Health Tips in HindiHealth Tips

వ్యాయామాలు & ఆహర ప్రణాళిక లేకుండా బరువు తగ్గుటకు సూచనలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Mar 30, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

అధిక బరువు బరువు తగ్గించుకొనుటకు చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తుంటారు, ఉదాహరణకు- వ్యాయామాలను చేయటం లేదా ఆహార ప్రణాలికలను పాటించటం. వీటిని పాటించకుండానే శరీర బరువును సులభంగా తగ్గించుకోవచ్చు. వాటి గురించిన వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి.
  • 1

    బరువు తగ్గుటకు సులువైన మార్గాలు

    ప్రస్తుత కాలంలో అధిక బరువు ఒక సాధారణ సమస్యగా చెప్పవచ్చు. స్థూలకాయత్వం అనేది చాలా రకాల ఆరోగ్య సమస్యలకు ఒక మూలంగా చెప్పవచ్చు. ప్రతి ఒక్కరు సన్నగా, నాజుకుగా మరియు శారీరక పరంగా ఫిట్'గా ఉండాలి అనుకుంటారు. వ్యాయామాలు మరియు ఆరోగ్యకర ఆహర ప్రణాళిక జీవనశైలిలో ఒక భాగం మరియు ఆరోగ్యకరమైన బరువు నిర్వహణకు మార్గం అని చెప్పవచ్చు. ఇలాంటివి పాతిన్చుటకు కొంత మంది బద్దకంగా ఫీల్ అవుతుంటారు, వ్యాయామాలు మరయు ఆహర ప్రణాలిక పాటించకుండానే బరువు తగ్గించే చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డాయి.Image Courtesy : Getty Images

  • 2

    సరైన స్థాయిలో నీరు

    ఇతర కార్యక్రమాలతో పోలిస్తే, సరైన మోతాదులో నీరు తాగటం వలన కూడా శరీర బరువును తగ్గుతుంది. శరీరంలో తగిన స్థాయిలో ఉండటం వలన జీవక్రియ వేగంగా జరిగి క్యాలోరీలు ఖర్చు చేయబడతాయి. నీరు అధికంగా తాగటం వలన కడుపు నిండి నట్టుగా అనిపించి, ఇతర ఆహర పదార్థాల నుండి పొందే అధిక క్యాలోరీలు సంఖ్య కూడా తగ్గుతుంది. శరీరాన్ని ఎల్లపుడు హైడ్రేటేడ్'గా ఉంచటమే కాకుండా, వ్యాయామాల సమయంలో హార్మోన్'ల ఉత్పత్తిని అధికం చేస్తుంది.Image Courtesy : Getty Images

  • 3

    నిద్ర

    తగిన సమయం పాటూ నిద్ర లేదా విశ్రాంతి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందనే చెప్పవచ్చు. నిద్ర తరువాత శరీరం మరియు మెదడు విశ్రాంతికి గురయ్యి, తిరిగి పనిని ప్రారంభిస్తాయి. అంతేకాకుండా, నిద్ర వలన బరువు కూడా తగ్గుతుంది. 8 గంటల కంటే ఎక్కువ సమయం, 6 గంటల కంటే తక్కువ సమయం తీసుకునే వారి శరీర బరువు పెరుగుతుంది. 7 నుండి 8 గంటల పాటూ విశ్రాంతి తీసుకునే వారిలో శరీర బరువు ఆరోగ్యకర స్థాయిలో ఉంటుంది. నూతన పరిశోధనల ప్రకారం, సరైన సమయం పాటూ విశ్రాంతి తీసుకొని వారిలో హార్మోన్ విడుదలలో తారతమ్యాలు ఏర్పడి, శరీర బరువును పెంచుతాయి. కావున సరైన సమయం పాటూ నిద్ర శ్రేయస్కరం.Image Courtesy : Getty Images

  • 4

    ఆహార నియంత్రణ

    మీరు ఆహార నియంత్రణ అనుసరించటం లేదా!, బరువు తగ్గాలి అనుకుంటే మాత్రం ఆహార సేకరణను తగ్గించాలి. బరువు మాత్రమె కాకుండా, ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి. అధిక ఆహార సేకరణ వలన శరీరంలో కొవ్వు పదార్థాల స్థాయిలు పెరిగి వివిధ రకాల అనారోగ్యాలకు కూడా కారణం అవవచ్చు.Image Courtesy : Getty Images

  • 5

    సమయం పాలన

    శరీర బరువు తగ్గాలి అనుకుంటే ఉదయం నుండి రాత్రి వరకు తీసుకునే భోజనం, ఒకే సమయానికి తీసుకోవాలి. త్వరగా ఉదయాన అల్పాహారం మరియు రాత్రి సరిగ్గా 8 గంటలకు రాత్రి భోజనం తీసుకోండి. మధ్యాన్న భోజనం రోజు ఒకే సమమయానికి మరియు ఆరోగ్యకర స్నాక్స్ విషయంలో కూడా సరైన సమయం పాలనను పారించండి. ఈ విధంగా ఒక పద్దతి ప్రకారం ఆహార సేకరణను తీడుకోవటం వలన క్యాలోరీల స్థాయిలు నియమిత స్థాయిలు అందింపబడి బరువు తగ్గుతుంది.Image Courtesy : Getty Images

  • 6

    సరిగ్గా నమలటం

    మనం ఆహరం తినే పద్దతి కూడా మన శరీర బరువును ప్రభావితం చేస్తుంది. ఆహారాన్ని నెమ్మదిగా తింటూ, పూర్తిగా నమలండి. సరిగ్గా ఆహారాన్ని నమలటం వలన జీర్ణక్రియ ఎలాంటి ఆటంకం లేకుండా జరుగుతుంది.Image Courtesy : Getty Images

  • 7

    ఎక్కువ సమయం పాటూ కుర్చోకండి

    ఒకే స్థలంలో ఎక్కువ సమయం పాటూ కూర్చోవటం వలన శరీరంలో కొవ్వు పదార్థాలు నిల్వ చేయబడతాయి. ''యూనివర్సిటీ ఆఫ్ మిస్సోరి'' ప్రకారం, ఎలాంటి చైతన్యం లేకుంగా దాదాపు 4 గంటల పాటూ కూర్చోవటం వలన జీవక్రియ రేటు తగ్గి, శరీరంలో కొవ్వు పదార్థాల స్థాయిలు నిలచిపోతాయి.Image Courtesy : Getty Images

  • 8

    స్నేహితులతో

    ఎలాంటి చెడు అలవాట్లు లేని, స్నేహితులతో ఉండటం వలన మీ జీవనశైలి కూడా ఆరోగ్యంగా మారుతుంది. ఫలితంగా, ఎక్కువ చైతన్యవంతంగా ఉండి, క్యాలోరీలు ఖర్చు చేయబడి, బరువు తగ్గుతారు.Image Courtesy : Getty Images

    Tags:
  • బరువు తగ్గుటకు సూచనలు
  • బరువు తగ్గించే సూచనలు
  • వ్యాయామాలు లేకుండా బరువు తగ్గటం
  • Weight loss Tips in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

Comments

  • satish28 Jan 2015
    Good information for weight loss.
  • santhi15 May 2015
    My height 5.2 my weight 68 how to reduces weight plz tell me

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • శరీర బరువును తగ్గించే ఆహార పదార్థాలు

    బరువు తగ్గటానికి ప్రయత్నించే వారిలో కొంత మంది ఆకలికి తట్టుకోలేక నియమాలను అతిక్రమించి ఆహర సేకరణను అధికం చేసి, బరువు తగ్గటంలో వైఫల్యాలను ఎదుర్కొంటారు. ఇ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • శరీర బరువు తగ్గుటలో సహాయపడే ఆహారాలు

    ప్రపంచ వ్యాప్తంగా స్థూలకాయత్వంచే చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. బరువు తగ్గించుకోటానికి ప్రయత్నిస్తున్నారు, కానీ, కొన్ని రకాల ఆహర పదార్థాలు కూడా శ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • శరీర బరువు తగ్గుటలో సహాయపడే ఆహారాలు

    ప్రపంచ వ్యాప్తంగా స్థూలకాయత్వంచే చాలా మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు. బరువు తగ్గించుకోటానికి ప్రయత్నిస్తున్నారు, కానీ, కొన్ని రకాల ఆహర పదార్థాలు కూడా శ
  • శరీర బరువును తగ్గించే ఆహార పదార్థాలు

    బరువు తగ్గటానికి ప్రయత్నించే వారిలో కొంత మంది ఆకలికి తట్టుకోలేక నియమాలను అతిక్రమించి ఆహర సేకరణను అధికం చేసి, బరువు తగ్గటంలో వైఫల్యాలను ఎదుర్కొంటారు. ఇ