Health Tips in HindiHealth Tips

వివిధ రకాల క్యాన్సర్ వ్యాధిని నివారించే- మేడిపండు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Nov 18, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

వాడుక భాషలో మేడిపండ్లుగా పిలువబడే అత్తిపండ్లు, అద్భుత ప్రయోజనాలతో పాటు వివిధ రకాల క్యాన్సర్ లను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వాటి గురించిన వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి.
  • 1

    కోలన్ క్యాన్సర్

    ఆరోగ్యకర జీర్ణవ్యవస్థ కలిగి ఉండటం చాలా అవసరం మరియు కోలన్ క్యాన్సర్ (పురీషనాళ క్యాన్సర్)తో భాదపడే వారు తాజా మేడిపండ్లను తినటం వలన మంచి ఫలితాలను పొందుతారు. తాజా మరియు ఎండబెట్టిన అత్తిపండ్లు, కరగని ఫైబర్ లను కలిగి ఉండి, జీర్ణ వ్యవస్థలో ఆహార మరియు భాగాల కదలికలను సులభపరుస్తాయి.

  • 2

    పోస్ట్ మీనోపాజల్ బ్రెస్ట్ క్యాన్సర్

    మేడిపండ్లు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లను కలిగి ఉండి, క్యాన్సర్ ను కలుగచేసే ముఖ్య కారకలైనట్టి ఫ్రీ రాడికల్ లకు వ్యతిరేఖంగా పోరాడతాయి. ముఖ్యంగా, పోస్ట్ మీనోపాజల్ స్త్రీలలో, హార్మోన్ల అసమతల్యతల వలన రొమ్ము క్యాన్సర్ కలిగే అవకాశం ఉంది. కానీ అత్తిపండ్ల ఈ రకమైన క్యాన్సర్ వ్యాధికి గురవకుండా కాపాడతాయి.

  • 3

    బ్రెయిన్ క్యాన్సర్

    నూతన పరిశోధనలలో వెళ్ళడించిన దాని ప్రకారం, మేడిపండ్ల నుండి తీసిన సారం మెదడులో క్యాన్సర్ కు గురైన కణాలపై శక్తివంతంగా పని చేస్తుందని కనుగొన్నారు. మేడిపండ్ల సారం, క్యాన్సర్ కు గురైన కణాలలో ప్రవేశపెట్టబడిన తరువాత, క్యాన్సర్ అభివృద్ధి 75 శాతం వరకు అణచబడిందని ఇదే పరిశోధనలలో వెల్లడించబడింది.

  • 4

    కాలేయ క్యాన్సర్

    అత్తిపండ్ల సారం, కాలేయ క్యాన్సర్ కణాలతో వ్యతిరేఖంగా పోరాడుతుందని, అధ్యయనాలలో తెలుపబడింది. ఈ సారం వాడకం వలన క్యాన్సర్ కణాల పెరుగుదల నియంత్రించబడటమే కాకుండా, ఇతర చికిత్సలో కన్నా, ఈ సారం వాడకం ద్వారా క్యాన్సర్ కణాలు రెట్టింపు అవటం కూడా తగ్గుతుందని అధ్యయనాలలో తెలుపబడింది.

  • 5

    క్యాన్సర్ సంబంధిత ఇన్ఫ్లమేషన్ లను తగ్గిస్తుంది

    మేడిపండ్లలో ఉండే 'ల్యుటేయోలిన్' ఫ్లావనాయిడ్ లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ చర్యలను ప్రేరేపిస్తాయి. 'ల్యుటేయోలిన్', యాంటీ ఆక్సిడెంట్ చర్యలకు మద్దతుగా నిలిచే సామర్థ్యాన్ని కలిగి ఉండి, ఫ్రీ రాడికల్ లను తటస్థీకరింప చేస్తాయి. ఇది శక్తివంతంగా పనిచేసి, ట్యూమర్ ల పెరుగుదలను నివారిస్తుంది. 'ల్యుటేయోలిన్', చర్మ క్యాన్సర్ కు చికిత్స లేదా నివారించటంలో కీలక పాత్ర పోషిస్తుంది.  Image Source : Getty Images

    Tags:
  • క్యాన్సర్ తో పోరాడే అత్తిపండ్లు
  • అత్తిపండ్ల ప్రాముఖ్యత
  • మేడిపండ్ల ప్రయోజనాలు
  • atthipandla prayonalau
  • figs help prevent cancer in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ