Health Tips in HindiHealth Tips

పురుషులలో కన్నా స్త్రీలలో నిద్ర సమస్యలు ఎందుకు అధికం?

By:P Raj Kumar, Onlymyhealth Editorial Team,Date:Jul 23, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

నిద్రలేమి చాలా సాధారణం, కానీ పురుషులలో కన్నా ఈ సమస్య స్త్రీలలో అధికంగా ఉంటుంది. దీనికి గల కారణాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    హార్మోన్లలో మార్పులు

    పురుషులతో పోలిస్తే స్త్రీలలో ప్రొజెస్టెరాన్ మరియు ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలు వేరు వేరుగా ఉంటాయి మరియు నెలసరి సమయంలో వీటి స్థాయిలు మారుతుంటాయి. వైద్యుల ప్రకారం, హార్మోన్ లలో మార్పుల వలన నిద్ర పోవటం కష్టమని తెలుపుతున్నారు.  అంతేకాకుండా, హార్మోన్ల స్థాయిలు నిద్రపోవటంపై కీలక పాత్ర పోషిస్తున్నాయి తెలుపుతున్నారు.

  • 2

    నెలసరి దుష్ప్రభావాలు

    ఈ సమయంలో హార్మోన్ల స్థాయిలలో మార్పులతో పాటూ, చాలా మంది స్త్రీలు నెలసరిలో నిద్రలో లేవటం వంటి దుష్ప్రభావాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెలసరి సమయంలో ఉండే పొట్ట ఉబ్బరంగా ఉండటం, తిమ్మిరులు, రొమ్ము సున్నితత్వం, ఉద్రేకత మరియు మానసిక స్థితులు నిద్రపోనివ్వకుండా చేస్తాయి.

  • 3

    గర్భం

    స్త్రీలలో నిద్ర సమస్యలు కలగటానికి ముఖ్య కారణం గర్భం ఎందుకంటే ఇక్కడ ఈ సమయంలో కలిగే శారీరక అసౌకర్యమని చెప్పవచ్చు. గర్భ సమయంలో స్త్రీ శరీరంలో జరిగే హార్మోన్లలో మార్పులు, ఐరన్ లోపం వలన రాత్రి సమయంలో కాళ్ళు లాగుతాయి. అంతేకాకుండా, గర్భ సమయం చివరి దశలో తరచుగా మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది కావున నిద్రలేమి ఆనేది ఈ సమయంలో ఎక్కువగా ఉంటుంది.

  • 4

    ఉద్రేకత మరియు డిప్రెషన్

    అవును, మీకు సరైన సమయం పాటూ నిద్రలేదంటే దానికి కారణం ఉద్రేకత మరియు డిప్రెషన్ లను చెప్పవచ్చు. వయసుతో సంబంధం లేకుండా పురుషులలో కన్నా స్త్రీలలో ఒత్తిడి సంబంధిత నిద్రలేమి సమస్యలు చాలా ఎక్కువ. కావున, ఉద్రేకత మరియు డిప్రెషన్ లతో సమస్యలతో భాదపడుతుంటే వెంటనే వైద్యుడిని కలవండి.

  • 5

    మెనోపాజ్

    చాలా మంది స్త్రీలు MNC లలో పని చేస్తున్నారు. మెనోపాజ్ సమస్య కలిగి ఉన్న స్త్రీలు అక్కడ ఉండే పని కారణంగా కారణంగా మరింత ఒత్తిడికి గురవుతున్నారు. ఈ ఒత్తిడి మరియు మెనోపాజ్ ల కారణంగా రాత్రి సమయంలో భయంతో కూడిన చెమటలు మరియు హాట్ ఫ్లషేస్ వలన స్త్రీలలో నిద్రలేమి సమస్యలకు గురవుతున్నారు. Image source:Gettyimages.in

    Tags:
  • స్త్రీలలో నిద్ర సమస్యలు
  • స్త్రీలలో నిద్రలేమి కి కారణాలు
  • మహిళలలో ఎదుర్కొనే సమస్యలు
  • Mahilalo nidra samsyalu
  • Reasons for women have more trouble sleeping in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ