Health Tips in HindiHealth Tips

పురుషులలో ఈ లక్షణాలను గమనించారా? కేన్సర్ కావచ్చు...

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:Nov 25, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

కేన్సర్ బహిర్గత లక్షణాల గురించి తెలుసుకోవటం వలన వ్యాధి తీవ్రస్థాయికి చేరక ముందే, వైద్యుడిని కలిసి తగిన చికిత్స చేపించుకోవచ్చు. కానీ కొంత మంది పురుషులు ఈ లక్షణాలను పట్టించుకోకుండా వదిలేస్తుంటారు, ఆ లక్షణాలేంతో మీరే చూడండి.
  • 1

    నిలకడగా నొప్పి

    నిలకడగా లేదా ఎక్కువ సమయం పాటూ నొప్పికి గురైతే వెంటనే వైద్యుడిఐ కలవమని "అమెరికన్ కేన్సర్ సొసైటీ" వారు సలహా ఇస్తున్నారు. ఎప్పటి నుండి నొప్పి వస్తుందో మరియు మీ దినచర్యల గురించి వైద్యుడితో చర్చించి, తగిన పరీక్షలు జరిపి, నొప్పికి అసలు కారణం ఎంతో తెలుసుకోండి.

  • 2

    రొమ్ము పరిమాణంలో మార్పులు

    చాలా మంది పురుషులు, మగవారు రొమ్ము కేన్సర్ కు గురవరని, ఈ రకం కేన్సర్ కేవలం మహిళలలో మాత్రమే కలుగుతుందని భ్రమ పడుతుంటారు. కానీ, రొమ్ము కేన్సర్ పురుషులలో కలిగే అవకాశం కూడా ఉంది. ఒకవేళ పురుషులు గనుక వారి ఛాతి ప్రాంతంలో ఎవైన గడ్డ వంటి వాటిని గమనించినా లేదా రొమ్ము పరిమాణంలో మార్పులు గమనించిన వెంటనే వైద్యుడిని కలవండి.

  • 3

    దీర్ఘకాలికంగా జ్వరం

    కొన్ని సార్లు చాలా రకాల కేన్సర్ వ్యాధులు మొదటగా జ్వరంగా బహిర్గతం అవుతుంటాయి. శరీరంలో కేన్సర్ ప్రారంభమైన ప్రాంతం నుండి ఇతర ప్రాంతానికి లేదా ఇతర శరీర భాగానికి వ్యాపించినపుడు రోగికి జ్వరం వస్తుంది. దీర్ఘకాలిక సమయం పాటూ జ్వరం ఉందని గమనించిన వెంటనే వైద్యుడిని కలవటం మంచిది.

  • 4

    బరువులో ఆకస్మిక తగ్గుదల

    ఎలాంటి బరువు తగ్గించే ప్రయత్నం చేయకుండానే, తక్కువ కాలంలో పూర్తి శరీర బరువులో 10 శాతం వరకు బరువు తగ్గిన పురుషులు కేన్సర్ వ్యాధికి గురయ్యారని తెలిపే ఒక సూచిక. ఇలా కారణం లేకుండా బరువు తగ్గటం గమనించిన వెంటనే వైద్యుడిని కలవటం మంచిది.

  • 5

    అలసట

    సరైన సమయం పాటూ విశ్రాంతి, ఆహరం తిన్నను అలసట కలుగుతుందా? అయితే తప్పక వైద్యుడిని కలవండి. ఇలా అస్తమానం అలసటకు గురవటం కూడా కేన్సర్ వ్యాధి యొక్క బహిర్గత లక్షణం. ఇలాంటి లక్షణాలను గమనించిన వెంటనే వైద్యుడిని కలిసి, అలసటకు గల కారణాలేంటో తెలుసుకోండి.

    Tags:
  • కేన్సర్ బహిర్గత లక్షణాలు
  • కేన్సర్ వ్యాధికి చిహ్నాలు
  • కేన్సర్ కలిగి ఉన్నారని తెలిపే లక్షణాలు
  • Cancer lakshanalau
  • Cancer Symptoms Most People Ignore in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ