Health Tips in HindiHealth Tips

గర్భ నిర్దారణను తెలిపే పది లక్షణాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Oct 21, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

కొంత మందిలో గర్భం పొందినపుడు బహిర్గతం అయ్యే లక్షణాల గురించి అవగాహన కలిగి ఉండరు, అలాంటి వారి కోసం గర్భం ధరించిన తరువాత బహిర్గతం అయ్యే లక్షణాలా గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    రుతుక్రమంలో అవకతవకలు

    గర్భ నిర్దారణను తెలిపే ముఖ్యమైన లక్షణం రుతుక్రమం సమయానికి రాకపోవటం. గర్భ నిర్దారణ లక్షణాలలో ఇది చాలా సులువైన మరియ చాలా ఆవశ్యకత కలిగిన లక్షణంగా చెప్పవచ్చు. రుతుక్రమంలో తప్పుదల లేదా రాకపోవటం అనేది గర్భ నిర్దారణకు సరైన సూచనగా చెప్పవచ్చు.

  • 2

    ఉదయపు అనారోగ్యం

    సాధారణంగా ఉదయపు అనారోగ్యం కొన్ని వారల తరువాత కలుగుతుంది, ఇది కొంత మందిలో కలుగవచ్చు, మరికొంత మందిలో కలుగకపోవచ్చు. కానీ మొదటి రోజుల్లో, గర్భాన్ని పొందినట్లయితే వికారాలు కలుగుతాయి. ఉదయపు అనారోగ్యం ఏ సమయంలో అయిన కలుగవచ్చు. రాత్రి లేదా పగలు లేదా సాయంత్రం ఇలా రోజులో ఏదొక సమయంలో కలుగవచ్చు.

  • 3

    ఆహరం పైన కోరికలు అయిష్టతలు

    గర్భం ధరించిన తరువాత ఉదయపు అనారోగ్యంతో పాటు, ఆహరం పైన కోరికలు అయిష్టతలు కలుగుతాయి. ఇది కూడా ఒక లక్షణంగా చెప్పవచ్చు. అంతేకాకుండా ఎక్కువగా పుల్లటి ఆహరాలను తినాలని కోరికలు కలుగుతుంటాయి. ఒకవేళ ఇలాంటి ఆహరం తిన్న తరువాత మీ పొట్టలో ఒకరకమైన వాసన మరియు బేకులను గమనిస్తారు.

  • 4

    తరచుగా మూత్రం

    కొన్ని వారాల తరువాత శరీరంలో 'గోనడో ట్రాపిన్' అనే హార్మోన్ ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. ఈ సమయంలో, మీరు తరచుగా మూత్ర విసర్జన కోసం మూత్రశాలకు వెళుతుంటారు.

  • 5

    తలనొప్పి మరియు వెన్ను నొప్పులు

    ఒకవేళ మీరు తలనొప్పి మరియు వెన్నునొప్పులతో భాదపడుతున్నట్లయితే, ఈ నొప్పి తీవ్రతలు తీవ్రంగా లేదా తక్కువగా లేదా సాధారనంగా ఉన్నను మీరు గర్భిని అని నిర్దారణ చేసుకోవచ్చు. ఇది కూడా గర్భిణి అని తెలుపుటకు ఒక లక్షణం అని చెప్పవచ్చు.

  • 6

    ఉబ్బిన పొట్ట

    పొట్ట ఉబ్బినట్టుగా కనిపించిన గర్భం ధరించిన ఒక లక్షణంగా చెప్పవచ్చు. కారణం గర్భాశయంలో శిశువు పెరుగుదల ప్రారంభం అవటం వలన పొట్ట కూడా పెరుగుతుంటుంది. ఇది కూడా గర్భ నిర్దారణలో ఒక లక్షణంగా చెప్పవచ్చు.

  • 7

    అలసట

    రాత్రి సమయాల్లో మీ కళ్ళు తెరవటానికి ఇబ్బందిగా భావించటం కూడా గర్భం పొందారని తెలుపుటకు ఒక లక్షణం అని చెప్పవచ్చు. కొంత మందిలో అలసట త్వరగా కలుగుతుంది. గుడ్డు ఫలదీకరణం చెందిన వారం తరువాత ఈ రకమైన అలసటలు కలుగుతాయి. శరీరంలో ప్రోజేస్టిరాన్ అనే హార్మోన్ విడుదల అవటం వలన అలసటలు కలుగుతాయి.

  • 8

    వాసనల పైన సున్నితత్వం పెరగటం

    మీరు కొత్తగా గర్భాన్ని ధరిస్తే, మీరు అసాధారణ వాసనలు గమనిస్తారు. ఇది చాలా సాధారణం అని చెప్పవచ్చు ఇది కూడా ఒక లక్షణం, మీ శరీరంలో విడుదల అయ్యే ఈస్ట్రోజేన్ హార్మోన్ యొక్క దుష్ప్రభావంగా చెప్పవచ్చు. అంతేకాకుండా మీకు ఇష్టమైన లేదా కొన్ని రకాల ఆహార పదార్థాలను చూడగానే అసహనంగా ఫీల్ అవుతుంటారు.

  • 9

    శరీరంలో రక్త స్రావం

    కొంత మంది ఆడవారిలో రుతుక్రమం తప్పిన తరువాత 11 నుండి 12 రోజుల మధ్యలో చిన్న మొత్తంలో రక్త స్రావం జరుగుతుంది. ఫలదీకరణ చెందిన గుడ్డు యోని గోడల పైన బోరియలు ఏర్పరచటం వలన ఈ స్రావాలు జరుగుతాయి.

  • 10

    ఇంట్లో జరిపే గర్భ నిర్దారణ పరీక్ష

    మీరు మంచి వార్తా వినాలి అనుకుంటే, ఇంట్లో జరిపే గర్భ నిర్దారణ పరీక్షల వలన మీరు దాదాపు సరి అయిన ఫలితాలను పొందుతారు. ఇది పూర్తిగా ఎలాంటి తప్పులు లేకుండా గర్భ నిర్దారణ ఫలితాన్ని తెలుపుతుంది.

    Tags:
  • గర్భం నిర్దారణ
  • గర్భ నిర్గారణ లక్షణాలు
  • గర్భం ధరించిన తరువాత బహిర్గతం అయ్యే లక్షణాలు
  • Pregnancy Signs in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • గర్భ నిర్దారణను తెలిపే పది లక్షణాలు

    కొంత మందిలో గర్భం పొందినపుడు బహిర్గతం అయ్యే లక్షణాల గురించి అవగాహన కలిగి ఉండరు, అలాంటి వారి కోసం గర్భం ధరించిన తరువాత బహిర్గతం అయ్యే లక్షణాలా గురించి
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • గర్భ నిర్దారణను తెలిపే పది లక్షణాలు

    కొంత మందిలో గర్భం పొందినపుడు బహిర్గతం అయ్యే లక్షణాల గురించి అవగాహన కలిగి ఉండరు, అలాంటి వారి కోసం గర్భం ధరించిన తరువాత బహిర్గతం అయ్యే లక్షణాలా గురించి