Health Tips in HindiHealth Tips

వీర్యకణాల సంఖ్యను పెంచే సహజ ఔషదాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Jan 05, 2017

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

సరిపడని స్థాయిలో విడుదలయ్యే వీర్యకణాల సంఖ్య కారణంగా పురుషులలో సంతానోత్పత్తి లోపాలు కలుగుతాయి. దీనికి కారణం ఏదైనా ఇక్కడ తెలిపిన ఔషదాల ద్వారా ఈ సమస్యను సమర్థవంతంగా తగ్గించుకోవచ్చు.
  • 1

    వీర్య కణాల సంఖ్య

    WHO (వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్) ప్రకారం, ఆరోగ్యకర పురుషుడి ఒక మిల్లి లీటర్ వీర్యంలో 20 మిలియన్ల వీర్య కణాలు ఉండాలి. 15 మిల్లి లీటర్ల కన్నా తక్కువ వీర్యకణాలు ఉంటే, వారిలో సంతానోత్పత్తి లోపాలు గలదు అనర్థం. ఒత్తిడి, ప్రోస్టేట్ గ్రంధిలో ఇన్ఫెక్షన్, వీర్యనాళం ప్రమదానికి గురవటం, స్టెరాయిడ్ ల వాడకం, సిగరెట్ అలవాటు, అధికంగా ఆల్కహాల్, ప్రమాదకర రసాయనాలకు బహిర్గతం వంటి అనేక కారణాలు వీర్య కణాల సంఖ్యకు కారణం అవవచ్చు. ఈ సమస్యను తగ్గించే సహజ ఔషదాల గురించి ఇక్కడ తెలుపబడింది. Image source: Getty Images

  • 2

    మాక రూట్

    నలుపు రకానికి చెందిన మాక రూట్ వీర్యం ఉత్పత్తిని పెంచటం మరియు వీర్యకణాల చలనాన్ని కూడా మెరుగుపరుస్తుంది. సంతానోత్పత్తి ఔషదంగా పేర్కొనే ఈ ప్రముఖ హెర్బ్, శరీరంలోని హార్మోన్ లను సమతుల్యపరుస్తుంది. కొన్ని నెలల పాటూ 1 నుండి 3 చెంచాల మాక రూట్ ను వివిధ డోస్ లలో రోజు తీసుకోండి. Image source: Getty Images

  • 3

    పనాక్స్ జిన్సెంగ్

    పనాక్స్ జిన్సెంగ్ లేదా కొరియన్ జిన్సెంగ్ గా పిలువబడే ఈ శాస్త్రీయ ఔషదాన్ని ఒత్తిడిని అధిగమించుటకు గానూ చనీయులు సాధారణంగా వాడుతున్నారు. పనాక్స్ జిన్సెంగ్ టెస్టోస్టెరాన్ స్థాయిలను పెంచి, వీర్యకణాల సంఖ్య మరియు వాటి చలనాన్ని పెంచి పురుషులలో సంతానోత్పత్తి అవకాశాలను పెంచుతుంది. అంతేకాకుండా,అ ఈ ఔషదం అంగస్తంభన ఎక్కువ సమయం ఉండేలా చూస్తుంది. 3 నెలల పాటూ 500 మిల్లి గ్రాములు గల పనాక్స్ జిన్సెంగ్ ను 1 నుండి 3 కాప్సుల్ లుగా రోజు తీసుకోండి. వీటిని తీసుకునే ముందు వైద్యుడిని తప్పల కలవండి. Image source: Getty Images

  • 4

    అశ్వగంధ

    అశ్వగంధ వేరు నుండి తీసిన సారం పురుషులలో వీర్యపరిమాణం, వీర్యకణాల సంఖ్య మరియు వాటి చలనాన్ని మెరుగుపరుస్తుందని 2013లో జరిపిన పరిశోధనలలో ఆధారాలతో ప్రచురించారు. ఈ అధ్యయనాలలో 675 మిల్లి గ్రాముల అశ్వగంధ సారాన్ని 90 రోజుల పాటూ, 3 వివిధ రకాల డోస్ లలో పురుషులకు ఇచ్చారు. కొన్ని నెలల పాటూ సగం చెంచా అశ్వగంధ పొడిని వేడి పాలలో కలుపుకొని తాగండి. మరొక మార్గం ఏమిటంటే- అశ్వగంధ వేరు సారాన్ని రోజు తీసుకోండి. ఎ మేరకు తీసుకోవాలో వైద్యుడిని అడిగి తెలుసుకోండి. Image source: Getty Images

  • 5

    వెల్లుల్లి

    సహజంగా కామోద్దీపనలను చేయగల శక్తి వెల్లుల్లి కలిగి ఉంటుంది మరియు వీర్య కణాల సంఖ్యను పెంచే గుణాన్ని కూడా కలిగి ఉంటుంది. వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే సమ్మేళనం వీర్య కణాలకు ఒత్తిడిని తట్టుకుని, జీవించగల గుణాన్ని ప్రసాదిస్తుంది మరియు రక్త ప్రసరణను కూడా మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా, వీటిలో ఉండే సెలీనియం వీర్య కణాల చలనాన్ని కూడా మెరుగుపరుస్తుంది. Image source: Getty Images

    Tags:
  • వీర్య కణాల సంఖ్య పెంచే సహజ మార్గాలు
  • స్పెర్మ్ సంఖ్య పెంచే ఔషదాలు
  • శుక్రకణాల సంఖ్య పెంచే సహజ పద్దతులు
  • Sperm Count nu penche oushadalu
  • Home remedies to increase Sperm Count in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • వీర్యకణాల సంఖ్యను పెంచే సహజ ఔషదాలు

    సరిపడని స్థాయిలో విడుదలయ్యే వీర్యకణాల సంఖ్య కారణంగా పురుషులలో సంతానోత్పత్తి లోపాలు కలుగుతాయి. దీనికి కారణం ఏదైనా ఇక్కడ తెలిపిన ఔషదాల ద్వారా ఈ సమస్యను
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • వీర్యకణాల సంఖ్యను పెంచే సహజ ఔషదాలు

    సరిపడని స్థాయిలో విడుదలయ్యే వీర్యకణాల సంఖ్య కారణంగా పురుషులలో సంతానోత్పత్తి లోపాలు కలుగుతాయి. దీనికి కారణం ఏదైనా ఇక్కడ తెలిపిన ఔషదాల ద్వారా ఈ సమస్యను