Health Tips in HindiHealth Tips

నిద్రాభంగానికి గల కారణాలు & శరీర బరువుపై దాని ప్రభావం

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Feb 19, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

రాత్రి సమయంలో నిద్రాభంగం వలన శరీర బరువు పెరిగే అవకాశం ఉంది. నిద్రలోపాల వలన ఆరోగ్యం మాత్రమె కాకుండా శరీర బరువు కూడా ప్రభావానికి గురవుతుంది. నిద్రాభంగానికి కారణాలు మరియు బరువును పెంచుటలో వీటి ప్రభావం గురించి ఇక్కడ తెలుపబడ్డాయి..
  • 1

    నిద్ర, బరువును ఎలా ప్రభావిత పరుస్తుంది?

    మనం రోజు అనుసరించే భౌతిక కార్యాలలో నిద్ర కూడా ఒక ముఖ్య ప్రక్రియే. రోజు, నిద్రాభంగం కలగటం ఒక అలవాటుగా మారటం వలన శరీర బరువు పెరిగే అవకాశం ఉంది. ఇలా నిద్రలో లోపాలు కలగటం వలన శరీర విధులలో అసమతుల్యతలు లేదా సమతౌల్యం కోల్పోయే అవకాశం ఉంది. ఇది నేరుగా శరీర బరువుపై ప్రభావితం చూపిస్తుంది. Image Courtesy : Getty Images

  • 2

    లైట్ వెలిగించి పడుకోవటం

    జీవగడియారం ప్రకారం, వెలుగు మరియు చీకటి అనేవి రెండు నిద్రను నియంత్రించే కారకాలుగా చెప్పవచ్చు. ''అమెరికన్ జర్నల్స్ ఆఫ్ ఎపిడేర్మాలజీ" వారు పరిశోధనలు జరిపి తెలిపిన దాని ప్రకారం, చిన్న లైట్ నిద్రను మాత్రమె కాకుండా, శరీర బరువును కూడా ప్రాభావిత పరుస్తుందని పేర్కొన్నారు. కావున పడుకునే సమయంలో గదిలోని లైట్లను, కిటికీలను మూసివేసి పడుకోండి.Image Courtesy : Getty Images

  • 3

    పడుకోటానికి ముందు సరైన ఆహరం

    రాత్రి ప్రశాంతమైన నిద్ర చాలా కారకాలపై ఆధారపడి ఉంటుంది, ముఖ్యంగా రాత్రి తినే ఆహారం అని చెప్పవచ్చు. సరైన ఆహారాన్ని తీసుకోవటం వలన జీర్ణక్రియ, జీవక్రియలు ఆరోగ్యకర స్థాయిలో జరుగుతాయి. రాత్రి ఆలస్యంగా తినటం లేదా స్నాక్స్ వలన ఈ ప్రక్రియలు ఆటంకాలకు గురవుతాయి. కావున రాత్రి సమయంలో సరైన ఆహారాన్ని తీసుకోండి.Image Courtesy : Getty Images

  • 4

    రాత్రి సమయంలో వ్యాయామాలు

    వ్యాయామాలు మరియు భౌతిక కార్యాలు శరీరాన్ని ఫిట్ గా ఉంచటమే కాకుండా, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కానీ, తీవ్రమైన వ్యాయామాలు (కార్డియో) వంటి వాటిని పడుకోటానికి ముందుగా అనుసరించటం వలన నిద్రను భంగం కలిగిస్తాయి. మీ శరీర ఉష్ణోగ్రత పెరగటం వలన హార్మోన్ ల విడుదల అంతరాయాలు ఏర్పడతాయి. ఫలితంగా, నిద్రాభంగంతో పాటూ శరీర బరువు కూడా పెరుగుతుంది. Image Courtesy : Getty Images

  • 5

    పడుకునే సమయంలో ధరించే దుస్తువులు

    పడుకునే సమయంలో మీరు వేసుకునే దుస్తువులు కూడా శరీర బరువును ప్రభావితం చేస్తాయి, బిగుతుగా ఉండే బట్టలు ఉదాహరణకు అండర్వేర్, బ్రా వంటివి, శరీర ఉష్ణోగ్రతలను పెంచి, 'మెలటోనిన్' హార్మోన్ స్థాయిలను తగ్గిస్తాయి, మెలటోనిన్ హార్మోన్ ప్రశాంతమైన నిద్రను ప్రోత్సహిస్తుంది. ఇలా నిద్రాభంగం అవటం వలన శరీర బరువు పెరుగుతుంది. కావున, బిగుతుగా ఉన్న దుస్తువులు కాకుండా వదులుగా ఉన్న బట్టలను ధరించండి.Image Courtesy : Getty Images

  • 6

    ఎక్కువ సమయం పాటూ మెలకువగా ఉండటం

    మీ పనులను పూర్తీ చేసి పడుకోవటం మంచిదే, కానీ, రోజు ఆలస్యంగా పడుకోవటాన్ని అలవాటుగా చేసుకోవటం వలన శరీర బరువు పెరిగే అవకాశం ఉంది. ఆలస్యంగా పడుకోటానికి రెండు కారణాలు కావచ్చు, అవి- అధికంగా తినటం మరియు సరైన సమయం పాటూ నిద్ర లేకపోవటం. ఈ రెండు కారణాలు శరీర బరువును పెంచుతాయి. 11 గంటలలోపు అన్ని పనులు పూర్తయ్యేలా జాగ్రత్త పడండి.Image Courtesy : Getty Images

  • 7

    మీ గది వేడిగా ఉండటం

    పడుకున్నపుడు శరీరం చల్లబడుతుంది, కొవ్వును కరిగించే హార్మోన్ లు విడుదల అయ్యి చర్మాన్ని మరమ్మత్తులకు గురి చేస్తాయి. గది వేడిగా ఉండటం వలన శరీరం చల్లబడే ప్రక్రియకు భంగం కలగవచ్చు. కావున ఎల్లపుడు మీ గది చల్లగా ఉండేలా చూసుకోండి.Image Courtesy : Getty Images

  • 8

    తగినంత నిద్ర పొందలేకపోవటం

    మీ నిద్రకోసం గానూ, ప్రణాళికను రూపొందించుకోండి, పెద్దవారు 7 నుండి 8 గంటల పాటూ పడుకోవాలి మరియు చిమ్మ పిల్లలు ఈ సమయం కంటే 1 లేదా 2 గంటల పాటూ ఎక్కువగా పడుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. నిద్ర లోపాల వలన, ఆకలిని పెంచే హార్మోన్ (కార్టిసాల్) పెరుగుతుంది మరియు పెరుగుదల హార్మోన్ (సెరొటోనిన్ & లేప్టిన్) స్థాయిలు తగ్గుతాయి. ఫలితంగా, శరీర బరువు పెరుగుతుంది. Image Courtesy : Getty Images  

    Tags:
  • నిద్రాభంగానికి కారణాలు
  • బరువు పెంచే కారకాలు
  • బరువుపై నిద్ర ప్రభావం
  • Relation between sleep and weight Gain in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ