Health Tips in HindiHealth Tips

గర్భవతులలో మలబద్దకాన్ని తగ్గించే గృహ నివారణలు

By:Mahesh Pothu, Onlymyhealth Editorial Team,Date:Nov 11, 2016

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

గర్భ సమయంలో కలిగే మలబద్దకం ఎలా తొలగించుకోవాలని ఆలోచిస్తున్నారా? ఇలాంటి సమయంలో కలిగే మలబద్దకాన్ని తగ్గించే సహజ ఔషదాల గురించి ఇక్కడ తెలుపబడింది.
  • 1

    గర్భ సమయంలో మలబద్దకం

    మలబద్దకం అనేది చాలా సాధారణం కానీ, గర్భవతులలో ఇదొక పీడకలలా వెంటాడుతుంది. మీరు గర్భవతా? ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారా? మరేం భాదపదకండి, మీ ఒక్కరే కాదు చాలా మంది గర్భవతులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. శరీర హార్మోన్ లలో మార్పులు మరియు పెరిగే గర్భం వంటి పరిస్థితులు పేగులపై ఒత్తిడిని పెంచటం వలన ఈ సమస్య కలుగుతుంది. గర్భసమయంలో కలిగే ఈ సమస్యను తొలగించే మందులు చాలానే అందుబాటులో ఉన్నాయి. కానీ ఈ సమయంలో కలిగే మలబద్దకాన్ని తగ్గించేసహాజ ఔషదాలు చాలానే ఉన్నాయి. ఇవి సమస్య నుండి ఉపశమనం అందించటమే కాకుండా, పిండాభివృద్దికి సహాయపడతాయి. ఆ ఔషదాలేంటో ఇక్కడ తెలుపబడింది.

  • 2

    ఫైబర్ అధికంగా గల ఆహారాలు

    మన ఆహరంలో ఫైబర్ ఎంత ముఖ్యమైనదో అందరికీ తెలిసిందే కానీ, గర్భవతులు వారు తినే ఆహార పదార్థాలలో కరగని ఫైబర్ లను కూడా కలపాలి. ఈ కరగని ఫైబర్ లు జీర్ణశయ వ్యవస్థలో ఉండే జీర్ణం అవని ఆహార పదార్థాలను బయటకు పంపి, మలబద్దకాన్ని దూరంగా ఉంచుతాయి. అవిసె విత్తనాలు, బాదం, పండ్లు మరియు కూరగాయలు ఫైబర్ లను అధిక మొత్తంలో కలిగి ఉంటాయి. ఒకవేళ ఉదయపు అలసట కూడా ఉంటే కాకుండా, సైలియం మందులను లేదా స్ట్రాబెర్రీ కలిపిన ఆర్గానిక్ ఓట్ బ్రాన్ లను తినండి.

  • 3

    నిమ్మరసం

    మీ జీర్ణ వ్యవస్థకు మద్దతు చేకూరుద్దాం అనుకుంటే నిమ్మరసం తాగండి. సగం నిమ్మకాయ ముక్క నుండి రసాన్ని గ్లాసులో పిండి, గోరు వెచ్చని నీటిని కలిపి రోజు ఉదయాన తీసుకోవటం వలన బోవేల్ కదలికలు సరిగా జరుగుతాయి. మలబద్దకం నుండి ఉపశమనం పొందాలి అనుకుంటే, ఏమ్ తినకుండా లేదా ఖాళీ కడుపుతో నిమ్మరసాన్ని తాగండి.

  • 4

    మెగ్నీషియం ఉపభాగాలు

    గర్భ సమయంలో కలిగే మలబద్దకాన్ని తగ్గించే మరొక గృహ నివారిణిగా మెగ్నీషియం ఉపభాగాలను తెలుపవచ్చు. అవును, అధిక డోస్ గల మెగ్నీషియం సురక్షితం మాత్రమే కాదు, బోవేల్ కదలికలను కూడా ప్రోత్సహిస్తుంది. ఫలితంగా, మలబద్దకం నుండి త్వరిత ఉపశమనం కలిగిస్తుంది.

  • 5

    చామోమిలే టీ

    వేడి ద్రావణాల ద్వారా మలబద్దకం నుండి ఉపశమనం పొందాలి అనుకుంటున్నారా? అయితే చామోమిలే టీ పేగులను విశ్రాంతికి గురి చేస్తుంది. అంతేకాకుండా, ఇది నాడీ వ్యవస్థను కూడా విశ్రాంతి భావనకు లోను చేసి, నిద్రలేమి (ఇన్సొమ్నియా) కు దూరం చేస్తుంది. రోజులో రెండు కప్పుల చామోమిలే టీ తాగవచ్చు. రోజులో రెండు కప్పుల టీ మాత్రమే క్షేమం, ఎక్కువగా తీసుకున్న ఎడల అబార్షన్ లేదా గర్భ స్రావానికి లోనయ్యే అవకాశం ఉంది.  

    Tags:
  • గర్భసమయంలో మలబద్దకాన్ని తగ్గించే చిట్కాలు
  • గర్భవతులలో మలబద్దకాన్ని తగ్గించే ఔషదాలు
  • మలబద్దకాన్ని తగ్గించే సహజ ఔషదాలు
  • Garbhinilalo malabaddakanni tagginche gruha nivaranalu
  • Home remedies for constipation during pregnancy in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • కాళ్ళ నొప్పని తగ్గించే గృహ నివారణలు

    కాళ్ళలో కలిగే నొప్పుల వలన మనం అసౌకర్యాలకు గురవుతుంటాము. కానీ, కొన్ని రకాల గృహ నివారణలు ద్వారా ఈ నొప్పిల నుండి ఉపశమనం పొందవచ్చు. ఆ వివరాలు ఇక్కడ తెలుపబ
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • కాళ్ళ నొప్పని తగ్గించే గృహ నివారణలు

    కాళ్ళలో కలిగే నొప్పుల వలన మనం అసౌకర్యాలకు గురవుతుంటాము. కానీ, కొన్ని రకాల గృహ నివారణలు ద్వారా ఈ నొప్పిల నుండి ఉపశమనం పొందవచ్చు. ఆ వివరాలు ఇక్కడ తెలుపబ