Health Tips in HindiHealth Tips

సమర్థవంతంగా నొప్పిని తగ్గించే ఆహార పదార్థాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Apr 21, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

శరీరంలో ఫ్రీ రాడికల్, గాయాల వలన కలిగే ఇన్ఫ్లమేషన్ లు కలుగుతుంటాయి ఫలితంగా, కణాలు, కణజాలాలు ప్రమాదానికి గురవుతాయి. కానీ, కొన్ని రకాల ఆహార పదార్థాల వలన ఇలాంటి ఇన్ఫ్లమేషన్ లను సమర్థవంతంగా నివారించవచ్చు, వాటి గురించిన వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి.
  • 1

    దాల్చిన చెక్క

    ఇదొక పురాతన కాలానికి చెందిన మరియు ప్రపంచ వ్యాప్తంగా, ప్రతిష్ఠాత్మకమైన సుగంధ ద్రవ్యంగా చెప్పవచ్చు. దాల్చిన చెక్క బ్యాక్టీరియాతో పోరాడటమే కాకుండా, రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గించి, మెదడు సమర్థవంతంగా పనిచేసేలా సహాయపడుతుంది. మీరు సాధారణంగా తినే, యోఘర్ట్, తృణధాన్యాలు లేదా ఓట్మీల్ లో కూడా కలుపుకోవచ్చు.

  • 2

    అల్లం

    అల్లం, యాంటీ-ఇన్ఫ్లమేటరీ కారకాలను కలిగి ఉంటుంది ఈ కారకాలను 'జింజేరాల్స్' గా పేర్కొంటారు. ఇవి కీళ్ళ నొప్పుల నుండి ఉపశమనం కలిగించటం, ఫ్రీ రాడికల్ ల వలన శరీరంలో కలిగే ప్రమాదాలను నియంత్రించటం, పురీషనాళ క్యాన్సర్ పెరుగుదలను నివారించటంతో పాటూగా శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

  • 3

    ఉల్లిపాయ

    గాఢమైన వాసన కలిగి ఉండే ఈ కూరగాయ, సల్ఫర్ మూలకాన్ని కలిగి ఉండి, మీ పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇవి, వివిధ రకాల ఇన్ఫ్లమేషన్ ను కలుగచేసే కారకాలను నియంత్రించటమే కాకుండా, ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి, అంతేకాకుండా, కొవ్వు పదార్థాల నియంత్రణ మరియు క్యాన్సర్ పెరుగుదలను అడ్డుకుంటాయి.

  • 4

    టార్ట్ చెర్రీస్

    ఇవి పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్ లను మరియు శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను కలిగి ఉంటాయి. ఈ చెర్రీలు, కీళ్ళవాపులు మరియు ఆర్థరైటిస్ వలన కలిగే నొప్పులను తగ్గిస్తాయి. అంతేకాకుండా, వ్యాయామాల సమయంలో కలిగే కండరాల నొప్పులను, కీళ్ళనొప్పులను తగ్గించి, కొవ్వు పదార్థాల స్థాయిలను కూడా తగ్గించి వేస్తాయి.

  • 5

    పసుపు

    భారతదేశపు వంటలలో తప్పకవాడే సుగంధద్రవ్యంగా దీనిని పేర్కొనవచ్చు. పసుపులో ఉండే "కుర్సుమిన్" అనే సమ్మేళనం వలన ఈ రంగు వస్తుంది. రసాయనాల వలన కలిగే ఇన్ఫ్లమేషన్ ద్వారా కలిగే నొప్పులను ఈ సమ్మేళనం శక్తివంతంగా తగ్గిస్తుంది. దీని వాడకం ద్వారా లేదా తయారు చేసే వంటలలో వాడటం వలన నొప్పుల నుండి ఉపశమనం పొందవచ్చు.

  • 6

    పైనాపిల్

    ఉష్ణ మండల ప్రాంతంలో ఉండే ఈ పండు, 'బ్రోమిలీన్' అనే ఎంజైమ్ ను కలిగి ఉండటం వలన పసుపు రంగులో ఉంటుంది. ఇది గాయాల వలన కలిగే బెణుకులను మరియు నొప్పులను తగ్గించి వేస్తుంది. అంతేకాకుండా, ఈ ఎంజైమ్ జీర్ణాశయ శక్తిని మెరుగుపరచటమే కాకుండా, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వలన కలిగే నొప్పులను తగ్గించి వేస్తుంది.

  • 7

    క్యారెట్

    ఆరెంజ్ రంగులో ఉండే క్యారెట్ లు, పుష్కలంగా కెరోటినాయిడ్ లు అనే ఫైటోకెమికల్ లను కలిగి ఉంటాయి, ఈ రకమైన ఫైటోకెమికల్ లు, ఫ్రీరాడికల్ ల నుండి కణాలను సంరక్షించి,రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి మరియు ఇన్ఫ్లమేషన్ ల వలన కలిగే ప్రమాదాల నుండి కూడా ఉపశమనం కలిగిస్తాయి. సలాడ్, సైడ్ డిషెస్ లలో కూడా వీటిని కలుపుకొని తినవచ్చు.

  • 8

    పచ్చని ఆకుకూరలు

    పాలకూర మరియు కాలే వంటి పచ్చని ఆకుకూరలు, ఫ్లావనాయిడ్ లతో నిండి ఉంటాయి. ఈ రకానికి చెందిన ఫైటోన్యూట్రిఎంట్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి మరియు క్యాన్సర్ వ్యాధి పెరుగుదలను కూడా సమర్థవంతంగా నివారిస్తాయి. కొన్ని పరిశోధనల ప్రకారం, ఆకుకూరలు అల్జీమర్స్ వ్యాధి అనే వ్యాధి స్థాయిలను తగ్గిస్తాయని తెలిపారు.

  • 9

    ఫ్లాక్స్ సీడ్స్

    ఇవి ఒమేగా-3 ఫాటీ ఆసిడ్ లను కలిగి ఉండి, శరీరంలో కలిగే ఇన్ఫ్లమేషన్ లను తగ్గిస్తాయి. ఈ ఫాటీ ఆసిడ్ లు, ఇన్ఫ్లమేషన్ లను కలుగచేసే కారకాలను సమర్థవంతంగా నివారిస్తాయని "హెవార్డ్  స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్" వారు తెలిపారు. వీటి నుండి తయారు చేసిన నూనెను సలాడ్, ఓట్మీల్ లేదా యోఘర్ట్ లో కలుపుకొని తినవచ్చు.

    Tags:
  • నొప్పి నివారణ ఆహారాలు
  • ఇన్ఫ్లమేషన్ లను తగ్గించే ఆహారాలు
  • గాయాలను తగ్గించే ఆహారాలు
  • Foods that Fight to pain in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ