Health Tips in HindiHealth Tips

థైరాయిడ్ వలన మీ జుట్టు రాలుతుందా? అయితే ఈ చికిత్సలను అనుసరించండి..

By:P Raj Kumar, Onlymyhealth Editorial Team,Date:Jul 11, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

థైరాయిడ్ గ్రంధి అసమతుల్యత వలన కలిగే సమస్య- జుట్టు రాలటం. థైరాయిడ్ గ్రంధిని సాధారణ స్థితికి తీసుకురావటం వలన జుట్టు రాలటం కూడా తగ్గిపోతుంది. థైరాయిడ్ సమస్యల వలన రాలే జుట్టు రాలటాన్ని తగ్గించే సహజ పద్దతుల గురించి ఇక్కడ తెలుపబడింది.
 • 1

  థైరాయిడ్ పరిస్థితులు & జుట్టు రాలటం

  థైరాయిడ్ గ్రంధిలో ఏర్పడే సమస్యల వలన హార్మోన్ లో ఏర్పడే అసమతుల్యతల ఫలితంగా హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం రెండు కలుగుతాయి. వీటి వలన కలిగే సమస్యలలో వెంట్రుకలు రాలటం కూడా ఒకటి. థైరాయిడ్ హార్మోన్ లో ఏర్పడే సమస్యలను తగ్గిస్తే, జుట్టు రాలటం కూడా తగ్గిపోతుంది. ఈ సహజ చికిత్సల ద్వారా ఈ సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు.Image source:Gettyimages.in

 • 2

  విటమిన్ 'E' ను ఎక్కువగా తీసుకోండి

  విటమిన్ 'E' వెంట్రుకలకు కావాల్సిన పోషకాలలో ముఖ్యమైనది, ఎందుకంటే వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లు కణాలను మరమ్మత్తుకు గురి చేసి, వాటి నిర్మాణానికి దోహదపడుతుంది. విటమిన్ 'E' ను అధికంగా కలిగి ఉండే స్పీనాచ్, బాదం పప్పు, బ్రోకలీ మరియు బొప్పాయి పండ్లు వెంట్రుకలు రాలటాన్ని తగ్గించి, జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. Image source:Gettyimages.in

 • 3

  విటమిన్ 'C' స్థాయిలను పెంచుకోండి

  జుట్టు రాలటాన్ని ప్రేరేపించే ఫ్రీ రాడికల్ లకు వ్యతిరేఖంగా పోరాడే సామర్థ్యాన్ని విటమిన్ 'C' కలిగి ఉంటుంది. బెల్ మిరియాలు, పచ్చని ఆకుకూరలు, బెర్రీలు, సిట్రస్ జాతికి చెందిన పండ్లు మరియు పచ్చి బటానీలలో విటమిన్ 'C' అధికంగా  ఉంటుంది. Image source:Gettyimages.in

 • 4

  అమైనో ఆసిడ్ లను ఎక్కువగా తీసుకోండి

  ప్రోటీన్ మరియు మెలనిన్ వర్ణ ద్రవ్యాలను కలిగి ఉండే అమైనో ఆసిడ్ లు వెంట్రుకల యొక్క ఆరోగ్యకరమైన పెరుగుదలకు సహాయపడతాయి. అమైనో ఆసిడ్ సంబంధిత L-లైసిన్ మరియు L-అర్జినైన్ సమ్మేళనాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయని పరిశోధనలలో వెల్లడించబడింది. పౌల్ట్రీ, చేప, లేగ్యూమ్ ల నుండి అమైనో ఆసిడ్ లను పొందవచ్చు.  Image source:Gettyimages.in

 • 5

  రోజు వ్యాయామాలను చేయండి

  వ్యాయామాలు, థైరాయిడ్ సంబంధిత వ్యాధి గ్రస్తులకు చాలా రాకాలుగా ప్రయోజనాలను చేకూరుస్తాయి. ముఖ్యంగా వ్యాయామాలు జుట్టురాలటాన్ని దాదాపుగా తగ్గించి వేస్తాయి. మీరు థైరాయిడ్ సమస్యలను కలిగి ఉన్నపుడు, వైద్యుడితో మాట్లాడి, ఎలాంటి వ్యాయామాలను చేయాలో కనుక్కొని ప్రయత్నించండి. Image source:Gettyimages.in

 • 6

  ఆయిల్ తో మసాజ్

  ఎస్సేన్శియాల్ ఆయిల్ లతో తలపై మసాజ్ చేయటం ద్వారా జుట్టు పెరుగుదలను పెంచుకోవచ్చు. ఇలా చేయటం వలన తలపై చర్మంలో రక్త ప్రసరణ మెరుగుపరచి, హెయిర్ ఫాలికిల్ ను చైతన్యవంతంగా ఉంచుతుంది. కావున రోజు లావెండర్, బాదం లేదా నువ్వుల నూనెతో మసాజ్ చేయండి.  Image source:Gettyimages.in

  Tags:
 • జుట్టు రాలుటకు కారణాలు
 • థైరాయిడ్ వలన రాలే జుట్టును నివారించే చికిత్సలు
 • సహజంగా జుట్టు రాలటాన్ని తగ్గించే చికిస్తలు
 • Thyroid valana rale juttunu tagginche chikitsalu
 • Natural Ways to Combat Thyroid-Induced Hair Loss in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు