Health Tips in HindiHealth Tips

జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే పద్దతులు మరియు ఆహారాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Mar 15, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

కాలుష్యం, వాతావరణ మార్పులు, అనుసరించే జీవనశైలిపై ఆధారపడి జుట్టు రాలుతుంటుంది. వెంట్రుకలు రాలుటను తగ్గించుటకు గానూ చాలా రకాల ఉత్పత్తులను వాడుతుంటాము, కానీ, వీటి కన్నా కొన్ని పద్దతులను పాటించటం ద్వారా మరియు ఆహార పదార్థాలను తీసుకోవటం వలన జుట్టు రాలటం తగ్గటమే కాకుండా, వెంట్రుకల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వాటి గురించిన వివరాలు ఇక్కడ పేర్కొనబడ్డాయి.
  • 1

    జుట్టు పెరుగుదల

    వయసు మరియు లింగంతో సంబంధం లేకుండా, జుట్టు పెరుగుదల అనేది ప్రతి ఒక్కరికి అవసరమే. సాధారణంగా ప్రతి ఒక్కరిలో రోజు దాదాపు 50 నుండి 100 వెంట్రుకలు రాలిపోతుంటాయి. నిజానికి రాలిన జుట్టు తిరిగి పెరగటం ముఖ్య సమస్యగా చెప్పవచ్చు. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించటానికి చాలా రకాల మందులు అందుబాటులో ఉన్నాయి. కొన్ని రకాల పద్దతులు మరియు ఆహారాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించుటలో శక్తివంతంగా పని చేస్తాయి.

  • 2

    సరిగా తినండి

    జుట్టు పెరుగుదలకు, వాటికి కావాల్సిన స్థాయిలో విటమిన్ లను అందించండి. ముఖ్యంగా, తినే ఆహారంలో విటమిన్ 'C', ఐరన్, జింక్ మరియు ఒమేగా-3 ఫాటీ ఆసిడ్ లు ఉండేలా చూసుకోండి. యాంటీ ఆక్సిడెంట్ లను పుష్కలంగా కలిగి ఉన్న బ్లూబెర్రీలు, టమాట, బ్రోకలీలతో పాటూ, చేప ఆయిల్ మరియు ప్రోటీన్ లను ఎక్కువగా తినటం వలన జుట్టు బలంగా మరియు పెరుగుదల కూడా సరిగ్గా ఉంటుంది.

  • 3

    హోల్ గ్రైన్స్

    జింక్, విటమిన్ 'B', ఐరన్ వంటి పోషకాలు జుట్టు పెరుగుదలకు అవసరం. జింక్ హార్మోన్ ల స్థాయిలను నియంత్రించి, జుట్టు పెరుగుదలపై నేరుగా వాటి ప్రభావాన్ని చూపిస్తాయి. హోల్ గ్రైన్స్ లో ఈ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. జుట్టు తొరిగి పెరగటానికి మరియు బలంగా ఉండటానికి గానూ, తినే ఆహారంలో హోల్ గ్రైన్స్ నూ తప్పక కలుపుకొండి.

  • 4

    ఎక్కువగా దువ్వకండి

    ఎక్కువగా దువ్వటం వలన జుట్టు ప్రమాదానికి గురవుతుంటుంది, చివరికి జుట్టు పెరుగుడలను దెబ్బ తీస్తుంది. మీ జుట్టు పెరుగుదలలో సమస్యలు ఉంటె మాత్రం, మీ జుట్టు ఆరోగ్యంగా లేదని అర్థం, కావున, అవసరమైన సమయంలో మాత్రమె జుట్టును దువ్వండి. ఎక్కువ శాతం వరకి, సహజ ఫైబర్ లను మరియు స్నానం తరువాత ఎండే వరకు దువ్వకండి.

  • 5

    పౌల్ట్రీ

    ప్రోటీన్ లోపం వలన వెంట్రుకలు పెలుసులుగా మారి, జుట్టు రాలిపోతుంది. చికెన్ మరియు టర్కీలు అధిక మొత్తంలో ప్రోటీన్ లను కలిగి ఉండి, జుట్టు పెరుగుదలతో పాటూ, వాటి ఆరోగ్యాన్ని పెంచుతాయి. పౌల్ట్రీ ఆహారంలో, జుట్టు ఫాలికిల్ ను ఆరోగ్యంగా ఉంచే ఐరన్ పుష్కలంగా ఉంటుంది.

  • 6

    నట్స్

    జింక్, ఇది జుట్టురాలే ప్రక్రియను ఆలస్యం చేస్తుంది, ఈ మూలకాన్ని జీడిపప్పు మరియు అక్రోటుకాయల నుండి ఎక్కువ పొందవచ్చు. వీటితో పాటుగా, అక్రోటుకాయలలో ఒమేగా-3 ఫాటీ ఆసిడ్ మరియు సెలీనియంలు పుష్కలంగా ఉంటాయి. తలపై చర్మ ఆరోగ్యానికి సెలీనియం మరియు జుట్టు ఆరోగ్యానికి ఒమేగా-3 ఫాటీ ఆసిడ్ లు అవసరం.

  • 7

    చిలకడదుంప

    విటమిన్ 'A' లోపం వలన వెంట్రుకలలో చుండ్రు ఏర్పడి, జుట్టు పెరుగుదలను నిలిచిపోతుంది. చిలకడదుంప, అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్, బీటా కెరోటిన్ లను కలిగి ఉంటుంది, ఇవి శరీరంలో విటమిన్ 'A' మార్చబడతాయి. విటమిన్ 'A' తలపై చర్మానికి కావల్సిన నూనెలను ఉత్పత్తిని ప్రేరేపించి, జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తాయి.

  • 8

    చేపలు

    సాల్మన్, మాకేరల్, వంటి నూనెలను ఎక్కువగా కలిగి ఉన్న చేపలు, ఒమేగా-3 ఫాటీ ఆసిడ్ లను పుష్కలంగా కలిగి ఉంటాయి. ఇవి సహజంగా, వెంట్రుకల పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఈ చేపలు, చర్మం మరియు జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి కావలసిన ఐరన్, విటమిన్ 'B12'లను కూడా కలిగి ఉంటాయి.

  • 9

    పాలు

    జుట్టు పెరుగుదాలను ప్రోత్సహించే మరొక మార్గం, పాలు. జుట్టు పరుగుదలకు అవసరమైన ప్రోటీన్ లు కాటేజ్ చీస్ మరియు యోఘర్ట్ లలో పుష్కలంగా కలిగి ఉంటాయి. కావున పాలు మరియు పాల ఉత్పత్తులను ఆహార సేకరణలో మరవకండి.

    Tags:
  • వెంట్రుకల పెరుగుదల
  • జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే ఆహరం
  • జుట్టు రాలుటను తగ్గించే పద్దతులు
  • Foods that Promote Hair Growth in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ