Health Tips in HindiHealth Tips

మితిమీరిన మోతాదులో పసుపు తీసుకోవటం వలన కలుగే దుష్ప్రభావాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Jun 22, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

ఎల్లపుడు పసుపును అధిక మొత్తంలో వైద్య గుణాలను కలిగిన ఔషదంగా భావిస్తుంటాము. కానీ, మితిమీరిన స్థాయిలో పసుపును తీసుకోవం వలన ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. నమ్మకం కలగటం లేదా అయితే ఇది చదవండి.
  • 1

    పసుపు దుష్ప్రభావాలు

    ప్రపంచవ్యాప్తంగా పసుపును సుగంధ ద్రవ్యంగా వాడుతున్నాము. ఆహార తయారీలలో వాడే పసుపు రంగు మంచి రుచిని అందించటమే కాకుండా, యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉండే ఈ ఔషదం ఆర్థరైటిస్, బ్రోన్కైటిస్ వ్యాధులను తగ్గించటంతో పాటూ, గాయాలను మానటంలో సహాయపడుతుంది. వీటితో పాటుగా పసుపు వివిధ రకాల వైద్య గుణాలను కలిగి ఉంటుంది. మితిమీరిన మోతాదులో దీనిని తీసుకోవటం వలన వివిధ రకాల దుష్ప్రభావాలు కలుగుతాయని పరిశోధనలలో వెల్లడించారు. వాటి గురించిన వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి.Image courtesy: Getty Images

  • 2

    అలర్జీ

    పసుపును కలిగి ఉండే ఆయింట్మెంట్ మరియు క్రీములో కొంత మందిలో అలర్జీలకు గురి చేస్తాయి. పసుపు వలన అలర్జీ కలగటం వలన మీరు వాంతులు, జీర్ణాశయ సమస్యలు లేదా విరేచనాలు కలిగే అవకాశం ఉంది. Image courtesy: Getty Images

  • 3

    పిత్తాశయంలో సమస్యలు

    తగిన స్థాయిలో పసుపు తీసుకుంటే, పిత్తాశయం విధులను సరిగా నిర్వహించేలా ప్రోత్సహిస్తుంది. కానీ, మితిమీరిన మోతాదులో పసుపు తీసుకోవటం వలన కాలేయ మరియు పిత్తాశయం సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. Image courtesy: Getty Images

  • 4

    జీర్ణాశయ సమస్యలు

    సరైన స్థాయిలో ఆహార తయారీలో పసుపు వాడటం వలన ఎలాంటి జీర్ణాశయ సమస్యలు కలగవు. అధిక మొత్తంలో పసుపును తీసుకుంటే మాత్రం రుమటాయిడ్ ఆర్థరైటిస్ మరియు జీర్ణాశయ సమస్యలను కలుగచేస్తాయి. Image courtesy: Getty Images

  • 5

    స్రావం

    స్రావ లేదా బ్లీడింగ్ సమస్యలు కలిగి ఉన్న వారు మరియు పుట్టుకతో గడ్డకట్టే రుగ్మతలు కలిగి ఉన్న వారు మితిమీరిన పసుపు తీసుకుంటే స్రావ సమస్యలను అధికం చేస్తాయి. Image courtesy: Getty Images

  • 6

    కాలేయ సమస్యలు

    అధిక మొత్తంలో పసుపును తీసుకోవటం వలన జాండిస్ వంటి తీవ్రమైన కాలేయ సమస్యలు కలుగుతాయి. కాలేయ సంబంధిత సమస్యలను కలిగి ఉన్నారా! అయితే పసుపుకు వీలైనంత దూరం ఉండటానికి ప్రయత్నించండి. Image courtesy: Getty Images

  • 7

    మందులతో చర్యలు

    పసుపు, ఆస్ప్రిన్, వార్ఫరిన్ మరియు చాలా రకాల యాంటీ ఇన్ఫ్లమేటరీ మందులతో రసాయనిక చర్యలు జరిపే శక్తిని కలిగి ఉంటుంది. కావున ఈ మందుల వాడకం ఉన్న వారు మితిమీరిన మోతాదులో పసుపును తీసుకోకూడదు. Image courtesy: Getty Images

  • 8

    గర్భ సమస్యలు

    పసుపు గర్భవతులలో, యోని నుండి బ్లీడింగ్ లేదా స్రావలకు కారణమయ్యే అకాల గర్భాశయ కుదింపులు (ప్రీ మెచ్యూర్ యూటేరైన్)ను కలుగచేయవచ్చు. కావున, మీరు గర్భవతులు లేదా గర్భాన్ని ధరించాలి అనుకుంటున్నారా! అయితే ఈ సుగంధ ద్రవ్యానికి వీలైనంత దూరంగా ఉండటానికి ప్రయత్నించండి.Image courtesy: Getty Images

  • 9

    చర్మ బొబ్బులు

    కొంత మందిలో ప్రమాదానికి గురైన చర్మంపై పుసుపును రుద్దటం వలన ఇన్ఫెక్షన్ లకు గురై, చర్మంపై బొబ్బలు ఏర్పడవచ్చు. Image courtesy: Getty Images

  • 10

    పొట్ట సమస్యలు

    మితిమీరిన స్థాయిలో పసుపును తీసుకోవటం వలన కడుపులో కలతలు కలగటమే కాకుండా, పొట్టలో అల్సర్ లను కూడా కలుగచేయవచ్చు. Image courtesy: Getty Images

  • 11

    తెల్ల మరియు ఎర్ర రక్తకణాల ప్రమాదం

    మితిమీరిన స్థాయిలో పసుపును తీసుకోవటం వలన తెల్ల మరియు ఎర్ర రక్త కణాలలో దుష్ప్రభావాలు కలుగచేస్తుందని ఇప్పటికే చాలా రకాల పరిశోధనలలో వెల్లడించారు. Image courtesy: Getty Images

    Tags:
  • పసుపు వలన కలిగే దుష్ప్రభావాలు
  • పసుపు వలన కలిగే నష్టాలు
  • పసుపు లాభాలు
  • Pasupu valana Kalige Dushprabhvalu
  • Side-effects of turmeric in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • నల్ల మిరియాల వలన కలిగే దుష్ప్రభావాలు

    నల్ల మిరియాలు, వివిధ రకాల రుగ్మతలను తగ్గించే ఔషదంగా చెప్పవచ్చు, వీటిని ఆయుర్వేద ఔషదాల తయారీ, విరేచనాలను తగ్గించుటకు వాడతారు. కానీ, వీటిని తగిన స్థాయిల
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • నల్ల మిరియాల వలన కలిగే దుష్ప్రభావాలు

    నల్ల మిరియాలు, వివిధ రకాల రుగ్మతలను తగ్గించే ఔషదంగా చెప్పవచ్చు, వీటిని ఆయుర్వేద ఔషదాల తయారీ, విరేచనాలను తగ్గించుటకు వాడతారు. కానీ, వీటిని తగిన స్థాయిల