Health Tips in HindiHealth Tips

సాబుదాన వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు

By:P Raj Kumar, Onlymyhealth Editorial Team,Date:Aug 30, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

ఉపవాస సమయాల్లో మన రుచి గ్రంధులను సంతృప్తి పరచటమేకాకుండా, శరీరానికి కావలసిన అన్ని రకాల పోషకాలను సాబుదాన అందిస్తుంది అంతేకాకుండా వీటి వలన చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయి, వాటి గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    మాజికల్ స్టార్చ్

    చాలా మంది, ముఖ్యంగా భారతదేశపు కుటుంబాలలో సాబుదాన బియ్యాన్ని ఎల్లపుడు ఇంట్లో ఉంచుకుంటాము. ఉపవాస రోజులలో తినే ఈ రకం పిండి పదార్థాలతో కూడిన బియ్యం "కాస్సావ" యొక్క సారం అని చెప్పవచ్చు. 'సౌత్ అమెరికా' మరియు 'బ్రెజిల్' లో ఇవి ఎక్కువగా అమ్మబడుతున్నాయి. వీటి వలన ఒకటి కాదు రెండు కాదు చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి వాటి గురించి ఇక్కడ తెలుపబడింది.Image source:Gettyimages.in

  • 2

    కండరాల వృద్ది

    మీరు శాఖాహారా? ప్రోటీన్ మూలాదారం గురించి చూస్తున్నారా? అయితే సాబుదాన మీకు మంచి ఆహర పదార్థంగా చెప్పవచ్చు. ఇది అధిక మొత్తంలో ప్రోటీన్ ను కలిగి ఉండి, కండరాల వృద్దిని ప్రోత్సహించి మరియు బలాన్ని అందిస్తుంది. మరోవైపు, వీటిలో ఉండే ప్రోటీన్ లకు నయం చేసే గుణాలతో పాటూ కణాల విధులను మెరుగుపరుస్తాయి.   Image source:Gettyimages.in

  • 3

    ఎముకల ఆరోగ్యం

    సాబుదాన కాల్షియం, ఐరన్, విటమిన్ 'K' కలిగి ఉండటం వలన మీ ఎముకల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, వాటిలో సౌలభ్యతను పెంచుతుంది. రోజు మొత్తం పనిలో కలిగే అలసటతో కూడా పోరాడుతుంది.  Image source:Gettyimages.in

  • 4

    రక్త పీడనం నియంత్రణ

    సాబుదానను తినటం వలన మీ రక్తపీడన స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. వీటిలో ఉండే పొటాషియం స్థాయిలు రక్త ప్రవాహాన్ని మెరుగుపరచి, గుండెపై ఏర్పడే ఒత్తిడిని తగ్గిస్తాయి. Image source:Gettyimages.in

  • 5

    జనన లోపాలతో పోరాటం

    సాబుదాన ఫోలిక్ ఆసిడ్ మరియు సంక్లిష్ట విటమిన్ 'B' లను కలిగి ఉండి, పిండాభివృద్ది సరిగ్గా జరిగేలా చూస్తుంది. దీనిని రోజు తినటం వలన జననలోపాలతో పాటుగా, నాడీ సంబంధ లోపాలను కూడా నియంత్రించవచ్చు. Image source:Gettyimages.in

  • 6

    జీర్ణ సమస్యలు

    సాబుదాన మన జీర్ణవ్యవస్థకు కూడా చాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఇవి మలబద్దకం, అజీర్ణం, పొట్ట ఉబ్బరం మరియు అప్పాన వాయువు వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా శరీరంలోని కొవ్వు పదార్థాల స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. Image source:Gettyimages.in

    Tags:
  • సాబుదాన వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు
  • జీర్ణ సమస్యలను తగ్గించే సాబుదాన
  • కండరాల వృద్ది కోసం సాబుదాన
  • Sabudana valana kalige prayojanalu
  • Health benefits of Tapioca in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ