Health Tips in HindiHealth Tips

తలపై చర్మంలో కలిగే ఇన్ఫెక్షన్ లను తగ్గించే సూచనలు

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:May 03, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

తలపై చర్మం ఇన్ఫెక్షన్ లకు గురవటం చాలా సాధారణం, కానీ, దీని వలన ఇబ్బందులతో పాటూ జుట్టు ఆరోగ్యం కూడా పాడవుతుంది. తలపై చర్మం ఇన్ఫెక్షన్ లకు గురవకుండా ఉండానికి తగిన సూచనలు ఇక్కడ తెలుపబడ్డాయి.
  • 1

    సరైన శుభ్రతను పాటించండి

    తలపై చర్మంలో కలిగే ఇన్ఫెక్షన్ లకు కలగకుండా ఉండటానికి స్కాల్ప్ ను శుభ్రంగా ఉంచుకోండి. గాడత తక్కువ గల షాంపూ ద్వారా రోజు కడగటం వలన స్కాల్ప్ ను శుభ్రంగా ఉంచుకోవచ్చు. అంతేకాకుండా, మీరు వాడే దువ్వెనలను కూడా శుభ్రంగా ఉంచుకోండి. జుట్టు కత్తిరించిన ప్రతిసారి జుట్టును మరియు దువ్వున ప్రతిసారి చేతులను కడుక్కోండి. ఒకవేళ తలపై చర్మం ఇన్ఫెక్షన్ లకు గురవటాన్ని గమనించినట్లయితే, సెలీనియం సల్ఫైడ్ షాంపూతో వారానికి రెండు సార్లు కడగండి.

  • 2

    స్కాల్ప్ ను గోకకండి

    తలపై చర్మాన్ని గోకటం వలన కూడా ఇన్ఫెక్షన్ లకు కారణం కావచ్చు. మీ జుట్టును దువ్వేపుడు, సున్నితమైన పళ్ళను కలిగి ఉండే దువ్వేనను వాడటం వలన తలపై చర్మంలో కలిగే ఇన్ఫెక్షన్ లను దూరంగా ఉండవచ్చు. వెంట్రుకలను చేతి గోళ్లతో నిమిరే బదులు, కొబ్బరి లేదా ఆలివ్ ఆయిల్ తో మసాజ్ చేయండి.

  • 3

    వ్యక్తిగత వస్తువులను ఇతరులతో పంచుకోకండి

    మీరు వాడే వ్యక్తిగత వస్తువులను ఇతరులతో పంచుకుంటున్నారా? అయితే మీ తలపై చర్మం ఇన్ఫెక్షన్ లకు గురయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయని అర్థం. కావున తలకు వాడే వస్తువులు, దువ్వెనలు, టవల్ మరియు రబ్బర్ బ్యాండ్ వంటి ఇతరేతర సామాన్లను ఇతరులతో పంచుకోకండి.

  • 4

    స్కాల్ప్ చెకింగ్

    మీ తలపై చర్మం ఇన్ఫెక్షన్ లకు గురవకుండా ఉండటానికి, సంవత్సరానికి రెండు సార్లు స్కాల్ప్ టెస్ట్ చేపించుకోండి. ఫంగల్ నిరోధక షాంపూ లేదా సబ్బులను 15 రోజులలో రెండు సార్లు వాడటం వలన స్కాల్ప్ ఇన్ఫెక్షన్ లకు దూరంగా ఉండవచ్చు.

  • 5

    ఆరోగ్యకర జీవనశైలి అనుసరించండి

    పేలవ ఆహరం సేకరణ మరియు డీ హైడ్రేషన్ వంటివి స్కాల్ప్ ఇన్ఫెక్షన్ లకు గురవటానికి ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు. కావున, తలపై చర్మం ఇన్ఫెక్షన్ లకు గురవకుండా ఉండాలంటే ఇలాంటి కారకాల పట్ల జాగ్రత్త వహించాలి. డ్రయర్, హీట్ ట్రీట్మెంట్ వంటి వాటిని తరచుగా వాడకూడదు.  Image source: Getty

    Tags:
  • స్కాల్ప్ ఇన్ఫెక్షన్ లను నివారణ
  • తలపై చర్మ ఇన్ఫెక్షన్ ను ఎలా తొలగించుకోవటం
  • ఇన్ఫెక్షన్ లను ఎలా నివారించటం
  • Talapai charmanni ela nivarinchatam
  • Tips to prevent scalp infection in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ