Health Tips in HindiHealth Tips

వెంట్రుకలు పలుచగా మారుటాన్ని ఆపే ఇంట్లో ఉండే ఔషదాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:Jun 04, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

జుట్టు పలుచబటానికి చాలానేకారణాలున్నాయి. కానీ, పలుచగా మారిన జుట్టును తిరిగి సాధారణ స్థితికి తీసుకురాలేము. పలుచగా మారకముందే ఇక్కడ తెలిపిన కొన్ని రకాల ఇంట్లో ఉండే ఔషదాల వాడకం ద్వారా జుట్టు పలుచబడటాన్ని పూర్తిగా నివారించవచ్చు.
 • 1

  జుట్టు పలుచబడటం

  వెంట్రుకలు సన్నబడటం అనేది ఎవరికి నచ్చని విషయమే. కానీ, కొన్ని ఔషదాల వాడకం ద్వారా సులభంగా దీని నుండి ఉపశమనం పొందవచ్చు. జుట్టు పలుచగా మారటానికి చాలా కారణాలున్నాయి. ముఖ్యంగా, ఒత్తిడి, నాణ్యత లేని నీటి వాడకం, హార్మోన్ల అసమతుల్యతలు, ప్రోటీన్ లోపం మరియు కాలుష్యం వంటి కారణాలను చెప్పవచ్చు. ఈ విధంగా జుట్టు పలుచగా మారి చివరకి బట్టతలకు దారి తీస్తుంది. వెంట్రుకలు పలుచబడటాన్ని ఆపే ఇంట్లో ఉండే సహజ ఔషదాల గురించి ఇక్కడ తెలుపబడింది. Image Source : Getty Images

 • 2

  కొబ్బరి నూనె

  4 చెంచాల కొబ్బరి నూనెను, 2 చెంచాల నిమ్మరసంలను సమగ్రంగా కలపండి. ఈ మిశ్రమాన్ని 10 నుండి 15 నిమిషాల పాటూ తలపై మసాజ్ చేయండి, మసాజ్ చేసిన తరువాత 60 నుండి 75 నిమిషాల పాటూ అలానే వదిలేయండి. తరువాత షాంపూతో శుభ్రంగా కడిగి వేయండి. మంచి ఫలితాలను పొందటానికి గానూ రోజు అనుసరించండి.  Image Source : Getty Images

 • 3

  కలబంద

  తాజా కలబంద రసాన్ని తీసుకొని, కొన్ని చుక్కల బాదం నూనెను కలిపి, తలపై మసాజ్ చేయండి. ఈ మిశ్రమం జుట్టు పలుచబడటాన్ని సమర్థవంతంగా తగ్గిస్తాయి. దీనితో పాటుగా కలబంద రసాన్ని తాగటం వలన జుట్టు పెరుగుదల ప్రోత్సహించబడుతుంది. వెంట్రుకల నిర్మాణాన్ని మెరుగుపడుటకు తాజా కలబంద గుజ్జును కండిషనర్ వలే వాడండి. Image Source : Getty Images

 • 4

  ఆముదం నూనె (క్యాస్టర్ ఆయిల్)

  వెంట్రుకలు పలుచబడే ప్రక్రియను నియంత్రించుటకు గానూ, ఒక చెంచా తేనెను ఆముదం నూనెలో కలిపి, వారంలో 3 నుండి 4 సార్లు మసాజ్ చేయండి. ఆముదం నూనెను రోజు వాడటం వలన జుట్టు పెరుగుదల ప్రోత్సహించబడటమే కాకుండా, వెంట్రుకలు పలుచబడే ప్రక్రియ కూడా నిలుపబడుతుంది. Image Source : Getty Images

 • 5

  ఆలివ్ ఆయిల్

  జుట్టు పలుచబడటాన్ని తగ్గించే ఇంట్లో ఉండే మరొక సహజ ఔషదం ఆలివ్ ఆయిల్. ఆలివ్ ఆయిల్ ను తలపై మసాజ్ చేసి, 6 నుండి 8 గంటల పాటూ అలానే వదిలేయటం వలన కొద్ది కాలంలోనే మంచి ఫలితాలను పొందుతారు. ఆలివ్ ఆయిల్ ను తలకు వాడటం వలన దుమ్ము, ధూళి కణాలు తొలగించబడటమే కాకుండా, వెంట్రుకల నిర్మాణం కూడా మెరుగుపడుతుంది.  Image Source : Getty Images

 • 6

  మెంతివిత్తనాలు

  రెండు చెంచాల మెంతి విత్తనాలను తీసుకొని, ఒక గ్లాసు నీటిలో కలిపి, పేస్ట్ వలే తయారు చేయండి. ఈ పేస్ట్ ను రోజు కనీసం ఒక నెల పాటూ మసాజ్ చేయటం వలన జుట్టు పలుచబడటం తగ్గటమే కాకుండా జుట్టు మెరుగుదల కూడా మెరుగుపడుతుంది.  Image Source : Getty Images

 • 7

  వెజిటేబుల్ జ్యూస్

  క్యారెట్, పాలకూర మరియు క్యాప్సికంల నుండి తయారు చేసిన తాజా రసాలు, వెంట్రుకలు పలుచబడటాన్ని శక్తివంతంగా తగ్గిస్తాయి. ఇది మాత్రమేకాకుండా, వివిధ రకాల జుట్టు సమస్యల నుండి ఉపశమనం పొందుటకు గానూ, ఆల్ఫా-ఆల్ఫా మరియు స్పీనాచ్ రసాలను కలిపిన మిశ్రమాన్ని తాగండి. Image Source : Getty Images

 • 8

  వెనిగర్

  షాంపూతో జుట్టును శుభ్రపరచిన తరువాత, వెనిగర్ ను వెంట్రుకలకు మసాజ్ చేయటం వలన జుట్టు పలుచబడే సమస్య నుండి ఉపశమనం పొందవచ్చు. మంచి ఫలితాలను పొందుటకు గానూ, ఆపిల్ సైడర్ వెనిగర్ ను నీటిలో కలిపి, ఈ మిశ్రమంతో జుట్టును కడగండి. వారంలో 3 నుండి 4 సార్లు ఈ పద్దతిని అనుసరించటం వలన జుట్టు పెరుగుదల కూడా మెరుగుపడుతుంది.Image Source : Getty Images

  Tags:
 • జుట్టు సన్నబడటం
 • పలుచగా మారిన జుట్టుకు ఔషదాలు
 • జుట్టు సన్నబడటాన్ని తగ్గించే ఔషదాలు
 • juttu sannabadatanni ape oushadalu
 • home remedies for thin hair in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

Comments

 • vikramadithya 11 Jun 2015
  Give some tips for Hair loss problem.
 • vikramadithya 11 Jun 2015
  I have hair loss problem give some tips

మీ కోసం మరిన్ని

 • అన్ని

 • వ్యాసం

 • స్లైడ్ షో

 • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

  చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
 • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

  వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
 • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

  వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
 • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

  చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ