Health Tips in HindiHealth Tips

ఒకేరాత్రిలో మొటిమలను తొలగించే సులువైన చిట్కాలు

By:P Raj Kumar, Onlymyhealth Editorial Team,Date:Nov 17, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

మొటిమలను తగ్గించుకోటానికి అన్ని ప్రయత్నాలు చేసి అలసిపోయారా? మొటిమలు పగిలిన తరువాత ముఖంపై ఏర్పడే మచ్చలను తొలగించటం మరింత కష్టం అవునా! కానీ కేవలం ఒకే రాత్రిలో ఈ సమస్యలన్నిటికి ఉపశమనం అందించే పద్దతుల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    ఐస్ థెరపీ

    మొటిమలు మరియు వాటి వలన కలిగే ఎరుపుదనం, వాపులు మరియు ఇన్ఫ్లమేషన్ వంటి వాటిని ఈ థెరపీ ద్వారా త్వరగా తగ్గించుకోవచ్చు. ఈ థెరపీ వలన రక్త ప్రసరణ మెరుగుపడటమే కాదు, శ్వేధ గ్రంధులను కూడా గట్టి పరుస్తుంది. దీనితో పాటుగా, చర్మంపై ఉండే దుమ్ము, ధూళి మరియు నూనెలను తొలగించుటకు సహాయపడుతుంది. చిన్న మంచు గడ్డను బట్టలో చుట్టి, మొటిమలు ఉన్న ప్రదేశంలో కొన్ని సెకన్ల పాటూ ఉంచండి. ఇలా కొన్ని సార్లు చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు.

  • 2

    వైట్ టూత్పేస్ట్

    మనం రోజు ఉదయాన వాడే టూత్పేస్ట్ దంతాలను మెరిసేలా మాత్రమేకాదు ఇతర లాభాలను కూడా చేకూరుస్తుందని మీకు తెలుసా? అవును నిజమే. టూత్పేస్ట్ మొటిమలను కూడా తగ్గిస్తుంది. దీనిలో చేయాల్సిందల్లా ఏంటంటే వైట్ టూత్పేస్ట్ ను మొటిమలపై అప్లై చేసి, అరగంట పాటూ అలాగే ఉంచాలి. ఇలా చేయటం వలన మొటిమల వలన కలిగిన వాపులు తగ్గటం మీరు గమనించవచ్చు.

  • 3

    స్టీం ట్రీట్మెంట్

    స్టీం ట్రీట్మెంట్ ముఖానికి చాలా మంచిది ఎందుకంటే ఇది చర్మ రంద్రాలను తెరచి, చర్మం శ్వాస తీసుకునేలా చేస్తుంది. ఒక పెద్ద కంటెయినర్ ను తీసుకొని, అందులో కొన్ని వేడి నీటిని కలపండి. ఈ నీటి నుండి వచ్చే నీటి ఆవిరి మీ ముఖానికి తగిలే విధంగా కొద్ది సేపు ఉండండి. తరువాత గోరు వెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రపరచుకొని, ఆయిల్-ఫ్రీ తేమభరిత లోషన్ లను అప్లై చేయండి.

  • 4

    అల్లం చేసే మాయాజాలం

    యాంటీ వైరల్, యాంటీ ఫంగల్, యాంటీ సెప్టిక్ మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉండే అల్లం మొటిమలను తగ్గించే సమర్థవంతమైన సహజ ఔషదంగా పేర్కొనవచ్చు. వీటితో పాటుగా, దీనిలో ఉండే సల్ఫర్ కారణంగా ఇది నయం చేసే గుణాలను కలిగి ఉంటుంది. ఒక అల్లం ముక్కను తీసుకొని, 5 నుండి 7 పాటూ ప్రభావిత ప్రాంతాలలో అప్లై చేయండి. తరువాత నీటితో కడిగి మళ్ళి అల్లం ముక్కను ఉంచండి. ఇలా తరచుగా చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు.

  • 5

    గుడ్డు తెల్లసొన

    ప్రోటీన్ లతో నిండి ఉండే గుడ్డుసొన మొటిమలను తగ్గించటమే కాదు ముఖ చర్మంపై ఉండే అవాంఛిత మరకలను మరియు వాపులను తొలగిస్తుంది. 3 గుడ్ల నుండి తెల్లసొనను తీసుకొని, 3 నిమిషాల పాటూ అలాగే ఉంచండి. ఒకసారి తెల్ల సొన సెట్ అయిన తరువాత, మొటిమలు ఉన్న ప్రాంతంలో చేతి వేళ్ళతో దీనిని అప్లై చేయండి. ఎండే వరకు వేచిఉండి, గోరు వెచ్చని నీటితో కడిగివేయండి. ఇలా రోజులో 4 సార్లు చేయటం వలన మొటిమల నుండి ఉపశమనం పొందుతారు.Image source: Getty Images

    Tags:
  • మొటిమలను తగ్గించే సులువైన పద్దతులు
  • రాత్రిలో మొటిమలను తగ్గించే సూచనలు
  • మొటిమలను తగ్గించే సహజ ఔషదాలు
  • Motimalanu tagginche sahaja oushadalu
  • Natural and easy tricks to vanish your pimples overnight in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ