Health Tips in HindiHealth Tips

వేసవిలో తలపై చర్మాన్ని శుభ్రంగా ఉంచే చిట్కాలు

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:May 30, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

చర్మం లాగానే, తలపై చర్మం లేదా స్కాల్ప్ ను కూడా వేసవిలో ఆరోగ్యంగా ఉంచుకోవాలి. వేసవిలో తలపై చర్మంలో కలిగే ఇలాంటి సమస్యలు మరియు అసౌకర్యలాను తగ్గించే సహజ చిట్కాల గురించి ఇక్కడ తెలుపబడింది.
 • 1

  వేసవిలో తలపై చర్మం

  వేసవిలో, తలపై చర్మంలో నూనెలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి, ఫలితంగా చుండ్రు, దురదలు మరియు అసౌకర్యకరమైన వాసనలు ఉత్పత్తి అవుతాయి. జిడ్డుగా ఉండే తలపై చర్మం దుమ్ము, ధూళిలను ఆకర్షించటం వలన ఇన్ఫెక్షన్ లకు దారి తీస్తుంది. ఈత కొట్టడం వలన కూడా తలపై చర్మం ప్రమాదానికి గురవుతుంది. తలపై చర్మం అనారోగ్యాలకు గురైతే, జుట్టు కూడా అనారోగ్యానికి గురవుతుంది. వేసవిలో తలపై చర్మానికి కలిగే ఇలాంటి సమస్యలను తగ్గించే మంచి చిట్కాల గురించి ఇక్కడ తెలుపబడింది.

 • 2

  రోజు కడగండి

  వేసవిలో తలపై చర్మాన్ని మరియు వెంట్రుకలను ఆరోగ్యంగా ఉంచుకోటానికి రోజు స్కాల్ప్ ను కడగండి. రోజులో తలపై చర్మంలో చేరిన దుమ్ము, ధూళి మరియు చెమటలను కడగటం ద్వారా దూరం చేయవచ్చు. రోజు తలపై చర్మాన్ని కడగకపోవటం వలన చుండ్రు వంటి సమస్యలు కూడా కలుగుతాయి.

 • 3

  ఆయిల్ మసాజ్

  తలపై చర్మాన్ని రోజు నూనెతో మసాజ్ చేయటం వలన ఆరోగ్యంగా ఉండటమే కాకుండా, తాజా భావనకు గురి చేస్తుంది. కొబ్బరు నూనెతో చేసే మసాజ్ పొడి మరియు పొలుసులుగా ఉండే తలపై చర్మాన్ని సాధారణ స్థితిలోకి మారుస్తుంది. తలపై చర్మానికి కొబ్బరి నూనెను కొద్దిగా వేడి చేసి మర్దన చేయండి.

 • 4

  అలవాటుగా మార్చుకోండి

  వేసవిలో తలపై చర్మం లేదా స్కాల్ప్ కు వేడి అధికంగా తగులుతుంది. కావున తలపై చర్మానికి తగిన జాగ్రత్తలు తీసుకోవటం రోజు ఒక అలవాటుగా మార్చుకోవాలి. వేసవిలో తలపై చర్మం మరియు జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి వెంట్రుకలను చిన్నగా ఉంచుకుంటూ, గుడ్డు మరియు తేనె కలిపిన సహజ హెయిర్ మాస్క్ ను వాడండి.

 • 5

  శరీరాన్ని హైడ్రేటేడ్ గా ఉంచుకోండి

  నీరు శరీరాన్ని, చర్మాన్ని మరియు జుట్టును ఆరోగ్యకరంగా ఉంచుతుంది కావున నీటిని మ్యాజిక్ ద్రావణంగా పేర్కొనవచ్చు. వేసవిలో మన చర్మం చెమట రూపంలో నీటిని కోల్పోతుంది కావున, రోజులో 8 లేదా అంతకన్నా ఎక్కువ గ్లాసుల నీటిని తాగండి. తలపై చర్మానికి పోషకాల కోసం షాంపూ వాడిన తరువాత, కండిషనర్ ను వాడండి. గుడ్డు మరియు తేనె కలిపినా హెయిర్ మాస్క్ సహజ కండిషనర్ గా పేర్కొనవచ్చు.

 • 6

  ఆరోగ్యక్రమైనవి తినండి

  సమతుల్య ఆహరం తీసుకోకుండా, తలపై చర్మం లేదా స్కాల్ప్ ఆరోగ్యంగా ఉండటానికి మీరు అనేక జాగ్రత్తలు తీసుకున్నను అవన్నీ వ్యర్థమే అని చెప్పాలి. మీరు తెసుకునే ఆహారంలో ఒమేగా-౩ ఫాటీ ఆసిడ్, చేప నూనెలు, ప్రోటీన్, ఐరన్ వంటి మూలకాలు ఉండేలా చూసుకోవాలి. తాజా కూరగాయలు మరియు పండ్లు మీకు సహాయపడతాయి. వేసవిలో తలపై చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవటం కష్టమే. కానీ, మేమ తెలిపే చిట్కాలు సహాయపడతాయి.   Imagesource:Gettyimages.in

  Tags:
 • తలపై చర్మాన్ని శుభ్రంగా ఉంచే చిట్కాలు
 • వేసవిలో స్కాల్ప్ కోసం తీసుకోవలసిన జాగ్రత్తలు
 • వేసవిలో జుట్టు సంరక్షణ చిట్కాలు
 • Vesavilo talapai charma samrakshan chitkalu
 • Ways to keep scalp clean during summer in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

 • అన్ని

 • వ్యాసం

 • స్లైడ్ షో

 • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

  వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
 • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

  చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
 • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

  వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
 • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

  చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ