Health Tips in HindiHealth Tips

ఆరోగ్యానికి హాని కలిగించే ఆహార పదార్థాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Jun 13, 2014

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

ఆహర పదార్థాలలో రెండు రకాలుగా ఉంటాయి అవి ఆరోగ్యాన్ని పెంపొందించేవి మరియు హాని కలిగించేవి. ఇక్కడ శరీరానికి హాని కలిగించే ఆహార పదార్థాలు ఇక్కడ తెలుపబడ్డాయి. వీటి గురించి తెలుసుకోవటం వలన ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు.
  • 1

    ప్రమాదం

    మనం తీసుకునే ఆహర పదార్థాలు సాధారణంగా ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. కానీ కొన్ని రకాల ఆహార పదార్థాల వలన శరీరానికి ప్రమాదాన్ని కలిగే అవకాశం ఉంది. ఇక్కడ తెలిపిన ఆహార పదార్థాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. Image Courtesy:Getty Images

  • 2

    చేపలు

    చేపలు కూడా హానికర కారకాలను కలిగి ఉంటాయి. ముఖ్యంగా చేపలు ఆరోగ్యానికి హాని కలిగించే 'పెస్టిసైడ్స్, రసాయనాలు, హార్మోన్'లు' మరియు ఇతర పదార్థాలు శరీరానికి హాని కలుగచేసే అవకాశం ఉంది. ఒకవేళ మీరు చేపలను తినాలి అనుకున్నపుడు మాంసానికి తీసుకున్న విధంగా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఇందులో చేపలను ఒక సంచి లేదా జాడీలో పెట్టి ఫ్రిజ్'లో ఉంచాలి. చేపలను ఉంచిన సంచి లేదా జాడిని చల్లటి నీతితో నింపాలి. ఈ నీటిని కూడా 30 నిమిషాలకి ఒకసారి మార్చాలి. చేపలు ఉన్న సంచిని గది ఉష్ణోగ్రత వద్ద ఉంచకూడదు. కారణం గది ఉష్ణోగ్రత వద్ద సూక్ష్మజీవులు వాటి సంఖ్యని పంచుకునే అవకాశం ఉంది. Image Courtesy:Getty Images

  • 3

    ఎండిన పండ్లు

    తాజా పండ్లలో పోలిస్తే, ఎండిన పండ్లలో క్యాలోరీల సంఖ్య అధిక మొత్తంలో ఉంటాయి. ఒక కప్పు ఎండిన పండ్లలో 400 క్యాలోరీలు కలిగి ఉంటాయి. మీరు ఈ పండ్లను తిన్న వెంటనే క్యాలోరీలు శరీరానికి అందించబడతాయి. కావున వీటి కన్నా తాజా పండ్లు లేదా ఫ్రిజ్'లో ఉన్న పండ్లు చాలా మంచివి. వీటిని ఎక్కువగా తిన్నను, తక్కువ క్యాలోరీల వలన మీరు ఎక్కువ సమయం ఉండగలుగుతారు మరియు తాజా పండ్ల నుండి ద్రావణాలు అధికంగా పొందుతారు. Image Courtesy:Getty Images

  • 4

    ప్రోటీన్ బార్స్

    ఇవి సాధారణంగా స్నాక్స్ సమయంలో తీసుకోవటం ఆరోగ్యానికి చాలా మంచివి, కానీ వీటి వలన శరీరానికి రెండింతల మొత్తంలో ఫాట్ మరియు కార్బోహైడ్రేట్స్ అందుతాయి. అధిక క్యాలోరీలు తీసుకోటాన్ని తగ్గించండి, తక్కువ క్యాలోరీలు మరియు ఫాట్'లను అందించే వాటిని తీసుకోటానికి ప్రయత్నించండి మరియు ఎక్కువ ఫైబర్ ఉన్న పదార్థాలను తీసుకోటానికి ప్రయత్నించండి. Image Courtesy:Getty Images

  • 5

    మాంసం

    గొడ్డుమాంసం, పందిమాంసం, పౌల్ట్రీ మాంసాలలో హానికలిగించే రసాయనాలు, పెస్టిసైడ్స్, యాంటీ-బయాటిక్స్, హార్మోన్స్ మరియు వివిధ మందులు కలుపుతున్నారు. ఇందులో ఉండే పెస్టిసైడ్స్ మరియు ఫాట్'లు అనగా జంతువుల శరీరంలో ఉండే కొవ్వు కణాలు ఈ హానికర పదార్థాలను గ్రహించుకుంటాయి. వీటిని తినటం వలన మన శరీరంలో ఉండే కొవ్వు కణాలు కుడా వీటిని గ్రహించుకొని హాని కలుగిస్తాయి. Image Courtesy:Getty Images

  • 6

    గుడ్లు

    సాల్మొనెల్లా బాక్టీరియా ఎక్కువగా ఉండేది గుడ్లలోనే వీటి వలన ఎక్కువగా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. కావున వీటిని శీతల ప్రాంతాలలో ఉంచటం చాలా మంచిది. కావున గుడ్లను బయట షాపు నుండి తీసుకురాగానే అతిశీతల ప్రాంతాలలో లేదా ఫ్రిజ్'లలో పెట్టడం మరచిపోకండి. Image Courtesy:Getty Images

  • 7

    పాలు

    పాల ఉత్పత్తులు ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. కానీ పాశ్చురైజేషణ్ చేయని పాలను వాడకండి, వీటి వలన చాలా ప్రమాదకరమైన వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. ముఖ్యంగా, రోగనిరోధక శక్తి బలహీనంగా ఉన్న వారిలో చాలా రకాల ఆరోగ్య సమస్యలను కలుగచేస్తుంది. అంతేకాకుండా గర్భంతో ఉన్న ఆడవారిలో, చిన్న పిల్లలలో, మరియు యుక్త వయసు గల పిల్లలలో చాలా రకాల ప్రమాదాలను కలుగచేసే అవకాశం ఉంది. Image Courtesy:Getty Images

  • 8

    సుశి

    ఒక సుశి రోల్'లో 500 క్యాలోరీలు ఉంటాయి. ఇవి చిన్నగా ఉండి చాలా బిగుతుగా ప్యాక్ చేయబడి ఉంటాయి. ఈ అధిక క్యాలోరీలు గల వాటిని తినకండి మరియు ఎక్కువగా ఫ్రై చేసిన లేదా ఎక్కువ చీస్ కలిపిన, క్రీమ్ చీస్ మరియు ఎక్కువ కారంతో ఉన్న, సాస్ కలిపిన రోల్స్'కి దూరంగా ఉండటం చాలా మంచిది. వీటి వలన చాలార కాల ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది. Image Courtesy:Getty Images

    Tags:
  • హానికలిగించే ఆహరం
  • దూరంగా ఉంచాల్సిన ఆహారాలు
  • ప్రమాదకర ఆహర పదార్థాలు
  • Dangerous food in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • గుండె ఆరోగ్యాన్ని గాయపరిచే అలవాట్లు

    శరీర భాగాలలో గుండె చాలా సున్నితమైన మరియు ముఖ్యమైన భాగం. గుండె శరీరంలో చాలా రకాల విధులను నిర్వహిస్తుంది. గుండెకు హాని కలిగించే కొన్ని రకాల చెడు అలవాట్ల
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • గుండె ఆరోగ్యాన్ని గాయపరిచే అలవాట్లు

    శరీర భాగాలలో గుండె చాలా సున్నితమైన మరియు ముఖ్యమైన భాగం. గుండె శరీరంలో చాలా రకాల విధులను నిర్వహిస్తుంది. గుండెకు హాని కలిగించే కొన్ని రకాల చెడు అలవాట్ల