • 1

    గింజలి మరియు విత్తనాలు: మధుమేహ వ్యాధి గ్రస్తులకు మంచి ఆహరం

    విత్తనాలు మరియు గింజలు మధుమేహ వ్యాధిని తగ్గిస్తాయి! నిజం, గింజలు మరియు విత్తనాల వలన అన్ని రకాల వ్యాధులను తగ్గుతాయి. మధుమేహ వ్యాధి గ్రస్తుల శరీరంలో గ్లూకోస్ స్థాయిలను సులువుగా తగ్గించే 5 రకాల గింజలు, విత్తనాలు ఇక్కడ పేర్కొనబడ్డాయి.Image Courtesy:Getty Images

  • 2

    బాదం గింజలు

    బాదంలు అధిక మొత్తంలో ప్రోటీన్'లు, విటమిన్ మరియు మినరల్'లను కలిగి ఉంటాయి; ఆరోగ్యాన్ని ఏలా పెంపొందిస్తాయి అనే దానిపై 'అమెరికన్ యూనివర్సిటీ అఫ్ మెడిసిన్' వారు జరిపిన పరిశోధనల ప్రకారం, రోజు ఒక జత బాదం విత్తనాలను తినటం వలన మధుమేహ వ్యాధి గ్రస్తులలో కొవ్వు స్థాయిలను తగ్గించి, ఇన్సులిన్ హార్మోన్'ను ఉత్తేజ పరుస్థాయి మరియు రక్తంలోని చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతాయి అని తెలిపారు. Image Courtesy:Getty Images

  • 3

    బట్టర్ నట్స్

    వీటినే వైట్ నట్స్ అని కూడా అంటారు. ఇవి మోనోసాచురేతేడ్ ఫాటీ ఆసిడ్'లను మరియు ఒమేగా-3 ఫాటీ ఆసిడ్'లను కలిగి ఉండి, టైప్-2 డయాబెటిస్ వలన వచ్చే క్లిష్ట సమస్యలను తగ్గిస్తాయి. అంతేకాకుండా, ఈ గింజలను రోజు తినటం వలన చర్మం కాంతివంతంగా అవటమే కాకుండా, కంటి చూపును కూడా మెరుగుపడుతుంది.Image Courtesy:Getty Images

  • 4

    ఆక్రోటుకాయ లేదా వాల్నట్స్

    ఆక్రోటుకాయలు ఎక్కువ స్థాయిలో మోనో మరియు పాలీ అన్ సాచురేటేడ్ ఫాట్'లను కలిగి ఉండి శరీరంలో ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతాయి. నిపుణుల అంచనాల ప్రకారం, ఎవరైతే రోజు ఈ గినజలను తింటారో, వారి శరీరంలోని ఇన్సులిన్ స్థాయిలు ఆరోగ్యకరంగా మరియు సాధారణ స్థితిలో నిర్వహించబడతాయి.  Image Courtesy:Getty Images

  • 5

    పిస్తా

    శరీర రక్తంలోని చక్కర స్థాయిలు పెరుగుటకు గల కారణం, శరీరంలో కార్బోహైడ్రేట్'ల స్థాయిలు పెరగటం వలన అని చెప్పవచ్చు. కానీ రోజు పిస్తాలను తినటం వలన శరీరంలో పెరిగే కార్బోహైడ్రేట్'ల స్థాయిలు సాధారణ స్థితిలో లేదా వాటి పెరుగుదలను ఇవి తగ్గిస్తాయి. Image Courtesy:Getty Images

  • 6

    జీడిపప్పు

    ఇతర గింజలతో పోలిస్తే, జీడిపప్పులో తక్కువ స్థాయిలో కొవ్వు పదార్థాలు ఉంటాయి. జీడిపప్పులో, గుండెను ఆరోగ్యవంతంగా ఉంచే మోనో-సాచురేటేడ్ ఫాట్ లేదా 'ఒలేయిక్ ఆసిడ్'లను 75 శాతం వరకు కలిగి ఉంటాయి. జీడిపప్పులో ఉండే ఫాట్'లు, ఆలివ్ ఆయిల్'లో ఉండే ఫాట్'లు ఒకేరకం అని చెప్పవచ్చు. మోనోసాచురేటేడ్ ఫాట్'లు శరీరంలో ట్రై-గ్లిసరైడ్ లేదా రక్తంలో ఉండే ఫాట్'లను తగ్గించి, మధుమేహ వ్యాధి గ్రస్తులలో వచ్చే సమస్యలను తగ్గిస్తాయి అని చెప్పవచ్చు.Image Courtesy:Getty Images

  • 7

    గుమ్మడి విత్తనాలు

    గుమ్మడి వలన మధుమేహ వ్యాధి గ్రస్తులకు వివిధ రకాలుగా ఉపయోగపడుతున్నాయి, వీటి విత్తనాల వలన కూడా ఆరోగ్యానికి చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి, గుమ్మడి విత్తనాలు విటమిన్ 'C', 'E' ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, జింక్, ప్రోటీన్ మరియు ఫైబర్ వంటి చాలా రకాల మూలకాలను అందిస్తుంది. గుమ్మడి విత్తనాలు మధుమేహ వ్యాధి అభివృద్ధి, వాటి వలన కలిగే సమస్యలు, ఇన్సులిన్ ఉత్పత్తి మరియు ఒత్తిడిని తగ్గించటంలో ఈ విత్తనాలు సహాయం చేస్తాయి.Image Courtesy:Getty Images

  • 8

    అవిసె విత్తనాలు

    అవిసె విత్తనాలు చాలా రకాలుగా ఆరోగ్యానికి మేలుచేస్తాయని ప్రకటించబడింది, ముఖ్యంగా మధుమేహ వ్యాధి గ్రస్తులలో అవిసె విత్తనాలు లేదా ఫ్లాక్స్ సీడ్స్ రక్తంలోని చక్కర స్థాయిలను తగ్గించటమే కాకుండా, మధుమేహ వ్యాధి వలన కలిగే సమస్యలను తగ్గిస్తాయి, అవిసె విత్తనాలు వాటి పేరుకు తగినట్టుగా ఫైబర్'లను కలిగి ఉంటాయి. కావున వీటిని చక్కర లేని విత్తనాలుగా పేర్కొంటారు. Image Courtesy:Getty Images

  • 9

    నేరేడు విత్తనాలు

    మధుమేహ వ్యాధి గ్రస్తులకు నేరేడు పండ్లు అద్బుతమైన ఆహరం అని అందరికి తెలిసిందే, అంతేకాకుండా, వీటి విత్తనాలు కూడా ఆరోగ్యానికి ఉపయోగాన్ని కలిగిస్తాయి. ఎండబెట్టిన వీటి విత్తనాలను, దంచి, పోడిలా చేసి రోజు వాడటం వలన శరీర రక్తంలోని చక్కరలను సాధారణ స్థితిలో ఉంచబడతాయి. ఈ విత్తనాలు ఔషద గుణాలను కలిగి ఉన్న 'జామ్బిలిన్' అనే పదార్థాన్ని కలిగి ఉంటుంది, ఇది శరీర రక్తంలోని చక్కెరలను స్థిరంగా ఉంచుతుంది. Image Courtesy:Getty Images

  • 10

    మెంతి విత్తనాలు

    మధుమేహ వ్యాధి గ్రస్తులు వారి పరిస్థితిని సాధారణ స్థితిలో ఉంచుకోటానికి ఈ విత్తనాలు సహాయపడతాయి. మెంతి విత్తనాలు ఫోలిక్ ఆసిడ్, సోడియం, జింక్, మెగ్నీషియం, కాపర్, థయామిన్, నియాసిన్, కేరోటీన్ వంటి మూలకాలను కలిగి ఉండి, మధుమేహ వ్యాధి మరియు కొవ్వు స్థాయిలను తగ్గిస్తాయి. రోజు ఒక చెంచా మెంతి విత్తనాల పొడిని నీటిలో కలుపుకొని తాగటం వలన ఆరోగ్యం పెంపొందించబడుతుంది.Image Courtesy:Getty Images

  • 11

    నువ్వు విత్తనాలు

    నువ్వు విత్తనాలు యాంటీ ఆక్సిడెంట్'లు, పాలీ మరియు మోనో అన్ సాచురేటేడ్ ఫాట్'లను పుష్కలంగా కలిగి ఉంటాయి. రోజు మీరు తినే ఆహరంలో నువ్వు విత్తనాలను కలుపుకోవటం వలన అధిక రక్త పీడనం, రక్తంలో గ్లూకోస్, చక్కర స్థాయిలను నియంత్రణలో ఉంచటమే కాకుండా, క్యాన్సర్ వ్యాధిని కూడా నివారిస్తుంది. Image Courtesy:Getty Images

    Tags:
  • మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఆహరం
  • డయాబెటిస్ తగ్గిచే ఆహరం
  • డయాబెటిస్ ఉన్న వారి కోసం విత్తనాలు
  • మధుమేహ వ్యాధి గ్రస్తుల కోసం
  • గింజలు
  • Nuts and seeds for Diabetes in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • మధుమేహ స్థాయిలను గాయపరిచే ఆహారాలు

    సాధారణంగా మధుమేహం ఆహార విషయంలో చాలా రకాల ఇబ్బందులను గురి చేస్తూ ఉంటుంది, ఇక్కడ తెలిపిన ఆహరాలకు దూరంగా ఉండటం వలన మధుమేహ స్థాయిలను నిర్ణీత స్థాయిలో ఉంచు
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • మధుమేహ స్థాయిలను గాయపరిచే ఆహారాలు

    సాధారణంగా మధుమేహం ఆహార విషయంలో చాలా రకాల ఇబ్బందులను గురి చేస్తూ ఉంటుంది, ఇక్కడ తెలిపిన ఆహరాలకు దూరంగా ఉండటం వలన మధుమేహ స్థాయిలను నిర్ణీత స్థాయిలో ఉంచు