Health Tips in HindiHealth Tips

బట్టతల కలుగుటకు గల కారణాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Sep 25, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

బట్టతల కలగటం అనేది వివిధ కారణాలపై ఆధారపడి ఉంటుంది. ఎక్కువ శాతం బట్టతలకు గురిచేసే కారణాల గురించి కింద చర్చించబడింది.
  • 1

    బట్టతల కారకాలు

    బట్టతల కలుగుటకు చాలా కారణాలున్నాయి. ఫ్యాషన్, వయసు మరియు లింగం పై కూడా ఆధారపడి జుట్టు రాలి, బట్టతలకు కారణమవుతాయి. అవును, స్త్రీల కన్నా పురుషులలో త్వరగా వెంట్రుకలు రాలి, బట్టతల కలుగుతుంది. దీనికర్థం స్త్రీలలో బట్టతల కలగదని కాదు. సాధారణంగా బట్టతల కారణాల గురించి ఇక్కడ తెలుపబడింది.

  • 2

    ఆహార లోపాలు

    శరీరంలో ప్రోటీన్ మరియు ఐరన్ లోపాలు జుట్టు పెరుగుదలను ప్రభావితపరచి, జుట్టు రాలటాన్ని అధికం చేస్తాయి. అనోరెక్సియా నెర్వోసా లేదా బులీమియా వంటి ఆహార నియంత్రణ మరియు ఆహార సేకరణ లోపాలు జుట్టు రాలటాన్ని ప్రోత్సహిస్తాయి. కావున ఐరన్- ప్రోటీన్ ఆధారిత ఆహార పదార్థాలను ఎక్కువగా తినండి.

  • 3

    వయసు

    వయసు కూడా జుట్టు రాలటంలో ప్రాధాన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే, వయసు మీరుతున్న కొలది, హార్మోన్లలో మార్పులు మరియు రోగ నిరోధక వ్యవస్థ సామర్థ్యం తగ్గిపోతుంది. కానీ, ప్రారంభం నుండే జుట్టును కాపాడుకుంటూ, తగిన జాగ్రత్తలు తీసుకోవటం వలన జుట్టు రాలటాన్ని తగ్గించుకోవచ్చు. కానీ, కొన్ని సార్లు వెంట్రుకల ఫాలికిల్ చనిపోవటం వలన త్వరగా బట్టతల కలిగే అవకాశం ఉందని గుర్తుంచుకోండి.

  • 4

    హెయిర్ స్టైల్

    పోనిటేల్ లేదా రబ్బరు బ్యాండ్లతో వెంట్రుకలను బిగుతుగా బిగించటం వలన వెంట్రుకలు సులభంగా రాలిపోతాయి. మీ తలపై చర్మం బిగుతుగా ఉండటం వలన, ఫాలికిల్ లకు రక్త ప్రసరణ తగ్గుతుంది. వీటి కన్నా, జుట్టు ఆరోగ్యాన్ని పెంచే హెయిర్ స్టైల్ లను పాటించటం చాలా మంచిది.

  • 5

    జనన నియంత్రణ మాత్రలకు దూరం

    యవ్వనంలో ఉండే స్త్రీలు అధికంగా జనన నియంత్రణ మాత్రలను వాడటం వలన జుట్టు ఎక్కువగా రాలుతుంది. జనన నియంత్రణ మాత్రలను వాడటం వలన స్త్రీ శరీరంలో హార్మోన్లలో మార్పులు జరిగి వెంట్రుకలు రాలిపోతాయి దీనినే "ఆండ్రోజేన్ అలోపిసియా"గా పేర్కొంటారు.

  • 6

    వైద్య పరిస్థితులు

    కొన్ని ప్రత్యేక రకాల మందులు జుట్టు రాలటాన్ని మరియు అకాల బట్టతలకు గురి చేస్తాయి. కీమోథెరపీ చికిత్స వలన జుట్టురాలి, బట్టతల కలుగుతుంది. తలపై చర్మం ఇన్ఫెక్షన్ లకు గురవటం, స్కార్లెట్ ఫీవర్ మరియు థైరాయిడ్ ఫీవర్ వంటి అనారోగ్య పరిస్థితులు కూడా జుట్టు రాలటాన్ని అధికం చేస్తాయి.  Image Courtesy: Getty Images

    Tags:
  • బట్టతలకు కారణాలు
  • వెంట్రుకలు రాలుటకు గల కారణాలు
  • జుట్టు రాలటాన్ని ప్రోత్సహించే అలవాట్లు
  • battathala karanalu
  • reasons for going bald in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • బట్టతల కలుగుటకు గల కారణాలు

    బట్టతల కలగటం అనేది వివిధ కారణాలపై ఆధారపడి ఉంటుంది. ఎక్కువ శాతం బట్టతలకు గురిచేసే కారణాల గురించి కింద చర్చించబడింది.
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • బట్టతల కలుగుటకు గల కారణాలు

    బట్టతల కలగటం అనేది వివిధ కారణాలపై ఆధారపడి ఉంటుంది. ఎక్కువ శాతం బట్టతలకు గురిచేసే కారణాల గురించి కింద చర్చించబడింది.