Health Tips in HindiHealth Tips

మీ గుండె ఆగిపోకుండా ఉండాలంటే ఈ పనులను చేయకండి.....

By:P Raj Kumar, Onlymyhealth Editorial Team,Date:Sep 18, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

హృదయం ఆరోగ్యంగా ఉండాలంటే, ఆరోగ్యకర ఆహార ప్రణాళిక, వ్యాయామాలు మరియు ఆరోగ్యకర జీవనశైలి మాత్రమేకాకుండా, ఇక్కడ తెలిపిన అలవాట్లకు దూరంగా ఉండాలి.
  • 1

    పొగతాగటం

    పొగతాగే అలవాటు ఉన్నవారికి కూడా తెలుసు ఈ అలవాటు వలన ఎలాంటి ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉందో. పొగతాగే అలవాటు వలన రక్తపీడనం, రక్తనాళాలలో అడ్డంకులు మరియు ఆరోగ్యకర (HDL) తగ్గటం వంటి గుండె సంబంధిత వ్యాధులు అధికమయ్యే పరిస్థితులు పెరుగుతాయి. పొగతాగే అవలవాటును మాని వాటి వలన కలిగే ప్రయోజనాలను చూడండి.

  • 2

    ఛాతి నొప్పి పట్ల అశ్రద్ధ

    చాలా మంది ఛాతిలో కలిగే నొప్పి గురించి శ్రద్ధ తీసుకోరు. అతిగా ఉండే బరువును లేపటం లేదా భోజనంలో ఎక్కువగా ఆహరం తీసుకోవటం వలన ఛాతిలో నొప్పి కలుగుతుంది అనుకుంటారు కానీ, గుండెలో ఎదో సమస్య వలన ఛాతి నొప్పి కలుగుతుందని వారు గమనించరు. ఛాతిలో నొప్పి లేదా అసౌకర్యానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని కలవండి.

  • 3

    చెక్ చేపించుకోకపోవటం

    క్రమంగా మీ ఆరోగ్యం గురించి చెక్ చేపించుకోవటం వలనే మీరు ఎలాంటి అనారోగ్యాలకు గురవబోతున్నారో అని తెలుస్తుంది. అధిక రక్తపీడన స్థాయిలు మరియు అధిక కొవ్వు పదార్థాల వంటి గుండె సంబంధిత వ్యాధులకు సులువుగా చికిత్స చేయవచ్చు.

  • 4

    పెరిగే పొట్టను పట్టించుకోకపోవటం

    ఉదర భాగం పెరగటం గురించి పట్టించుకోకపోవటం మనలో చాలా మంది చేసే ఒక తప్పిదం. ప్రతి సంవత్సరం పొట్ట పరిమాణం పెరుగుతుంది అంటే, ఇది చాలా చింతించాల్సిన విషయం. ఇలా పొట్ట భాగంలో అదనపు కొవ్వు పదార్థాలు చేరుటను జీవక్రియ వైపరీత్యం (మెటబోలిక్ సిండ్రోం) యొక్క బహిర్గత లక్షణం అని చెప్పవచ్చు. దీని వలన గుండె వ్యాధులు, గుండెపోటు లేదా డయాబెటిస్ వంటి సమస్యలు కలుగుతాయి.

  • 5

    రక్తపీడనాన్ని అదుపులో ఉంచుకోకపోవటం

    మీ రక్తపీడన స్థాయిలు పెరిగినపుడు తగిన చికిత్స అందించని ఎడల, గుండె వ్యాధులు మీరే ప్రోత్సహిస్తున్నారని అర్థం. అధిక రక్త పీడన స్థాయిలు గుండె రక్త పంపిణిని కష్టతరం చేస్తాయి మరియు ధమనులను గట్టి పరుస్తాయి. ఫలితంగా గుండెపోటు, స్ట్రోక్ మరియు ఇతర హృదయ సంబంధిత వ్యాధులను కలిగిస్తాయి. Image source:Gettyimages.in

    Tags:
  • గుండె ఆరోగ్యాన్ని ప్రమాదానికి గురిచేసే అలవాట్లు
  • అనారోగ్యాకర్ అలవాట్లు
  • గుండె ఆరోగ్యంగా ఉండుటకు దూరంగా ఉండాల్సిన అలవాట్లు
  • Gunde vyadhulanu kaliginche alavatlu
  • Bad Habits for Heart in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ