Health Tips in HindiHealth Tips

పరిమళ సంబంధిత స్టిక్స్ మరియు అగరుబత్తి వలన కలిగే దుష్ప్రభావాలు

By:Thirupathi B, Onlymyhealth Editorial Team,Date:May 21, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

మత విలువలను బట్టి, భారతదేశపు ఇళ్ళల్లో ప్రతి రోజు అగరుబత్తి వెలిగిస్తునే ఉండటం వలన వీటి వలన కలిగే దుష్ప్రభావాలను నిర్లక్ష్యం చేస్తుంటాము. ఇలాంటి సుగంధ ద్రవ్యాల వలన కలిగే దుష్ప్రభావాల గురించి ఇక్కడ తెలుపబడింది.
 • 1

  విస్మరించకండి!

  భారతదేశపు ఇళ్ళల్లో ప్రతి రోజు పరిమళ సంబంధిత స్టిక్స్ మరియు అగరుబత్తి వెలిగించటం మన జీవనశైలిలో ఒక భాగమే. ఇవి చుట్టూ ఉండే ప్రాంతాన్ని సువాసనతో నింపుతుంది. పాలీఆరోమాటిక్ హైడ్రోకార్బన్లు కలిగి ఉండే వీటి వలన ఆస్తమా, క్యాన్సర్ మరియు జలుబు, దగ్గు వంటి ఇతరేతర ఆరోగ్య సమస్యలు కలుగుతాయని చాలా అధ్యయనాలలో వెల్లడైంది.

 • 2

  దగ్గు మరియు తుమ్ములు

  అగరుబత్తి మరియు పరిమళ సంబంధిత స్టిక్స్ వలన కలిగే హానికర ప్రమాదాల గురించి నూతన అధ్యయనాలలో వెల్లడించబడింది. అధ్యయనాల ప్రకారం, వీటి నుండి కార్బన్-డై-ఆక్సైడ్ విడుదలై, ఊపిరితిత్తుల కణాలను వాపులకు గురి చేసి, శ్వాస సమస్యలను కలిగిస్తుందని తెలిపారు.

 • 3

  ఆస్తమా

  అగరుబత్తి మరియు పరిమళ సంబంధిత స్టిక్స్ లను వెలిగించటం వలన సల్ఫర్-డై-ఆక్సైడ్ మరియు కార్బన్ మోనాక్సైడ్ లు విడుదల అవుతాయి. ఇలాంటి వాయువులను పీల్చటం వలన COPD మరియు ఆస్తమా వంటి శ్వాస సంబంధిత సమస్యలు కలుగుతాయి.

 • 4

  చర్మ మరియు కంటి అలర్జీలు

  నిరంతరంగా అగరుబత్తి మరియు పరిమళ సంబంధిత స్టిక్స్ కు బహిర్గతం అవటం వలన ముఖ్యంగా చిన్న పిల్లలు, యువకులలో చర్మ మరియు కంటి సంబంధిత అలర్జీలు కలుగుతున్నాయి. అంతేకాకుండా, సున్నితమైన చర్మం కలిగి ఉండే వారు రోజు ఈ పొగకు బహిర్గతం అవటం వలన చర్మ సంబంధిత అలర్జీలు కలుగుతున్నాయి.

 • 5

  ఊపిరితిత్తుల క్యాన్సర్

  అగరుబత్తి మరియు పరిమళ సంబంధిత స్టిక్స్ నుండి విడుదలయ్యే ప్రాణాంతకర పొగ శ్వాస గొట్టాలలో క్యాన్సర్ ను కలిగిస్తుంది.

 • 6

  గుండె ఆరోగ్యంలో క్షీణత

  దీర్ఘకాలిక సమయం పాటూ, ఈ పొగకు బహిర్గతం అవటం వలన గుండె సంబంధిత రుగ్మతలకు లోనయ్యే అవకాశాలు 10-12 శాతం పెరిగే అవకాశం ఉంది. సుగంధ ద్రవ్య సంబంధిత ప్రాణాంతకరమైన పొగ మరమ్మత్తు చేయలేని విధంగా గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. Image source: Getty Images

  Tags:
 • అగరుబత్తి వలన కలిగే దుష్ప్రభావాలు
 • అగరుబత్తి పొగ వలన కలిగే అనారోగ్యాలు
 • అగరుబత్తి పొగ వలన కలిగే ప్రమాదాలు
 • Aggarbatti Dushprabhvalu
 • Side-effects of Aggarbatti in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

 • అన్ని

 • వ్యాసం

 • స్లైడ్ షో

 • నల్ల మిరియాల వలన కలిగే దుష్ప్రభావాలు

  నల్ల మిరియాలు, వివిధ రకాల రుగ్మతలను తగ్గించే ఔషదంగా చెప్పవచ్చు, వీటిని ఆయుర్వేద ఔషదాల తయారీ, విరేచనాలను తగ్గించుటకు వాడతారు. కానీ, వీటిని తగిన స్థాయిల
 • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

  వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
 • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

  చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
 • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

  వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
 • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

  చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
 • నల్ల మిరియాల వలన కలిగే దుష్ప్రభావాలు

  నల్ల మిరియాలు, వివిధ రకాల రుగ్మతలను తగ్గించే ఔషదంగా చెప్పవచ్చు, వీటిని ఆయుర్వేద ఔషదాల తయారీ, విరేచనాలను తగ్గించుటకు వాడతారు. కానీ, వీటిని తగిన స్థాయిల