Health Tips in HindiHealth Tips

సహజ చర్మ సంరక్షణ కోసం ఇంట్లో ఉండే ఔషదాలు

By:Ravi Ponnala, Onlymyhealth Editorial Team,Date:May 21, 2015

వార్తాలేఖలో సభ్యత్వం పొంది

నేరుగా మీ ఇన్ బాక్స్ లో రోజు ఆరోగ్య చిట్కాలను పొందుటకు

చర్మ సంరక్షణ కోసం, ఖరీదైన ఉత్పత్తులను వాడటం కన్నా, ఇంట్లో ఉండే సహజ ఔషదాలను వాడటం ఆరోగ్యకరం అని చెప్పవచ్చు. రసాయనాలతో కూడిన వాటి కన్నా, సహజ ఔషదాలు శక్తివంతంగా పని చేస్తాయి. వీటి గురించిన వివరాలు ఇక్కడ తెలుపబడ్డాయి.
  • 1

    దోషరహిత చర్మానికి సహజ ఔషదాలు

    వేల రూపాయలు ఖర్చుపెట్టి కొనే ప్రముఖ బ్రాండ్ లతో పోలిస్తే, సహజ ఔషదాలతో దోషరహిత చర్మాన్ని పొందవచ్చు. ఇక్కడ తెలిపిన ఔషదాల వాడకం వలన మీ చర్మ రూపు మెరుగుపడి, అందంగా కనపడతారు. అంతేకాకుండా, వీటి వలన ఎలాంటి దుష్ప్రభావాలు కలగవు. Image Source : Getty Images

  • 2

    అదనపు మెరుగుదల కోసం గుడ్డు

    జిడ్డు చర్మంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా! అయితే, ముఖానికి గుడ్డు యొక్క తెల్ల సొనను వాడండి. పొడి చర్మంతో సమస్యలు ఎదుర్కొంటున్నారా! అయితే గుడ్డు యొక్క పచ్చసొనను వాడటం వలన మంచి ఫలితాలను పొందుతారు. చర్మంపై నల్లటి వలయాలు మరియు మచ్చలు ఏర్పడటానికి ముఖ్య కారణమైన, చర్మ రంధ్రాలను, గుడ్డు సమర్థవంతంగా తగ్గించి, ప్రకాశవంతమైన చర్మాన్ని ఇస్తుంది. Image Source : Getty Images

  • 3

    క్రీమ్ మసాజ్

    మీ చర్మ రకానికి అనుగుణంగా మంచి క్రీమును ఎంచుకోండి. ఎంచుకున్న మంచి చర్మ క్రీమును, ముఖంపై వలయాల రూపంలో మసాజ్ చేయటం వలన మీ చర్మంపై కలిగే అద్భుతాలను గమనించవచ్చు. ఇది మీ చర్మ రూపును మెరుగుపరచటమే కాకుండా, చర్మ కణాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.   Image Source : Getty Images

  • 4

    మెరిసే చర్మనికి జ్యూస్ లు

    నిమ్మరసం, ఆపిల్ జ్యూస్ మరియు పైనాపిల్ జ్యూస్ వంటివి చర్మ రూపును మెరుగుపరిచే మంచి ఔషదాలుగా చెప్పవచ్చు. తాజాగా సేకరించిన ఈ రసాలను, చర్మంపై అప్లై చేసి, 15 నుండి 20 నిమిషాల పాటూ అలానే ఉంచి, శుభ్రంగా నీటితో కడగండి. ఆస్ట్రిజెంట్ మరియు తేలికపాటి బ్లీచింగ్ గుణాలను కలిగి ఉండే ఈ జ్యూస్ లు, చర్మానికి చాలా ప్రయోజనాలను కలుగచేస్తాయి. Image Source : Getty Images

  • 5

    నల్లటి వలయాలను పారదోలండి

    అవును, మన చర్మంపై ఉండే నల్లటి వలయాలను, మచ్చలను సహజ ఔషదాల ద్వారా తొలగించుకోవచ్చు. వీటిలో మొదటగా పెరుగు, నల్ల మిరియాల పొడిని కలిపి, మిశ్రమాన్ని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మ ముఖంపై అప్లై చేసి, కనీసం 10 నుండి 15 నిమిషాల పాటూ వదిలేసి, నీటితో శుభ్రంగా కడగండి. Image Source : Getty Images

  • 6

    ఆహార ప్రణాలికలను గమనించండి

    చర్మానికి కావలసిన పోషకాలను ఫైబర్, పచ్చని ఆకుకూరలు, కూరగాయల మరియు యాంటీ ఆక్సిడెంట్ లను పొందవచ్చు. వీటితో పాటుగా, విటమిన్ 'E' మరియు 'C' లు, చర్మాన్ని సహజంగా, ప్రకాశవంతంగా కనపడేలా చేస్తాయి. కావున ఈ రకమైన ఆహారాలు పోషకాలు మీరు పాటించే ప్రణాళికలో ఉండేలా జాగ్రత్త పడండి.  Image Source : Getty Images

  • 7

    పాల మిశ్రమం

    శుభ్రమైన టమోటాను దంచి, దీనికి 2 చెంచాల పాలను కలపండి. ఈ మిశ్రమాన్ని కనీసం 10 నిమిషాల వరకైనా ఉంచి, చల్లటి నీటితో కడిగివేయండి. ఈ మిశ్రమం, చర్మం లోతుగా శుభ్రపరచి, అంతర్భాగాలలో ఉండే నూనెలను మరియు సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. Image Source : Getty Images

  • 8

    దురలవాట్లకు దూరం

    సిగరెట్, మితిమీరిన మోతాదులో ఆల్కహాల్ మరియు అధికంగా మేకప్ లను వాడటం వలన చర్మ ఆరోగ్యం పాడవుతుంది. వీటికి దూరంగా ఉండటం కూడా ఒక సహజ పద్దతి అని చెప్పవచ్చు. వీటికి దూరంగా ఉండటం వలన సహజమైన మరియు ప్రకాశవంతమైన చర్మాన్ని పొందవచ్చు. Image Source : Getty Images

    Tags:
  • మెరిసే చర్మానికి సహజ ఔషదాలు
  • ఆరోగ్యకర చర్మం పొందుటకు మార్గాలు
  • చర్మ రూపును మెరుగుపరిచే ఔషదాలు
  • Merise Charmaniki Sahaja Oushadalu
  • Remedies for Glowing Skin in Telugu
Post Comment
X

Post a Comment

Want to say something? Post your comment.
Comments will be mo derated and allowed if they are relevant to the article and not abusive in nature.
Please answer this simple math question. 10 + 8 =

Disclaimer +

ఖచ్చితత్వం, విశ్వసనీయత, సమయస్పూర్తి మరియు సమాచార ప్రామాణికతను నిర్ధారించడానికి అన్ని చర్యలను తీసుకున్నప్పటికీ వాటికి Onlymyhealth (ఓన్లీ మై హెల్త్) ఎటువంటి బాధ్యతా వహించదు. ఈ వెబ్సైట్'లోని సమాచారాన్ని ఉపయోగించుకోవడం వీక్షకులు విజ్ఞతకే వదలడమైనది. మా వ్యాసపేజీలలో ఇతరులు ఇచ్చిన సలహాలు/చిట్కాలకు మా బాధ్యత లేదు. మీ ఆరోగ్యపరిస్థితిలో అనుమానం లేక ఆందోళన కలిగించినా, దయచేసి మీ ఆరోగ్య సంరక్షణ ప్రదాతను సంప్రదించగలరు

మీ కోసం మరిన్ని

  • అన్ని

  • వ్యాసం

  • స్లైడ్ షో

  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • జుట్టు రాలటాన్ని తగ్గించే చిట్కాలు

    వాతావరణ మార్పులు, కాలుష్యం వంటి కారణాల వలన జుట్టు రాలటం సాధారణం కానీ మీరు అనుసరించే కొన్ని కారణాల వలన కూడా జుట్టు అధికంగా రాలుతుంది. జుట్టు రాలుటకు కా
  • ఉంగరాల జుట్టు సంరక్షణ చిట్కాలు

    చాలా మంది స్త్రీలు ఉంగరాల జుట్టు ఉన్నారని భాదపడుతుంటారు. ఉంగరాల జుట్టు కలిగి ఉన్నవారు ఆకర్షణీయంగా, అందంగా కనపడేలా చేసే కొన్ని చిట్కాలు ఇక్కడ తెలుపబడ్డ