Health Tips in HindiHealth Tips

కిడ్నీ సంబంధిత వ్యాధులు కలిగి ఉన్నారని తెలిపే లక్షణాలు

By:P Raj Kumar, Onlymyhealth Editorial Team,Date:Jan 04, 2017

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

కిడ్నీ సంబంధిత వ్యాధులు కలిగి ఉన్నపుడు చాలా రకాల సమస్యలు బరిర్గాతమవుతాయి. ఈ లక్షణాలను గమనించకుండా విస్మరించటం వలన సమస్య మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది. అలాంటి లక్షణాల గురించి ఈ లింక్ లో తెలుపబడింది.
 • 1

  సైలెంట్ కిల్లర్

  కిడ్నీ చాలా ముఖ్య అవయవం మరియు శరీరంలో కొన్ని రకాల కీలక విధులను నిర్వహిస్తుంది. శరీరంలో  ఏర్పడే వ్యర్థ పదార్థాలను బయటకి పంపటం, రక్త పీడనాన్ని స్థిరంగా ఉంచటం మరియు నీటిని, అమైనో ఆమ్లాలు, గ్లూకోజ్ వంటి వాటిని తిరిగి శోశించటం వంటి విధులను నిర్వహిస్తుంది. కిడ్నీ సంబంధిత వ్యాధులు కలగగానే కొన్ని రకాల లక్షణాలు బహిర్గతం అవుతుంటాయి. వీటిని విస్మరించటం వలన మనం చాలా రకాల సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. కావున వీటి గురించి తగిన అవగాహన కలిగి ఉండటం ద్వారా లక్షణాలను గమనించిన వెంటనే తగిన చికిత్స పొందవచ్చు.

 • 2

  ఉబ్బిన కాళ్ళు & మడిమల

  మూత్రపిండాలు శరీరంలోని వ్యర్థ పదార్థాలను మరియు అదనపు నీటిని బయటకు పంపుతాయి. ఒకవేళ కిడ్నీలు ఈ పనులను సరిగా చేయని ఎడల కాళ్ళు,పాదాలు, చేతులు, మడిమలు మరియు అపుడపుడు ముఖం కూడా ఉబ్బుతుంది.

 • 3

  అలసట

  మూత్రపిండాలు, ఎర్ర రక్తకణాలు ఆక్సిజన్ తీసుకుపోయేలా చేసే "ఎరేథ్రోపోయిటిన్" అనే హార్మోన్ ను విడుదల చేస్తుంది. మూత్రపిండాలు సమస్యలకు గురైనట్లయితే ఈ హార్మోన్ ఉత్పత్తి కూడా తగ్గుతుంది ఫలితంగా ఎర్ర రక్త కణాలు తక్కువగా ఆక్సిజన్ ను తీసుకోవటం తగ్గుతుంది. దీని వలన అనీమియా అంటారు. ఇలా కణాలకు రక్త సరఫరా తగ్గటం వలన అలసట మరియు నీరసం వంటివి కలుగుతాయి. ఈ లక్షణాలను గమనించిన వెంటనే వైద్యుడిని కలవండి.

 • 4

  మూత్రంలో రక్తం

  మూత్రంలో రక్తం గమనించారా? అయితే ఆందోళనకు గురయ్యే విషంగా దీనిని తప్పక చెప్పుకోవాలి. రక్తంలో ప్రోటీన్ స్థాయిలు పెరగటం అనేది కేవలం యూరిన్ టెస్ట్ ద్వారా మాత్రమే తెలుసుకోవచ్చు. కొన్ని సార్లు ఇతర కారణాల వలన కూడా మూత్రంలో రక్తం రావచ్చు. ఇలాంటివి గమనించిన వెంటనే వైద్యుడిని కలవటం మరవకండి.

 • 5

  వెన్నుభాగంలో నొప్పి

  కొన్ని సందర్భాలలో కిడ్నీ వ్యాధులు వెన్నుభాగంలో నొప్పిని కలిగిస్తాయి. మూత్రపిండాలలో రాళ్లు ఏర్పడినట్లయితే వెన్నుభాగపు కింది భాగం నుండి గజ్జాల ప్రాంతం వరకు ఈ నొప్పి కలుగుతుంది. ఈ రకం నొప్పి కూడా పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజ్ కి చెందినదే. కిడ్నీ వ్యాధులు వారసత్వరంగా కూడా కలగవచ్చు.

 • 6

  పూర్తి రోజు చలిగా అనిపించటం

  మీరు కిడ్నీ వ్యాధులను కలిగి ఉంటే, వేడిగా ఉండే ప్రదేశాలలో ఉన్నను, అనీమియా కారణంగా చలిగా భావిస్తుంటారు. కిడ్నీ ఇన్ఫెక్షన్ లకు గురవటం వలన జ్వరం కలిగి ఎక్కువగా చలికి లోనవుతుంటారు. Image source: Getty Images

  Tags:
 • కిడ్నీ సంబంధిత వ్యాధుల లక్షణాలు
 • కిడ్నీ సమస్యలు కలిగి ఉన్నారని తెలిపే సంకేతాలు
 • Kidney samasyalu kaligi unnarani telipe lakshanalu
 • Symptoms of Kidney disease that You Should not Ignore in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

 • అన్ని

 • వ్యాసం

 • స్లైడ్ షో

 • కిడ్నీలను సహజంగా శుబ్రపరుచుకొండిలా

  కిడ్నీలు శరీరం లో ఉండే అతి ముఖ్య అవయవాలలో ఒకటి. రక్తం లోని వివిధ మలినాలను తొలగించి రరక్తాన్ని శుబ్రపరచడం వీటి ప్రధాన భాద్యత. ఇవి కూడా నిరంతరం పనిచేస్త
 • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

  వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
 • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

  చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
 • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

  వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
 • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

  చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
 • కిడ్నీలను సహజంగా శుబ్రపరుచుకొండిలా

  కిడ్నీలు శరీరం లో ఉండే అతి ముఖ్య అవయవాలలో ఒకటి. రక్తం లోని వివిధ మలినాలను తొలగించి రరక్తాన్ని శుబ్రపరచడం వీటి ప్రధాన భాద్యత. ఇవి కూడా నిరంతరం పనిచేస్త