Health Tips in HindiHealth Tips

బరువు తగ్గటం వలన వ్యాధులకు దూరంగా ఉండవచ్చు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Mar 27, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

అధిక బరువు వలన కలిగే ఇబ్బందుల గురించి అందరికి తెలిసిందే, కానీ దీని వలన సమస్యలతో పాటు వివిధ రకాల వ్యాధుల భారినపడే అవకాశం ఉంది. వాటి గురించిన క్లుప్తమైన వివిరణ కోసం ఇది చదవండి.
  • 1

    ఎందుకు బరువు తగ్గాలి?

    అధిక బరువు వలన ఆరోగ్యపరంగా కలిగే నష్టాలు గురించి చాలా మందికి తెలిసిందే. కానీ అధిక బరువు వలన చాలా రకాల ఆరోగ్య సమస్యలతో పాటూ వివిధ రకాల రోగాల భారినపడే అవకాశం ఉంది మరియు మీ జీవితం కాలంలో కొంత సమయాన్ని కూడా తగ్గించి వేస్తుంది. శరీర బరువు తగ్గించుకోవటం వలన వివిధ రకాల ఆరోగ్య సమస్యలు మాత్రమె కాకుండా, వివిధ రకాల వ్యాధులకు కూడా దూరంగా ఉండవచ్చు. Image Courtesy:Getty Images

  • 2

    టైప్-2 డయాబెటిస్ లేదా మధుమేహం

    శరీరంలో తక్కిన స్థాయిలో కాకుండా మితిమీరిన స్థాయిలో కొవ్వులను పదార్థాలను కలిగి ఉన్న వారు తప్పకుండా టైప్-2 రకం మధుమేహానికి గురవుతారు. ఈ వ్యాధి రాకుండా ఉండాలంటే ఆరోగ్యవంతమైన బరువుని నిర్వహించాలి. ఒకవేళ మీరు మధుమేహ వ్యాధిని కలిగి ఉన్నట్లయితే మంచి ఆహార నియమాలని అనుసరిస్తూ, మీ శరీర బరువుని తగ్గించుకోండి. Image Courtesy:Getty Images

  • 3

    గుండె సంబంధిత వ్యాధులు

    ఆరోగ్యవంతమైన బరువు కలిగి ఉన్నపుడు, గుండె మరియు వాటి సంబంధిత అవయవాలు చాలా ఉత్తేజంగా తమ తమ విధిని నిర్వర్తిస్తాయి. సరైన బరువు నిర్వహించటం వలన గుండెపోటు మరియు గుండె సంబంధిత వ్యాధులకు దూరంగా ఉంటారు మరియు మీ హృదయం చాలా బలంగా ఉంటుంది.  Image Courtesy:Getty Images

  • 4

    అధిక రక్తపీడనం

    శరీరంలోని కొవ్వు పదార్థాల స్థాయిలు మారియు అధిక రక్తపీడనం రెండూ చాలా దగ్గరి సంబంధాన్ని కలిగి ఉన్నాయి. ఒకవేళ అధిక రక్త పీడనాన్ని కలిగి ఉన్నట్లయితే, బరువు తగ్గించుకోవటం వలన సాధారణ లేదా ఆరోగ్యకర స్థాయిలో ఉంటుంది. Image Courtesy:Getty Images

  • 5

    తక్కువ కొవ్వు పదార్థాలు

    చెడుకొవ్వు పదార్థాలు మరియు 'ట్రై-గ్లిసరైడ్స్'లు శరీర బరువును ప్రభావిత పరుస్థాయి. మీ శరీరంలోని అధిక బరువు తగ్గించుకోవటం వలన చెడు కొవ్వు పదార్థాల స్థాయిలను తగ్గించి, మంచి కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచుకొని వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చు.  Image Courtesy:Getty Images

  • 6

    ఒత్తిడి మరియు సంబంధిత అనారోగ్యాలు

    మీరు అధిక పని కలిగి ఉండి ఒత్తిడికి గురైనపుడు, ఆరోగ్యంగా ఉన్నట్టు భావించలేరు. ఒత్తిడి వలన నిద్రలోకి జారుకుంటూ, తలనొప్పి, జీర్ణాశయ సమస్యలు మరియు చర్మ సంబంధిత వ్యాధులు ఇలా చాలా రకాల ఆరోగ్య సమస్యలకు గురవుతారు. తక్కువ బరువు ఉండటం వలన ఒత్తిడికి తట్టుకొని, చైతన్యవంతంగా ఉంటారు.   Image Courtesy:Getty Images

  • 7

    క్యాన్సర్

    శరీరంలోని కొవ్వును బట్టి 'ఈస్ట్రోజేన్' హార్మోన్ ఉత్పత్తి అవుతుంది, ఈ హార్మోన్ 'ఎండోమెట్రియల్' మరియు రొమ్ము లేదా 'బ్రెస్ట్ క్యాన్సర్'లతో సంబంధాన్ని కలిగి ఉంటుంది. అధిక బరువు కలిగి ఉన్నట్లయితే, ఈ వ్యాధి రావటానికి అవకాశం ఉంది. కావున ఆరోగ్యవంతమైన బరువు పొందటానికి తగిన వ్యాయామాలను అనుసరించి ఇలాంటి వ్యాధులకు దూరంగా ఉండండి.    Image Courtesy:Getty Images

  • 8

    నిగ్రహరాహిత్యం

    'నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ పెల్విక్స్ డిసార్డార్ నెట్వర్క్' వారు జరిపిన పరిశోధనల ప్రకారం, సాధారణ బరువు ఉన్న స్త్రీల కన్నా స్థూలకాయత్వంటో ఉన్న ఆడవారు 'పెల్విక్-ఫ్లోర్' వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది అని తెలిపారు. కావున వీటికి దూరంగా ఉండటానికి శరీర బరువును తగ్గించుకోవటం మంచిది. Image Courtesy:Getty Images

  • 9

    శ్వాస సంబంధిత వ్యాధులు

    అధిక బరువు వలన శ్వాస సంబంధిత వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. 'నేషనల్ జెవిష్ హెల్త్ ఇన్ డెన్వర్' వారు పరిశోధనలు జరిపి, స్థూల కాయత్వం వలన అస్తమాకి గురవుతారని తెలిపారు. మామూలు బరువు ఉన్న వారికన్నా అధిక బరువు ఉన్నవారిలో 'గ్లోకోకార్టికాయిడ్స్' శక్తివంతంగా ఉంటాయని వారు తెలిపారు. Image Courtesy:Getty Images

  • 10

    కీళ్ళ సమస్యలు

    అధిక బరువు మోసినపుడు కీళ్ళు నొప్పిగా అనిపిస్తాయి. బోస్టన్'లో ఉన్న 'బెత్ ఇస్రాయిల్ డి-అకనేసెస్ మెడికల్ సెంటర్'లో 1971 మరియు 2002లో జరిపిన పరిశోధనల ప్రకారం, వరుసగా స్థూలకాయత్వం గల వారిలో 3 శాతం మరియు 18 శాతం కీళ్ళనొప్పులు వస్తాయని తెలిపారు. కావున మీరు బరువు తగ్గించుకొని కీళ్ళ నొప్పులకు దూరంగా ఉండండి. Image Courtesy:Getty Images

  • 11

    స్లీప్ అప్నోయా

    మీరు అధిక బరువు ఉండటం వలన పడుకున్నపుడు లేదా నిద్రలో వివిధ రకల సమస్యలకు గురవుతారు. దీనినే 'స్లీప్ అప్నోయా' అంటారు. ఆరోగ్యవంతమైన బరువు ఉన్న వారు 'స్లీప్ అప్నోయా' వ్యాధికి దూరంగా ఉంటారని పుస్తకాలలో ప్రచురించబడింది. Image Courtesy:Getty Images

    Tags:
  • ఆరోగ్యవనతమైన బరువు వలన కలిగే లాభాలు
  • అధిక బరువు వలన కలిగే వ్యాదులు
  • మీరు బరువు తగ్గుటకు గల కారణాలు
  • Benefits of Healthy Weight
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • శరీర బరువు తగ్గించే ఖర్జూర పండ్లు

    ఖర్జూర పండ్ల వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలలో బరువు తగ్గించటం కూడా ఒకటని చెప్పవచ్చు. ఖర్జూర పండ్లు శరీర బరువును ఎలా తగ్గిస్తుందో, బరువు తగ్గుటలో ఈ పం
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • శరీర బరువు తగ్గించే ఖర్జూర పండ్లు

    ఖర్జూర పండ్ల వలన ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలలో బరువు తగ్గించటం కూడా ఒకటని చెప్పవచ్చు. ఖర్జూర పండ్లు శరీర బరువును ఎలా తగ్గిస్తుందో, బరువు తగ్గుటలో ఈ పం