Health Tips in HindiHealth Tips

ఇన్సులిన్ గురించి మీరు తెలుసుకోవలసిన నిజాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Jan 01, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

మధుమేహ వ్యాధి గ్రస్తులకు ఇన్సులిన్ అవసరమని అందరికి తెలిసిందే. మదుమేహం కలగటానికి కారణాలు, వ్యాధి గ్రస్తులు ఇన్సులిన్ తీసుకొని ఎడల కలిగే నష్టాలు, ఇన్సులిన్ గురించిన ప్రాముఖ్యతల గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి.
  • 1

    ఇన్సులిన్ అనగా ఏమిటి?

    ఇన్సులిన్ అనేది శరీరంలో సహజంగా ఉత్పత్తి చేయబడే, తప్పక అవసరమయ్యే హార్మోన్'గా చెప్పవచ్చు. ఇన్సులిన్ స్థాయిలు తక్కువగా ఉంటె మాత్రం, శరీరంలో ఎలాంటి విధులు నిర్వహించబడవు. అవయవాలన్ని బలహీనపడటం లేదా నాశనానికి గురవుతాయి.Image Courtesy : Getty Images

  • 2

    మధుమేహ వ్యాధి చికిత్సలో ఇన్సులిన్ పాత్ర?

    ఇన్సులిన్ సహాయంతో చేసే చికిత్సలో మధుమేహ వ్యాధి రకాన్ని బట్టి ఇన్సులిన్'ను వాడతారు. ముఖ్యంగా, టైప్-1 మధుమేహంలో, సహజ ఇన్సులిన్ సరైన మొత్తంలో లేకపోవటం లేదా ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు నాశనం చెందిన సమయంలో ఇన్సులిన్'ను వాడతారు.Image Courtesy : Getty Images

  • 3

    సహజ ఇన్సులిన్ తగ్గితే ఏమ్ అవుతుంది?

    టైప్-1 మధుమేహ వ్యాధి గ్రస్తులలో ఇన్సులిన్ చికిత్సను జరిపించని ఎడల లేదా తక్కువ శ్రద్ధ చూపటం వలన, వారి రక్తంలోని చక్కెర స్థాయిలు అధికమవుతాయి. ఫలితంగా, ప్రాణాంతకర ముప్పుగా భావించే ''డయాబెటిక్ అసిడోసిస్'' కలుగుతుంది. సాధారణంగా కలిగే సమస్యలు- పాలిపోవడం, చమటలు, అసాధారణ గుండెచప్పుడు, అస్పష్టంగా దృష్టి మరియు ఆకలి వంటివి కలుగుతాయి.Image Courtesy : Getty Images

  • 4

    వివిధ రకాల ఇన్సులిన్ ఉత్పత్తులు

    ఇన్సులిన్'ను సాధారణంగా 4 ముఖ్య రకాలుగా విభజించారు. అవి- మొదటి రకం: షార్ట్-యాక్టింగ్ ఇన్సులిన్ (త్వరగా అనగా 6 నుండి 8 గంటలలో పని చేస్తుంది). రెండవ రకం: ఇంటర్మీడియేట్- యాక్టింగ్ ఇన్సులిన్ (10నుండి 12 గంటలలో పని చేస్తుంది), మూడవ రకం: లాంగ్-యాక్టింగ్ ఇన్సులిన్ (20 గంటలలో) పని చేస్తుంది. నాలుగవ రకం: ఈ రకం ఇన్సులిన్'లో షార్ట్ & ఇంటర్మీడియేట్-యాక్టింగ్ రెంటిని కలుపుతారుImage Courtesy : Getty Images

  • 5

    ఇన్సులిన్'ను ఎలా తీసుకోవటం?

    మధుమేహ వ్యాధి గ్రస్తులు ఇన్సులిన్ తీసుకోటాన్ని ఒక చాలెంజ్ అనే చెప్పవచ్చు. ఇంజెక్షన్ రోజు ఒకే సమయానికి తీసుకోవాలి, ఒకవేళ తీసుకొని ఎడల సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. సాధారణంగా, ఇన్సులిన్'ను పునర్వినియోగపరచలేని ఇన్సులిన్ పెన్నులు ద్వారా శరీరంలోకి ప్రవేశపెడతారు. నోటి ద్వారా తీసుకునే ఇన్సులిన్ కనుగోనటంపై శాస్త్రజ్ఞులు పరిశోధనలను నిర్వహిస్తున్నారు.Image Courtesy : Getty Images

  • 6

    ఇన్సులిన్ వలన రక్తంలోని చక్కెర స్థాయిలో మార్పు?

    దీర్ఘకాలిక సమయం పాటూ రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గితే మాత్రం స్పృహ కోల్పోయే అవకాశం ఉంది లేదా కోమాలోకి కూడా వెళ్ళే అవకాశం లేకపోలేదు. రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గితే, చేతులు వనకటం, చమటలు పట్టడం, ఆహార సేకరణ జరపటం వంటి లక్షణాలు బహిర్గతమవుతాయి. కొద్దిగా చక్కెర తీసుకోవటం, పలుచని పండ్ల రసం, గ్లూకోస్ మాత్రలు తీసుకోవటం వలన రక్తంలోని చక్కెర స్థాయిలు సాధారణ స్థితికి తీసుకురాబడతాయి.Image Courtesy : Getty Images

  • 7

    ఇన్సులిన్ స్థాయిలలో మార్పులు ఎపుడు అవసరం?

    ఎపుడైయితే రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గితే, రోగి హైపో (హైపో గ్లైసిమియా రియాక్షన్)కు గురయ్యే అవకాశం ఉంది. ఆ సమయంలో ఇన్సులిన్ తీసుకునే దానిలో మార్పులను అనుసరించాలి. ఈ సమయంలో, తీసుకునే షార్ట్-యాక్టింగ్ ఇన్సులిన్ స్థాయిలను తగ్గించాలి.Image Courtesy : Getty Images

  • 8

    జీవితకాలం పాటూ ఇన్సులున్ ఎవరికి అవసరం?

    టైప్-2 మధుమేహ వ్యాధి నిర్దారణ జరిగిన వారు మరియు గర్భ సమయంలో మధుమేహ వ్యాధికి గురైన వారు తాత్కాలికంగా ఇన్సులిన్ తీసుకుంటారు. కానీ, ఎవరైతే శరీర బరువు అకస్మాత్తుగాతగ్గుతుందో వారు దీర్ఘకాలం పాటు ఇన్సులిన్ తీసుకోవలసి వస్తుంది. అంతేకాకుండా, ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు గురైన ప్రమాద స్థాయిలను బట్టి ఇన్సులిన్ తీసుకోవాలి.Image Courtesy : Getty Images

    Tags:
  • ఇన్సులిన్
  • ఇన్సులిన్ ప్రాముఖ్యత
  • మధుమేహం & ఇన్సులిన్
  • Things you must know about Insulin in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ముక్కు గురించి తెలుసుకోవలసిన నిజాలు

    శ్వాస తీసుకోటానికి, వాసనలను గ్రహించటానికి ఉపయోగపడేది ముక్కు. జ్ఞాన అవయవాలలో ముక్కు కూడా ఒకటి అని మరవకండి. ముక్కులలోని రకాలు, ఆవశ్యకత గురించి ఇక్కడ తెల
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • ముక్కు గురించి తెలుసుకోవలసిన నిజాలు

    శ్వాస తీసుకోటానికి, వాసనలను గ్రహించటానికి ఉపయోగపడేది ముక్కు. జ్ఞాన అవయవాలలో ముక్కు కూడా ఒకటి అని మరవకండి. ముక్కులలోని రకాలు, ఆవశ్యకత గురించి ఇక్కడ తెల